సీఎం కుర్చీలో బీజేపి, ఎన్సీపీ, శివసేనకు ఈ శాఖలు ఖరారు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - November 29, 2024 / 11:00 AM IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం విషయంలో మహాయుతి కూటమి ఓ అంగీకారానికి వచ్చింది. అర్థరాత్రి వరకు అమిత్ షా నివాసంలో జరిగిన మహాయుతి నేతల సమావేశంలో మూడు పార్టీల నేతలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో అమిత్ షా తో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ పాల్గొని నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఇక సమావేశం అనంతరం ఫడ్నవీస్, అజిత్ పవార్ ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళారు. ఇక అక్కడే ఉండిపోయిన ఏక్ నాథ్ షిండే… బిజెపి అగ్ర నేతల ముందు పలు డిమాండ్ లు ఉంచారు.

సమావేశంలో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడంపై మిగతా రెండు మిత్రపక్షాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చర్చలు కొలిక్కి వచ్చాయని జాతీయ మీడియా తెలిపింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం హోం మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ మంత్రిత్వ శాఖ వంటివి బీజేపీకే ఉండనున్నాయి. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, పీడబ్ల్యూడీ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు శివసేనకు ఇస్తారు. ఇక ఎన్సీపీకి వ్యవసాయం, నీటిపారుదల, ఆహార సరఫరా, వైద్య మరియు సాంకేతిక విద్య మంత్రిత్వ శాఖలు వెళ్తాయి. కొత్త మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రులుగా ఉండాలని ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్‌లను బీజేపీ అగ్ర నాయకత్వం కోరినట్టు సమాచారం.