2019 లో వైసీపీ 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎంలపై టీడీపీ విమర్శలు… 2024 లో కూటమి 164 గెలిచినప్పుడు వైసీపీ విమర్శలు. ఈవీఎంల విషయంలో అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసినప్పుడు వైసీపీ అధినేత జగన్ పెద్ద ఎత్తున వివరణ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే వివరణ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి టీడీపీ సమాధానం చెప్పింది. అయితే అప్పుడు టీడీపీ వేయని అడుగు ఇప్పుడు వైసీపీ వేసింది. ఈవీఎంల పని తీరుపై వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసారు.
ఈవీఎంలో ఓట్ల లెక్కింపు అనేది సక్రమంగా జరగడం లేదని ఆయన ఆరోపణ. వీవీ ప్యాట్ లో మాత్రం ఓటు వేసిన పార్టీ గుర్తు వస్తున్నా, లెక్క పెట్టె సమయంలో అలా జరగడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఆయన జూన్ 10 న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా… దీనిని పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం అధికారులు ఈ నెల 19 నుంచి 24 వరకు మాక్ పొలింగ్ కు అనుమతి ఇచ్చారు. నేటి నుంచి ఈ మాక్ పోలింగ్ జరుగుతుంది. ప్రతీ రోజు రెండు ఈవీఎంలలో మాక్ పోలింగ్ జరుగుతుంది.
అదే రోజు సాయంత్రం వాటిని లెక్కిస్తారు. అన్ని ఎర్పాట్లు చేసిన జిల్లా అధికారులు… బాలినేనితో పాటు 26 మంది అభ్యర్థులకు సమాచారం పంపించారు. అయితే బాలినేని హాజరు అవుతారా లేదా అన్నది ప్రశ్నగా మారింది. ఆయన హాజరు కాకపోయి ఉంటే ఆయన ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై ఆయన హైకోర్ట్ కి వెళ్ళారు. వీవీ ప్యాట్ స్లిప్ లను లేక్కపెట్టాలని ఆయన హైకోర్ట్ లో రిట్ పిటీషన్ దాఖలు చేయగా సింగిల్ జడ్జి ముందు విచారణ చేయనున్నారు. ఇసి ఇచ్చిన మాక్ పోలింగ్ వ్యవహారం సుప్రిం కొర్టు మార్గదర్శకాలకు అణుగుణంగా లేదని బాలినేని హైకోర్ట్ కి వెళ్ళారు. ఇక ఈ పిటీషన్ లో ముగ్గురుని ప్రతివాదులుగా చేర్చారు. 1,సెంట్రల్ ఇసి, 2, స్టేట్ ఇసి,3. జిల్లా ఇసీని చేర్చారు.