ఐకాన్ స్టార్ అరెస్టు వెనుక అసలు కథ….

హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఇప్పటికీ అసలు కారణం చాలామందికి తెలియదు. ఒక మహిళ మృతికి కారకుడనే ఆరోపణపై బన్నీని అరెస్ట్ చేసి, ఓ రాత్రి చంచలగూడ జైల్లో పెట్టి బెయిల్ పై విడుదల చేశారు. తొక్కిసలాట లో మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్ ఎలా కారకుడు అవుతాడు అనేది కొందరు వాదన.

  • Written By:
  • Publish Date - December 16, 2024 / 03:08 PM IST

హైదరాబాద్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఇప్పటికీ అసలు కారణం చాలామందికి తెలియదు. ఒక మహిళ మృతికి కారకుడనే ఆరోపణపై బన్నీని అరెస్ట్ చేసి, ఓ రాత్రి చంచలగూడ జైల్లో పెట్టి బెయిల్ పై విడుదల చేశారు. తొక్కిసలాట లో మహిళ చనిపోతే దానికి అల్లు అర్జున్ ఎలా కారకుడు అవుతాడు అనేది కొందరు వాదన. దానికి సమాధానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు. తొక్కిసలాట జరగడానికి పరోక్షంగా బన్నీ కారణమని, సంధ్య థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినవాడు… కార్ లోంచి బయటకు వచ్చి జనాన్ని రెచ్చగొడుతూ అభివాదం చేశాడని, అతన్ని చూడడానికి పబ్లిక్ ఎగబడ్డారని…. దీంతో తొక్కిసలాట జరిగిందని, మహిళ మరణించడం తోపాటు, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడని రేవంత్ చెప్తున్నారు. ఇదంతా నిజమే అయినా అరెస్టుకి కారణమైన అసలు కథ వేరుగా ఉంది.

అల్లు అర్జున్ అతి వేషాలు, ఓవరాక్షన్, నోటి దూల ఇవన్నీ కలగలిసి అతని అరెస్టుకు దారి తీసేయ్. పుష్ప టిక్కెట్లు రేట్లు పెంచుకోవడానికి, బెనిఫిట్ షో ల కోసం ఆ మూవీ నిర్మాతలు ముఖ్యమంత్రి చుట్టూ ఒకటికి పది సార్లు తిరిగారు. ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు ఇందుకోసం ప్రత్యేక జీవో కూడా ఇచ్చాయి.300 రూపాయల టికెట్ 900 రూపాయలకి, ఆపై 1500 రూపాయలకి అమ్ముకొని నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వందల కోట్లు సంపాదించారు. జనం నుంచి నిరసనలు వచ్చిన, స్వచ్ఛంద సంస్థలు అభ్యంతరాలు చెప్పినా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అల్లు అర్జున్ ని, పుష్ప నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకొని టికెట్లు రేట్లు పెంచుకోవడానికి అనుమతించాయి. ఒక రకంగా బహిరంగ దోపిడీకి ప్రభుత్వాలే అల్లు అర్జున్ అండ్ గ్యాంగ్ కి పర్మిషన్ ఇచ్చినట్లు అయింది. చిరంజీవి ఫ్యామిలీ కి, అల్లు అర్జున్ కి మధ్య కొద్ది రోజులుగా గ్యాప్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. బన్నీ తన సొంత బ్రాండ్ కోసం ప్రయత్నం చేయడం, ఎక్కడపడితే అక్కడ బడాయి మాటలు మాట్లాడడం, తన ఫ్యాన్స్ ని అల్లు ఆర్మీగా పీల్చుకోవడం ఇవన్నీ మెగా ఫ్యామిలీ కి, స్టైలిస్ట్ స్టార్ కి మధ్య దూరం పెంచాయి. హైదరాబాదులో ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టాలి అనుకున్నప్పుడు యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ కోసం నిర్మాతలు ప్రయత్నిస్తే పోలీసులు మొదటి నిరాకరించారు.

అక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పే ప్రమాదం ఉందని చెప్పారు. నిర్మాతలు మళ్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కాంటాక్ట్ చేసి మొత్తం మీద యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ కి అనుమతి తెచ్చుకున్నారు. ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కి సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యఅతిథిగా పిలుద్దామని నిర్మాతలు ప్రతిపాదిస్తే అల్లు అర్జున్ దాన్ని తోసిపుచ్చాడు .పైగా రేవంత్ రెడ్డిని ఆఫ్ట్రాల్ అన్నట్టుగా ఒక లూజ్ కామెంట్ కూడా చేసినట్లు తెలిసింది. అంతేకాదు అసలు ఫంక్షన్ కి ఎవర్ని చీఫ్ గెస్ట్లుగా పిలవాల్సిన అవసరం లేదని, మెగాస్టార్ చిరంజీవి కూడా అక్కర్లేదని, తాను ఉండగా మరొకరు ఎందుకని చెప్పేశాడు. ఏపీ ప్రభుత్వ రథసారథులు చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లను కూడా పిలవాల్సిన అవసరం లేదని కరాకండిగా చెప్పేసాడు అల్లు అర్జున్. ఈ సమాచారం ముఖ్యమంత్రి రేవంత్ కి ఒక కీలక వ్యక్తి ద్వారా చేరింది. మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పుష్పా టీం పై కారాలు మిరియాలు నూరుతున్నారు. టికెట్లు రేట్లు పెంచుకోవడానికి తనను సంప్రదించకుండా డైరెక్ట్ గా ముఖ్యమంత్రి కార్యాలయం తోనే అన్ని పనులు చేసుకున్నారని, మాటవరసకైనా తనకు చెప్పలేదని కోమటిరెడ్డి రగిలిపోతున్నారు. మరోవైపు అసలు సినిమా ఇండస్ట్రీ అంటేనే రేవంత్ కు కొంత అసహనం ఉంది. టిఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ సినిమా ఇండస్ట్రీ తో రాసుకు పూసుకు తిరిగారు. ప్రతి ఫంక్షన్లోనూ కేటీఆర్ కనిపిస్తూ ఉండే వాడు. ఎందుకో రేవంత్ రెడ్డికి సినిమా ఇండస్ట్రీకి ఈ మధ్య అంత పోసగడం లేదు. ఆమధ్య రేవంత్ రెడ్డి బర్త్ డే కు సినిమా వాళ్ళు ఎవరు, కనీసం విషెస్ కూడా చెప్పలేదని తెలిసింది. ఒక పారిశ్రామిక బర్త్డేకి 50 మంది సినిమా వాళ్లు ఎగేసుకొని మాల్దీవ్స్ వెళ్లి సెలబ్రేట్ చేసుకున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి బర్త్ డే మీకు గుర్తుకు రాలేదా అని కొందరు ఇండస్ట్రీ ని ప్రశ్నించారు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చుట్టూ సినిమా వాళ్లంతా గుంపులు గుంపులుగా తిరుగుతుండేవాళ్ళు. కేటీఆర్ బర్త్డే వస్తే పర్సనల్గా కలిసి విషెస్ చెప్పిన వాళ్ళు ఉన్నారు.

ఇక పుష్ప టు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు స్టేజ్ పై ముఖ్యమంత్రి పేరు కూడా గుర్తు లేనట్లు అల్లు అర్జున్ వ్యవహరించారు. ముఖ్యమంత్రి ఎవరు? ఆయన పేరేమిటి అన్నట్లు మొఖం పెట్టారు. ఇదే విషయాన్ని ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో కేటీఆర్ లేవనెత్తుతూ ఒక పాపులర్ హీరోకి రేవంత్ రెడ్డి పేరు గుర్తు లేదంటే, ఈ రాష్ట్ర ప్రజలు సీఎం అవసరం లేదు అని భావిస్తున్నారని అని వెక్కిరించారు. ఇదంతా చూశాక అల్లు అర్జున్ అండ్ సినిమా ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డికి మరింత అసహనాన్ని పెంచింది. ఈ కేసులో అతని రక్షించాల్సిన అవసరం లేదని భావించారు తెలంగాణ ప్రభుత్వ పెద్దలు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళ విషయంలో కఠినంగా కూడా ఉండాలని డిసైడ్ అయ్యారు. భవిష్యత్తులో బెనిఫిట్ షోలు ఉండవని అప్పటికే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించేసారు కూడా. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు పెట్టాక కూడా అల్లు అర్జున్ గాని ఆయన కుటుంబ సభ్యులు గానీ ఎవ్వరు సీఎం ఆఫీస్ ని కాంటాక్ట్ చేయలేదు. అప్పటికే బన్నీ ప్రవర్తనతో విసిగిపోయి ఉన్న చిరంజీవి కూడా కనీసం ఈ కేసు విషయంలో ఎక్కడ జోక్యం చేసుకోలేదు. ఎన్నికల్లో వైసీపీ నేతకు ప్రచారం చేసిన అల్లు అర్జున్… ఆ తర్వాత తన వైఖరిని బహిరంగంగానే సమర్ధించుకొని పవన్ కళ్యాణ్ ,చంద్రబాబుకు కూడా దూరమయ్యారు.

ఈ పరిణామాలన్నీ అల్లు అర్జున్ అరెస్టుకి పరోక్షంగా కారణమయ్యాయి. పుష్ప హిట్ తో ఎక్కడో హైట్స్ లో ఉన్న అల్లు అర్జున్ ఈ కేసులో తనని ఎవడు ఏం పీకుతాడు లే అని అనుకున్నాడు. పీకడం మొదలు పెడితే అది ఎలా ఉంటుందో చూపించారు పోలీసులు. అరెస్టు సమయంలోను బన్నీ వ్యవహరించిన తీరు పబ్లిక్ కి, పోలీసుల కి కూడా ఇరిటేషన్ తెప్పించింది. బన్నీ అరెస్ట్ అయిన తర్వాత కూడా చిరంజీవి ఎక్కడ జోక్యం చేసుకోలేదు. కనీసం సీఎం తో కూడా దీని గురించి అమ్మ నీకు కూడా మాట్లాడలేదు. తన పేరు చెప్పనందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు అంటూ వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అతన్ని ఎందుకు అరెస్టు చేయకూడదు అంటూ ప్రశ్న లేవనెత్తారు. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ చేసినప్పటికీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది.సాంకేతిక కారణాలతో ఒక్కరోజు రాత్రి బన్నీ చంచల్గూడా జైల్లో గడపాల్సొచ్చింది. అహంకారం, మిడిసిపాటితనం ఎక్కువైతే పరిస్థితులు ఎలా అడ్డం తిరుగుతాయో స్టైలిష్ స్టార్ కి తెలిసి వచ్చింది. ఐ కాన్ స్టార్ అరెస్టు వెనుక ఇంత కథ ఉంది.