Vinukonda Murderer : వినుకొండ హంతకుడు ఎవరు.. ఎవరి మనిషి.. అసలేం జరిగింది?

పల్నాడు జిల్లా జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై షేక్ అబ్దుల్ రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

పల్నాడు జిల్లా జిల్లా వినుకొండలో దారుణం జరిగింది. నడిరోడ్డుపై షేక్ అబ్దుల్ రషీద్‌ను జిలానీ అనే వ్యక్తి కత్తితో దారుణంగా దాడి చేశాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో ఇంత ఘోర ఘటనను చూడలేదంటూ సోషల్‌ మీడియాలో రియాక్షన్స్ కనిపిస్తున్నాయ్. ఐతే హంతకుడు జిలానీ.. ఎవరి మనిషి అంటూ.. ఇప్పుడు సోషల్‌ మీడియాలోచర్చ జరుగుతోంది. టీడీపీ, వైసీపీ.. ఎవరికి వారే.. మీవాడే అంటే మీవాడే అంటూ.. ఒకరిపై ఒకరు తోసేసుకుంటున్నారు.

బాధితుడు రషీద్ వైసీపీ కార్యకర్త కాగా… నిందితుడు జిలానీ, తెలుగు యువత నాయకుడు జానీ తమ్ముడు, టీడీపీ కార్యకర్త అని వైసీపీ ఆరోపిస్తోంది. లోకేష్ పుట్టినరోజు వేడుకల్లోనూ, 2024 ఎన్నికల ప్రచారంలోనూ టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులుతో జిలానీ ఉన్న ఫోటోలను వైసీపీ షేర్ చేసింది. దీనిపై టీడీపీ కూడా రియాక్ట్ అయింది. బాధితుడు, నిందితుడూ ఇద్దరూ వైసీపీ వారే అంటోంది. ఏది జరిగినా ముందు టీడీపీ మీద తోసేయడమే అని సీరియస్ అయింది.. వినుకొండలో రౌడీగా చలామణి అవుతున్న వైసీపీ నేతకు… వీరిద్దరూ ప్రధాన అనుచరులు అని చెప్తూ.. ఈ ఘటనకు సంబంధించిన ఓ పేపర్ కటింగ్‌ను పోస్ట్ చేసింది. ఐతే పోలీసులు మాత్రం.. వ్యక్తిగత కక్షలతోనే ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారని చెప్తున్నారు. ఏమైనా వినుకొండ వ్యవహారం.. ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతోంది.

జిలానీ ఎవడు.. అర్షద్ ఎవడు.. ఏ పార్టీల వారు అన్న సంగతి ఎలా ఉన్నా.. ఇలాంటి ఘటన సమాజం సిగ్గుపడేలా ఉందనే చర్చ జరుగుతోంది. నడిరోడ్డు మీద అందరు చూస్తుండగానే.. ఇంత దారుణాలను తెగించారంటే.. తప్పు చేసిన వాడిని ఎవరినీ క్షమించకూడదనే డిమాండ్లు వినిపిస్తున్నాయ్. ఇక వినుకొండ ఘటను వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. దీనిపై జాతీయ స్థాయి ఉద్యమానికి సిద్ధం అవుతోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దృష్టికి తీసుకెళ్లేందుకు ఫ్యాన్‌ పార్టీ రెడీ అవుతోంది. అటు జగన్‌.. వినుకొండలో పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. ఓదార్చబోతున్నారని తెలుస్తోంది.