పుష్ప 2 సినిమా ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేన, టిడిపి గా మారింది. 2024 ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన దగ్గర నుంచి అతనిపై మెగా ఫ్యాన్స్ అలాగే జనసేన కార్యకర్తలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ అండతో పైకి వచ్చి ఇప్పుడు మెగా ఫ్యామిలీని దెబ్బ కొట్టాలని చూడడం అలాగే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను ఓడించాలని చూశాడు అంటూ మెగా ఫాన్స్ అలాగే జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ గా ఉన్నారు.
అందుకే ఇప్పుడు పుష్ప 2 సినిమాను అసలు చూడవద్దు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే చేస్తున్నారు. ఇదే టైంలో వైసిపి… పుష్ప సినిమాకు అండగా నిలబడింది. సోషల్ మీడియాలో వైసీపీకి సపోర్ట్ చేసే పేజెస్ అన్నీ కూడా ఇప్పుడు పుష్ప సినిమాను పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాయి. అలాగే వైసిపి నేతలు కూడా పుష్ప సినిమాకు మద్దతుగా మాట్లాడుతున్నారు. అనంతపురం అలాగే తిరుపతి సహా పలు రాయలసీమ జిల్లాల్లో ఏర్పాటు చేసిన కొన్ని ఫ్లెక్సీలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో పుష్ప 2 ఫ్లెక్సీ అందరినీ ఆకర్షిస్తోంది. పుష్ప 2 ఫ్లెక్సీలో వైయస్ జగన్ ఫోటో తో పాటుగా అల్లు అర్జున్ ఫోటోను కూడా ఏర్పాటు చేశారు. మా కోసం నువ్వు వచ్చావు నీ కోసం మేము వస్తాము… తగ్గేదేలే అంటూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఇక చంద్రగిరి నియోజకవర్గంలో వైసిపి వర్సెస్ టిడిపిగా పుష్ప సినిమా వేదికగా రాజకీయం జరుగుతోంది. బన్నీ ఫ్లెక్సీలో వైయస్ జగన్ ఫోటో అలాగే మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డి ఫోటోలు ఏర్పాటు చేశారు. మంచి చేసిన ఓడిపోయిన ఎమ్మెల్యే తాలూకా అంటూ ఫ్లెక్సీలో కొటేషన్ రాశారు.
2029లో కాబోయే సీఎం గారి తాలూకా అంటూ కొటేషన్స్ రాయడం చూసి సోషల్ మీడియాలో జనాలు షాక్ అవుతున్నారు. మా కోసం నువ్వు వచ్చావు మీకోసం మేమున్నాం అంటూ ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ఫ్లెక్సీలు కట్టడం చూసిన టిడిపి కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలను చించేశారు. దీనితో ఇరు వర్గాల మధ్య పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టే అక్కడనుంచి పంపించేశారు. ఇక వైసిపి అనుకూల మీడియా పుష్ప సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేస్తోంది.
అల్లు అర్జున్ కు మద్దతుగా మెగా ఫ్యామిలీని అలాగే పవన్ కళ్యాణ్ ను తిడుతూ వైసిపిని సపోర్ట్ చేస్తున్న మీడియా ఛానల్స్ ప్రమోట్ చేస్తున్నాయి. పుష్ప 2 సినిమా సూపర్ హిట్ అవుతుందని అది చూసి జీర్ణించుకోలేకనే మెగా ఫ్యామిలీ కుట్రలకు తెరలేపి కోర్టుల్లో కేసులు వేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తుందంటూ ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ హైకోర్టులో వర్కౌట్ కాకపోవటంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కేసు ఫైల్ చేశారని కావాలనే సినిమా హీరోయిన్లను కూడా ఇబ్బంది పెట్టాలని జనసేన పార్టీ చూస్తోంది అంటూ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటుగా వైసిపి అభిమానులు కూడా మండిపడుతున్నారు.
మెగా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా పుష్పాడ్ 2 సినిమాను అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా ప్రమోషన్ చేస్తున్నాడని ఇది జీర్ణించుకోలేకనే ఇప్పుడు మెగా ఫ్యామిలీ కుట్రలకు తెర లేపుతుందని… కావాలనే జనసేన నాయకులతో అల్లు అర్జున్ ను తిట్టిస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. ఇక వివాదాస్పద సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఎక్స్ లో పలు పోస్టులు పెడుతున్నారు. రియల్ మెగాస్టార్ అల్లు అర్జున్ అని అసలు లగ్జరీలకు పోయే జనాలు సినిమా టికెట్ రేట్ ల గురించి మాట్లాడటం ఏంటి అంటూ ఓ సెటైర్ వేసారు.
మెగా ఫ్యామిలీలో అల్లు అర్జున్ ఒక్కడే రియల్ మెగా అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇలా పుష్ప సినిమా వేదికగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధమే నడుస్తోంది. ఇక జనసేన నాయకులైతే పుష్ప సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని వార్నింగ్ లు ఇవ్వడం గమనార్హం. గన్నవరం జనసేన నేత ఒకరు అయితే అల్లు అర్జున్… చిరంజీవి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు జల్లుకోవాలని కామెంట్ చేసారు. పుష్ప సినిమా రిలీజ్ ను కచ్చితంగా అడ్డుకుంటాం అని వార్నింగ్ ఇచ్చారు. మరి ఫ్యూచర్ లో ఈ ఫ్యాన్ వార్ ఏ రేంజ్ కు వెళ్తుందో…