ఏపి హైకోర్టుకు చేరింది కాకినాడ పోర్టులోని స్టెల్లా నౌక సీజింగ్ వ్యవహారం. అన్ని అనుమతులు ఉన్న తమ పారా బాయిల్డ్ రైస్ ను స్టెల్లా నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. తమ రైస్ లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసారు. తమ బియ్యాన్ని నౌకలో లోడు చేయకుండా అడ్డుకుంటున్నారని చిత్ర, యాగ్రీ ఎక్స్ పోర్టు, పద్మశ్రీ రైస్ మిల్, సూర్యశ్రీ రైస్ మిల్ యజమానులు భాస్కరరెడ్డి, గంగిరెడ్డి, విశ్వనాధ రెడ్డి పిటీషన్ దాఖలు చేసారు.
పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. బియ్యం రవాణా చేసేందుకు అనుమతులు ఉన్నాయా అని హైకోర్ట్ ప్రశ్నించింది. నౌకలో బియ్యం లోడు చేయకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఉన్న అధికారాలు ఏమిటని హైకోర్ట్ నిలదీసింది. వివరాలు సమర్పించేందుకు తమకు సమయం కావాలని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోరారు. తదుపరి విచారణ ఈనెల 19కి వాయిదా వేసింది హైకోర్టు.