Top story :బిట్ కాయిన్ రాకింగ్… మహారాష్ట్ర షేకింగ్

మహారాష్ట్ర రాజకీయాలను బిట్‌ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్‌లో ఉన్నదెవరు...? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది...?

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 02:42 PM IST

మహారాష్ట్ర రాజకీయాలను బిట్‌ కాయిన్ స్కామ్ షేక్ చేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు 6వేల 6వందల కోట్ల కుంభకోణం ఇది. ఇంతకీ ఈ డర్టీ ఎపిసోడ్‌లో ఉన్నదెవరు…? శరద్ పవార్ కూతురు సుప్రియాసూలే పేరెందుకు వచ్చింది…? బీజేపీ గేమ్‌లో భాగంగానే ఎన్నికల రోజు ఆడియోలు లీకయ్యాయా…? అసలు ఈ స్కామ్ ఎక్కడ మొదలైంది…?

మహారాష్ట్ర ఓటెత్తుతున్న సమయంలో బిట్‌కాయిన్‌ స్కామ్‌ మరోసారి తెరపైకి వచ్చింది. కాదు కాదు వ్యూహాత్మకంగా దాన్ని బయటకు తీసి మహా వికాస్ అఘాడీకి షాక్ ఇచ్చింది బీజేపీ. రాష్ట్ర ఎన్నికలకు సంబంధించిన లావాదేవీల్లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానాపటోలే, ఎన్సీపీ ఎంపీ సుప్రియాసూలే బిట్‌కాయిన్‌లను ఉపయోగించారంటూ మాజీ పోలీస్ అధికారి రవీంద్ర పాటిల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వెంటనే బీజేపీ ఎంపీ సుదాన్షు ద్వివేది దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు, కాల్ రికార్డులు, ఆడియోలు రిలీజ్ చేశారు. బిట్ కాయిన్ స్కామ్‌లో నిందితుడుగా ఉన్న వ్యక్తితో సుప్రియాసూలే మాట్లాడినట్లుగా ఆ ఆడియోలో ఉంది. బిట్ కాయిన్స్ ను క్యాష్ చేసుకోవడానికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని, తాము అధికారంలోకి రాగానే విచారణ లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

టెక్నాలజీ పెరిగిపోయిన ఈ రోజుల్లో ఇలాంటి ఆడియోలు సృష్టించడం నిమిషాల్లో పని. దీంతో జనంలో దీనిపై డివైడ్ టాక్ వచ్చింది. సరిగ్గా ఆ సమయంలోనే బీజేపీ మరో కార్డ్ వదిలింది. అందులోని వాయిస్ సుప్రియా సూలేదే అని ఆమె సోదరుడు, ఎన్సీపీ అధినేత అజిత్‌పవార్ ధృవీకరించడంతో రచ్చ పీక్స్ కు చేరింది. దీనిపై మండిపడ్డ సుప్రియాసూలే ఎంపీ సుదాన్షు ద్వివేదికి లీగల్‌ నోటీసులు పంపారు. అయితే సరిగ్గా ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఈ వివాదం తెరపైకి రావడానికి కారణం బీజేపీ గేమ్ ప్లాన్ అని తెలుస్తోంది. ఆ స్క్రీన్ షాట్క్, ఆ ఆడియో ఒరిజినలో కాదో ఎవరికీ తెలియదు. కానీ జనంలో మాత్రం సరికొత్త అనుమానాలు రేపారు.

నిజానికి ఇది 2018నాటి కేసు… బిట్‌కాయిన్‌లో పెట్టుబడులు పెడితే నెలకు 10శాతం లాభాలు వస్తాయంటూ అమాయక జనాలను మల్టీ లెవల్ మార్కెటింగ్ ద్వారా మోసం చేశారన్నది ఆరోపణ. అంటే లక్ష రూపాయలు పెడితే నెలకు పదివేలు. వాటిని మళ్లీ ఇన్వెస్ట్ చేస్తే ఆ పై నెలకు అసలు లక్షా పదివేలు… వడ్డీ 11వేలు… దాన్ని మళ్లీ పెట్టుబడి పెట్టుకుంటూ పోతే అంతొస్తుంది ఇంతొస్తుంది అని నమ్మించారు. కొన్నాళ్లు బాగానే చెల్లింపులు చేశారు. ఎప్పుడైతే తాము అనుకున్న టార్గెట్ ను రీచ్ అయ్యారో అప్పుడే జెండా పీకేశారు. జనం నుంచి 6వేల 600 కోట్లు వసూలు చేసి జంపైపోయారు. అప్పట్లో రాష్ట్రాన్ని ఈ కేసు షేక్ చేసింది. ఈ కేసులో సింపి భరద్వాజ్, నితిన్‌గౌర్‌, నిఖిల్‌ మహాజన్‌లను ఈడీ అరెస్ట్ చేసింది. కీలక నిందితులు ఇద్దరు పరారీలో ఉన్నారు. అసలు సూత్రధారి 2021లోనే చనిపోయాడు. ఈ కేసు నిందితులతోనే సుప్రియాసూలే మాట్లాడినట్లుగా ఆడియోలు బయటకు వచ్చాయి.

వేళ ఇలా పార్టీలు డబ్బులు వసూలు చేయడం మామూలే. అయితే అది భారీ బిట్ కాయిన్ కేసు నిందితుల నుంచి వసూలు చేసినట్లు తేలడమే సంచలనం రేపింది, బిట్‌కాయిన్ స్కామ్‌పై ఇప్పటికే సీబీఐ, ఈడీ రంగంలోకి దిగాయి. ఇప్పుడు సుప్రియాసూలే పేరు రావడంతో కేసు మరో మలుపు తిరిగింది. సీబీఐ, ఈడీలు ఈ కోణంలో కూడా విచారణ జరిపే అవకాశం లేకపోలేదు. ఒకవేళ మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే శరద్ పవార్ కు ఆ ఆనందం నిలువకుండా చేస్తుంది బీజేపీ. చచ్చినట్లు పవార్ కాస్త కంట్రోల్ లో ఉండాల్సిందే. లేకపోతే కూతురు జైలుకు వెళ్లాల్సి వస్తుంది. మొత్తానికి పవార్ ఫ్యామిలీని బాగా ఇరికించింది బీజేపీ.