Vivek Venkataswamy : 8 కోట్ల బదిలీయే కొంపముంచింది.. అందుకేనా వివేక్ ఇంట్లో సోదాలు !

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సోమాజీగూడతో పాటు... చెన్నూరులోనూ ఒకే టైమ్ లో ఈడీ, ఐటీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ లీడర్లను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.

చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సోమాజీగూడతో పాటు… చెన్నూరులోనూ ఒకే టైమ్ లో ఈడీ, ఐటీ అధికారులు సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎన్నికల టైమ్ లో కాంగ్రెస్ లీడర్లను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటిదాకా బీజేపీలో ఉండి బయటకు వచ్చినందుకే ఈ ఎటాక్స్ అని మరికొందరు అంటున్నారు. అయితే ఈడీ, ఐటీ అధికారుల సోదాల వెనుక మరో బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.

Uttarakhand Uttarkashi : ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీలోని సొరంగం చిక్కుకున్న 41 కార్మికులు.. మొదటి రోజు కార్మికులకు కిచిడీ ని పంపించిన అధికారులు

కాంగ్రెస్ పార్టీ చెన్నూరు అభ్యర్థి వివేక్ తో పాటు ఆయన అన్న బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ ఇంట్లోనూ ఈడీ, ఐటీ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, సోమాజిగూడ, మంచిర్యాల జిల్లా చెన్నూరులో ఈ రెయిడ్స్ ఒకే టైమ్ లో స్టార్ట్ చేశారు అధికారులు. అందుకోసం కేంద్ర బలగాల పహారాగా పెట్టుకున్నారు. వివేక్ పై ఎన్నికల ముందు దాడులు చేయడాన్ని… కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారు. అయితే ఆయన కంపెనీల తరపున భారీ లావాదేవీలు కూడా ఈ ఎటాక్స్ కి కారణంగా కనిపిస్తోంది.

ఈనెల 15 వివేక్ కు చెందిన కంపెనీ ఉద్యోగులు చెన్నూరుకు 50 లక్షలు తరలిస్తూ హైదరాబాద్ లోని రామంతపూర్ లో పట్టుబడ్డారు. ఇది కాకుండా ఆయన కంపెనీకి సంబంధించి RTGS ద్వారా 8 కోట్ల రూపాయల ఆన్ లైన్ లావాదేవీలు కూడా జరిగాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో… ఆన్ లైన్ లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలపై బ్యాంక్ సిబ్బంది ఏ రోజుకారోజు… ఐటీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. విశాక ఇండస్ట్రీస్ కంపెనీకి చెందిన బేగంపేటలోని HDFC ఖాతా నుంచి… ఈనెల 13న ఉదయం 8 కోట్ల రూపాయలు RTGS ద్వారా బదిలీ అయ్యాయి. బషీర్ బాగ్ లోని IDBI బ్యాంక్ లోని విజిలెన్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు ఈ అమౌంట్ పంపారు. దీనిపై BRS నేతలు ఈసీకి కంప్లయింట్ ఇచ్చారు. డబ్బులు పంపినట్టు ఆధారాలు కూడా ఉండటంతో… ఎన్నికల కమిషన్ సైఫాబాద్ పోలీసులకు విచారణకు ఆదేశించింది. దాంతో 8 కోట్ల రూపాయలను పోలీసులు ఫ్రీజ్ చేశారు

కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తుండటంతో బీఆర్ఎస్, బీజేపీ కలసి ఈడీ, ఐటీ దాడులు చేయిస్తున్నాయని ఆయన అనుచరులు ఆరోపిస్తున్నారు. అయితే ఈమధ్యే బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ కూడా వివేక్ పై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు ప్రయత్నిస్తున్నారనీ… ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేస్తున్నారని కంప్లయింట్ లో తెలిపారు. ఈ ఫిర్యాదుతో పాటు… వివేక్ కంపెనీ ఉద్యోగులు డబ్బులతో పట్టుబడటం, 8 కోట్ల రూపాయలు RTGS ద్వారా ట్రాన్స్ ఫర్ కొట్టడంపై ఈసీయే… ఈడీ, ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. పొలిటికల్ రీజన్స్ ఉన్నాయో… లేవో అన్నది పక్కనబెడితే… బహిరంగంగా కోట్ల రూపాయల లావాదేవీలు జరగడం కూడా వివేక్ ఇంటిపై దాడులకు కారణమని తెలుస్తోంది.