హైడ్రాకు షాకిచ్చిన సుప్రీం, ఇక కూల్చివేతలకు బ్రేక్‌ ?

కొంత కాలంగా దేశంలో పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ పై వచ్చిన పిటీషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.

  • Written By:
  • Publish Date - November 13, 2024 / 05:59 PM IST

కొంత కాలంగా దేశంలో పెరుగుతున్న బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ యాక్షన్ పై వచ్చిన పిటీషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలోనే కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితులు చేసిన తప్పిదాలకు శిక్షగా అప్పటికిప్పుడు బుల్డోజర్ న్యాయం అందించడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేవలం ఆరోపణలతో ఏకపక్షంగా పౌరుల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేయడం రాజ్యంగ చట్టాన్ని, అధికారుల విభజన సూత్రాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందని తెలిపింది. శిక్ష పేరుతో అధికారులు చట్ట విరుద్దంగా పౌరుల ఆస్తులను కూల్చివేయడం సరికాదని సుప్రీం కోర్టు చెప్పింది.

నిందితులపై చర్యలు తీసుకునే ముందు న్యాయపరమైన విచారణ జరగాలని సుప్రీం కోర్టు పేర్కొంది. అధికారులే ఆస్తులను లీగల్, ఇల్లీగల్ అని నిర్ధారించి చర్యలు తీసుకోవడం తప్పుబడుతూ సంచలన తీర్పు చెప్పింది. కొంత కాలంగా పలు రాష్ట్రాల్లో నేరాలు చేసిన వారి ఇళ్లు, అక్రమంగా కబ్జా చేసిన వారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చివేస్తున్నారు అధికారులు. అధికారుల చర్యల వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడటమే కాదు.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూశాయి. ఇటు హైదరాబాద్‌లో కూడా హైడ్రా చర్యలు రాష్ట్రవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారాయి. దీంతో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ‘బుల్డోజర్ చర్యల’పై పిటిషన్లు రాగా.. దీనిపై విచారణ కొనసాగించింది. ఇకపై బుల్డోజర్ యాక్షన్ తీసుకోవాలంటే 15 రోజుల ముందు బాధితులకు నోటీసులు తప్పకుండా ఇవ్వాలి.

నోటీసులను మూడు నెలల్లోపు డిజిటల్ పోర్టల్ లో ఉంచాలి. కూల్చివేతలు తప్పని సరి అయితే దానికి గల కారణాలు స్పష్టంగా వివరించాలి. నోటీసులను రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాలి. కూల్చి వేత సమయంలో వీడియోగ్రఫీ చేయాలి.. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కోర్టు దిక్కారం అవుతుంది. నష్టపరిహారంగా అధికారుల జీతం నుంచి జరిమానా వసూలు చేస్తామని సుప్రీం సీరియస్ గా వార్నింగ్ ఇచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ లో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్యాంగ్‌స్టర్స్, మాఫియా ఇతర నేరాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇటు హైదరాబాద్‌లో హైడ్రా కూడా భారీగా ఇళ్ల కూల్చేవేత పనులు చేస్తోంది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో అటు యూపీలో ఇటు హైదరాబాద్‌లో హైడ్రాకు కూడా బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.