ఏపీ లిక్కర్ పాలసీ: ప్రభుత్వానికి మద్యం వ్యాపారుల షాక్

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. అంచనా వేయగా... ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి.

  • Written By:
  • Publish Date - October 12, 2024 / 12:49 PM IST

ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. మొత్తం రెండు లక్షల దరఖాస్తులు.. అంచనా వేయగా… ఫీజు కింద రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని అధికారులు భావించారు. కొన్నిచోట్ల సిండికేట్లు ప్రభావం చూపించడంతో అంచనా కంటే కొంత తగ్గువగా దరఖాస్తులు వచ్చాయి. శుక్రవారం రాత్రి గడువు ముగిసేనాటికి మొత్తం 89,643 దరఖాస్తులు నమోదు అయ్యాయి. రూ.1800 కోట్లు ఫీజు కింద ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గత ప్రభుత్వ హయాంతో పోల్చితే ఈసారి మద్యం దరఖాస్తుల వ్యవహారంలో సిండికేట్ల హవా తక్కువగానే కనపడింది.

దీనివల్ల టార్గెట్ కంటే సుమారు 10,500 దరఖాస్తులు తక్కువగా నమోదు అయ్యాయి. దాదాపుగా రూ.200 కోట్లు మేర ఆదాయం తగ్గింది. నేతల ఆదేశాలు.. బెదిరింపులు పనిచేసిన కొన్నిచోట్ల దరఖాస్తులు ఇవ్వడానికి వ్యాపారులు వెనుకాడారు అనే వార్తలు వచ్చాయి. పల్నాడు జిల్లాలో సిండికేట్ కారణంగా కొన్ని ప్రాంతాల్లో షాపుకు సగటున 20 దరఖాస్తులు మాత్రమే నమోదు అయ్యాయి. బాపట్ల జిల్లాలో స్థానికులను తప్ప వేరేవారిని అడుగు పెట్టకుండా కొందరు నేతలు చక్రం తిప్పడం మైనస్ అయింది. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో షాపుకు 10 చొప్పునే దరఖాస్తులు వచ్చాయి.

మాజీ మంత్రి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇక్కడి ఒక నియోజకవర్గంలో దుకాణాలకు 8, 9, 10, 11 చొప్పున దరఖాస్తులు నమోదు కావడం కాస్త ఆశ్చర్యంగా ఉంది. చిత్తూరు జిల్లాలో 104 మద్య దుకాణాలకు 2,241 దరఖాస్తులు అందులో కొన్ని నియోజకవర్గాల్లో 200 దరఖాస్తులు వచ్చాయి. ఒకటి, రెండు నియోజకవర్గాల్లో షాపుకు 10 చొప్పునే దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో 104 మద్య దుకాణాలకు 2,241 దరఖాస్తులు అందులో కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 10 నుంచి 13 చొప్పున మాత్రమే దరఖాస్తులు అందడం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఇక కృష్ణా జిల్లాలో మద్యం వ్యాపారులు కుమ్మక్కు కావడం ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది. ఓ మునిసిపాలిటీలో 7 మద్యం దుకాణాలు ఉండగా 7, 13, 11, 9, 9, 8, 9 చొప్పున ఇక్కడ దరఖాస్తులు రావడం గమనార్హం. శ్రీసత్యసాయి జిల్లాలో ఎక్సైజ్ శాఖ కనీనం రెండు వేల దరఖాస్తులు వస్తాయని ఆశించగా, సిండికేట్ కారణంగా ఆ సంఖ్య కొంత తగ్గిందని అధికారులు పేర్కొన్నారు. అనంతపురం జిల్లాలో నిత్యం రాజకీయాలతో హాట్ హాట్ గా ఉండే ఒక పట్టణంలో 9 దుకాణాలు ఉండగా.. ఒక్కొక్క దుకాణానికి 3 చొప్పున దరఖాస్తులు రావడం విస్మయానికి గురి చేసింది. రూరల్ మండలంలో 3 దుకాణాలు ఉండగా.. రెండింటికి 2 చొప్పున, ఒక దుకాణానికి 3 దరఖాస్తులు రావడం చూసి అధికారులు విస్తుపోయారు. అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో 5787 దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ కొన్ని షాపులకి 50 పైనే దరఖాస్తులు వచ్చాయి. 2017కంటే నాలుగు రెట్లు ఆదాయం పెరగడం గమనార్హం.