మెగా బ్రదర్ నాగబాబు అనుకున్నది సాధించారు. రాజ్య సభ మిస్ అయినా త్వరలో ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్నారు.జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు.రాజ్యసభకు టీడీపీ ఇద్దరు అభ్యర్థులను ప్రకటించడంతో..నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చి సంతృప్తి పరచాల్సి వచ్చింది. జనసేనలో చురుగ్గా పనిచేస్తోన్న నాగబాబు.. ప్రస్తుతం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎంపీ గా పోటీ చేయాలని చివరి నిమిషం వరకు నాగబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అనకాపల్లి బీజేపీ కోటాలో సీఎం రమేష్ కి కేటాయించడం తో నాగబాబు నిరాశపడ్డారు. 2014 లో నరసాపురం ఎంపీ గా పోటీ చేసివొడిపోయిన నాగబాబు తనకు ఏదో ఒక పదవి ఇవ్వాలని పవన్కల్యాణ్ పై ఒత్తిడి తెస్తు న్నట్లు సమాచారం. నాగబాబు కి రాజ్యసభ ఇప్పించడానికి పవన్ చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఢిల్లీ కూడా వెళ్లి ప్రథాని, అమిత్ షా లతో మాట్లాడి వచ్చారు.
కానీ కాలి అయిన రాజ్యసభ సీట్లు మూడింటిలో 2 పాత వాళ్లకే ఇవ్వడం తో నాగబాబు ని అకామిడేట్ చేయలేక పోయారు. చివరకు పవన్ ఒత్తిడి తో నాగబాబు కి మంత్రి పదవి ఇవ్వడానికి బాబు అంగీకరించారు.నాగబాబు కి మొదట మంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లో ఎంఎల్సీ చేస్తారు. సీఎం చంద్రబాబు నిర్ణయంతో త్వరలోనే మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు నాగబాబు .ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి.. 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి పవన్ కల్యాణ్, కందుల దుర్గేశ్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. అయితే…కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి ఒక మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉంది. అందుకే నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించారు సీఎం. ఒకే మంత్రివర్గం లో సొంత అన్నదమ్ములు ఒకేసారి మంత్రులుగా ఉండటం ఒక రికార్డ్. ఇది నాగబాబు, పవన్ కళ్యాణ్ సాధించారు. అంతే కాదు ఒకే కుటుంబం లో ముగ్గురు అన్నదమ్ములు మంత్రులుగా ఉండటం ఒక రికార్డ్. 2012 లో చిరంజీవి మన్మోహన్సింగ్ మంత్రివర్గంలో కేంద్ర టూరిజం మంత్రిగా చేసారు. ఇప్పుడు పవన్, నాగబాబు చంద్రబాబు రాష్ట్ర మంత్రి వర్గం లో మంత్రులుగా ఉంటున్నారు. ఇది కూడా రికార్డే.