హైడ్రాకు ఫుల్ పవర్స్, ఇక చుక్కలు షురూ

తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 5, 2024 / 04:27 PM IST

తెలంగాణాలో ఇప్పుడు హైడ్రా దూకుడుతో జనాలకు కంటి మీద కునుకు లేకుండా పోయిన సంగతి తెలిసిందే. హైడ్రాకు చట్టబద్దత లేకుండానే కీలక భవనాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేసాయి. ప్రభుత్వం చట్టబద్దత కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి రాజ్ భవన్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.

హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ గెజిట్‌ విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. హైడ్రాకి చట్టబద్ధత కల్పించాలని ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్డినెన్స్ కు గవర్నర్‌ ఆమోదం తెలపడంతో గెజిట్‌ ను తెలంగాణా సర్కార్ విడుదల చేసింది. దీనితో ఇప్పుడు ఏ భవనాలను హైడ్రా కూలుస్తుందో అనే ఆందోళన మొదలయింది. త్వరలోనే కీలక భవనాలను నేలమట్టం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.