FTL పరిధిలో ఇల్లు ఉంది అంటే ఏమాత్రం ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ఇల్లు కట్టినోడిది తప్పు ఐనప్పుడు అనుమతి ఇచ్చినోడిది కూడా తప్పే కదా. మరి వాళ్ల మీద ప్రభుత్వం చర్యలేవి. FTL ఇల్లు ఎందుకు కడుతున్నారు అని అప్పుడే ఎందుకు అడగలేదు. వాళ్లకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్ ఎందుకు ఇచ్చారు. వాళ్ల నుంచి బిల్లులు, టాక్స్‌లు ఎందుకు తీసుకున్నారు. వాళ్లిచ్చే డబ్బు కావాలి చివరికి వాళ్లే కబ్జాదారులు అవ్వాలి. ఇదేనా ప్రజాపాలన. సరే కొందరు కబ్జాలు చేసి వాళ్లు స్థానంలో పేదలను ఉంచుతున్నారు అనుకుందాం. అప్పుడు వాళ్లు బాధితులు కానీ నిందితులు కాదు కదా.
ప్రభుత్వం చర్యలు నిందితుల మీద ఉండాలి కానీ బాధితుల మీద ఎందుకు. సీఎం రేవంత్ అన్న ఇల్లు కూల్చకుండా హైకోర్ట్ నుంచి స్టే తెచ్చుకున్నారు. అలా హైకోర్టుకు వెళ్లే సమయం పేదలకు ఎందుకు ఇవ్వడంలేదు. వాళ్లకొక రూల్ వీళ్లకొక రూల్ ఎందుకు.. ఇదే ప్రజా ప్రభు్త్వమా? హైడ్రా కూల్చివేతలకు తప్పా ఒప్పా అనే విషయం పక్కన పెడితే.. FTL పరిధిలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇచ్చిన అధికారులది పెద్ద తప్పు. ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి వస్తే ముందు ఆ అధికారుల సస్పెన్షన్‌తో చర్యలు మొదలవ్వాలి. అలా చేయకుండా కేవలం పేదల ఇల్లు కూలిస్తే ప్రభుత్వం కచ్చితంగా రుణం చెల్లించుకోక తప్పదు.
హైడ్రా. హైదరాబాద్‌లోని చెరువులు, కుటుంటలకు సమీపంలో ఉంటున్నవాళ్లను వణికిస్తున్న పేరు ఇది. బఫర్ జోన్, FTL పరిధిలో నిర్మాణం ఉందని తెలిస్తే చాలు ముందు వెనకా ఆలోచించకుండా కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. ముఖ్యంగా మూసీ సరౌండింగ్స్‌లో వాళ్లు చేస్తున్న కూల్చేవేతలు ఎన్నో జీవితాలను రోడ్డున పేడస్తున్నాయి. తన ఇల్లు కళ్ల ముందే కూలిపోతుంటే వాళ్లు బాధితులు పెడుతున్న ఆర్తనాధాలు ప్రతీ ఒక్కరి కళ్లలో నీళ్లు తిరిగేలా చేస్తున్నాయి. పకృతిని కాపాడ్డం మనిషి బాధ్యత. మరి ఆ మనిషికే నివాసం లేకుండా చేయడం కరెక్టేనా. FTL పరిధిలో బఫర్‌జోన్‌లో వ్యవసాయం తప్ప నిర్మాణాలు ఏర్పాటు చేయొద్దు. ఇది గవర్నమెంట్ రూల్. నిర్మాణాలు చేపట్టినివాడిది తప్పు ఐనప్పుడు.. ఆ నిర్మాణానికి అనుమతి ఇచ్చినవాడిది కూడా తప్పు అవుతుంది కదా. ఇది ప్రభుత్వం ఎందుకు ఆలోచిండంలేదు. నిజానికి ఏది FTL ఏది బఫర్ జోన్ అనే అవగాహన చాలా మందికి ఉండదు.
రియల్టర్ ఏవేవో చెప్పి ఇల్లు అమ్మేస్తుంటారు. అలాంటప్పడు ఇల్లు కొన్నవాళ్లు బాధితులు అవుతారు. అలాంటప్పుడు ప్రభుత్వం నిందితులను పట్టుకోవాలి కానీ బాధితుల ఇల్లు ఎందుకు కూల్చేస్తోంది. అది కూడా ఎలాంటి సమచారం ఇవ్వకుండా ఇంట్లో సామాన్లు తీసుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా కూల్చుతున్నారు అంటే ఏం పాపం చేశారు వాళ్లు. సరే.. కొందరు అధికారులకు లంచాలు ఇచ్చి మేనేజ్ చేశారు అనుకుందాం. లంచం ఇవ్వడం తప్పు ఐనప్పుడు లంచం తీసుకోవడం కూడా తప్పే కదా. అలా చూసినా లంచం తీసుకున్న అధికారులను కూడా పట్టుకోవాలి చర్యలు తీసుకోవాలి కదా. కానీ ప్రభుత్వం వాళ్ల పేరు కూడా తీయడంలేదు ఎందుకు ?. హైడ్రా ఏర్పాటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేదు, ఎన్నికల హామీల్లో లేదు, ఏర్పాటు చేసే ముందు పెద్దగా హైడ్రా గురించి వివరించిందీ లేదూ. సైలెంట్‌గా వచ్చేస్తున్నారు కూల్చేస్తున్నారు. ఇది ఎంత వరకూ కరెక్ట్ అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఇదే FTL పరిధిలో సీఎం అన్న ఇల్లు కూడా ఉందని అధికారుల చెప్పారు.
ఆయన హైకోర్టుకు వెళ్లారు స్టే తెచ్చుకున్నారు. ఆ టైం ఆయనకు హైడ్రా ఇచ్చింది. కానీ అదే సమయం సామాన్యులకు ఎందుకు ఇవ్వడంలేదు. సీఎం అన్నకు ఒక రూల్.. సామాన్యులకు ఒక రూల్.. ఇదేనా ప్రజాపాలన ? దీనికోసమేనా ప్రజలు ఓట్లేసింది. హైడ్రా కూల్చివేతలను ప్రసారం చేయడం మీడియాకు ఎంత ముఖ్యమో.. ఆ కూల్చేవేతల వల్ల రోడ్డున పడుతున్న ప్రజల జీవిల గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కూడా మా మీడియా బాధ్యతే. బాధితులకు డబుల్‌బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నారు సరే. ఎప్పుడిస్తారు? ఎక్కడ ఇస్తారు? ఎన్నో ఏళ్లుగా ఒక ప్రాంతంలో బతికిన కుటుంబాలు ఉన్నట్టుంది వాళ్లు ఉద్యోగాలకు, పిల్లల స్కూళ్లకు, ఐనవాళ్లుకు దూరంగా ఎక్కడికో వెళ్లి బతకాలి అంటే అది రీహాబిలేట్ చేసినట్టా ? రీహాబిలిటేషన్ అనేది ఉన్న జీవితంగా బెటర్‌గా ఉండాలి కానీ అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డట్టుగా ఉండకూడదు ఖచ్చితంగా ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పి తీరాలి.