TOP STORY: షర్మిల సెక్యూరిటీపై పవన్ కామెంట్స్.. కారణం అదేనా…?

ఘర్ ఘర్ కి కహాని ఇప్పుడు పొలిటికల్ రివెంజ్ కహానిగా మారుతోందా...? అన్నా చెల్లెళ్ళ పోరాటంలో చెల్లెలి వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ నిలబడటం వెనుక రీజన్ ఏంటీ...? షర్మిల భుజంపై తుపాకి పెట్టి జగన్ కు గురిపెట్టారా...?

  • Written By:
  • Publish Date - November 3, 2024 / 01:12 PM IST

ఘర్ ఘర్ కి కహాని ఇప్పుడు పొలిటికల్ రివెంజ్ కహానిగా మారుతోందా…? అన్నా చెల్లెళ్ళ పోరాటంలో చెల్లెలి వెంట ఉప ముఖ్యమంత్రి పవన్ నిలబడటం వెనుక రీజన్ ఏంటీ…? షర్మిల భుజంపై తుపాకి పెట్టి జగన్ కు గురిపెట్టారా…? ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు ఈ ప్రశ్నలు బొంగరాలు తిరుగుతున్నాయి. వైఎస్ జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల ఆస్తుల స్టోరీలో మొన్నటి వరకు టీడీపీ ఉంటే ఇప్పుడు జనసేన కూడా ఎంటర్ కావడం విస్మయానికి గురి చేస్తోంది. జగన్ కు పొలిటికల్ సినిమా 70 ఎంఎం థియేటర్లో చూపించడానికి గ్రౌండ్ వర్క్ గ్రాండ్ గా ప్లాన్ చేసినట్టే కనపడుతోంది.

ఆస్తుల కోసం పోరాటం మొదలుపెట్టి తెలంగాణాలో పార్టీ పెట్టి… కేసీఆర్ ను ఓడించి, సైలెంట్ గా పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి… స్పీడ్ గా ఏపీలో అడుగుపెట్టి… ఏపీ ఎన్నికల్లో సొంత జిల్లాలో అన్నకు మూడు చెరువుల నీళ్ళు తాగించి… 7 సీట్లలో, ఎంపీ స్థానంలో సక్సెస్ఫుల్ గా ఓట్లు చీల్చి… ఇప్పుడు ఏకంగా బహిరంగ ఆస్తుల యుద్దానికి దిగారు షర్మిల. తెలంగాణకు మాత్రమే షర్మిల పరిమితం అనుకున్న జగన్ కు ఇప్పుడు షర్మిల దూకుడుతో ముద్ద దిగడం లేదు. షర్మిలను తక్కువ అంచనా వేయోద్దనే అంచనాకు జగన్ వచ్చేశారు.

కాకపోతే జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత జగన్ లో రియలైజేషన్ స్టార్ట్ అయింది. సైలెంట్ గా కోర్ట్ లో కేసులు వేసి… వాటి ద్వారా తల్లిని చెల్లిని కోర్టుకు ఈడ్చాలి అనుకున్న జగన్ ప్లాన్ ఇప్పుడు బెడిసికొట్టే ఛాన్స్ క్లియర్ గా కనపడుతోంది. ఘర్ ఘర్ కి కహాని అంటూ ఫ్లడ్ లైట్లు వేసిన స్టేడియం లో జగన్ దాగుడు మూతలు ఆడినా… సీన్ సితార్ కావడం దగ్గరలోనే ఉందనేది చాలా మంది మాట. షర్మిల, విజయమ్మకు… జగన్ కు మధ్య జరిగిన లేఖలను టీడీపీ బహిర్గతం చేయడం ముందు వైసీపీ లైట్ తీసుకున్నా… బొమ్మ ఇప్పుడు కనపడుతోంది.

ఓ వైపు కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం, మరో వైపు అన్నపై పోరాటం చేసి అన్నను దోషిగా చూపించడం… ఈ రెండు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు షర్మిల. అందుకు తల్లి మద్దతు స్పష్టంగా ఉందని… ఇటీవల విజయమ్మ రాసిన ఓ బహిరంగ లేఖతో క్లియర్ పిక్చర్ వచ్చేసింది. ఇంత వ్యవహారం జరుగుతుంటే… మధ్యలో పవన్ కళ్యాణ్ ఓ సంచలన కామెంట్ చేసారు. షర్మిల సెక్యూరిటీ మా బాధ్యత అంటూ ప్రకటించారు. ఆ కామెంట్స్ అంత సిల్లీవి కాదు. ఆ కామెంట్స్ వెనుక పవన్ వ్యూహం స్పష్టంగా ఉందనేది ఇప్పుడు డౌట్.

మీరు గమనిస్తే… షర్మిల చేసే ఆస్తులపై పోరాటానికి జగన్ బెయిల్ రద్దుకు వైసీపీ వ్యూహాత్మకంగా లింక్ చేసింది. వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి సహా ఎవరు మాట్లాడినా బెయిల్ రద్దు కుట్ర జరుగుతుందని మాట్లాడారు. ఆ కామెంట్స్ పై షర్మిల రియాక్ట్ అవుతూ…. ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నలు కూడా వేసి… జగన్ వర్గాన్ని ఇరుకున పెట్టారు. అసలు ఇక్కడ బెయిల్ రద్దు ఎందుకు జరుగుతుంది…? షర్మిల చెప్పిన పాయింట్స్ చూస్తే… షర్మిల ఆస్తుల పోరాటానికి… బెయిల్ కు లింక్ లేదు.

కాని వైసీపీ ఆ మాట అంటోంది. అంటే జగన్ కు బెయిల్ రద్దు అయ్యే సిగ్నల్స్ కనపడుతున్నాయి. కేంద్రంతో టీడీపీ చాలా దగ్గరగా ఉంది. ఇటీవల నారా లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. అక్కడి నుంచే వైసీపీ బెయిల్ రద్దు రాగం అందుకుంది. ఇప్పుడు బెయిల్ రద్దు జరిగితే… ఆ నెపాన్ని షర్మిలపై నెట్టవచ్చు అనేది వైసీపీ వ్యూహంగా కనపడుతోంది. అందుకే వైసీపీ నేతలు పదే పదే ఆ మాట మాట్లాడి ఉండవచ్చు. ఇదే సమయంలో ఏపీ కాంగ్రెస్ నేతలు డీజీపీని కలిసి… షర్మిలకు భద్రత పెంచాలని కోరారు. నలుగురు గన్ మెన్స్ కావాలని రిక్వస్ట్ చేసారు.

అది జరిగిన రెండు రోజుల తర్వాత పవన్ మాట్లాడుతూ షర్మిల భద్రత బాధ్యత మాది అన్నారు. బెయిల్ రద్దు జరిగితే షర్మిలను టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పుడు వైసీపీ అభిమానులకు జగన్ వర్గానికి కూటమి పార్టీల కంటే షర్మిలపైనే కోపం ఎక్కువగా ఉంది. వైసీపీ నేతల కామెంట్స్ గాని వైసీపీ సోషల్ మీడియా పోస్ట్ లు గాని చూస్తే ఇదే అర్ధమవుతుంది. అందుకే ఇప్పుడు షర్మిల వెంట కూటమి నిలబడింది. రాజకీయం పక్కన పెట్టి కొన్ని పరిణామాలు చూస్తే జగన్ నైజానికి కుటుంబ సభ్యులు ఎక్కువగా భయపడుతూ ఉంటారు. రాజకీయ ప్రత్యర్ధులను శత్రువులుగా చూసే నైజం జగన్ ది.

దేనికైనా జగన్ తెగిస్తారు అనడానికి టీడీపీ చెప్పే ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏపీ ఎన్నికలకు ముందు ప్రాణ భయంతోనే విజయమ్మ అమెరికా వెళ్ళారని టీడీపీ చెప్తూ ఉంటుంది. ఓ ఇంటర్వ్యూలో బ్రదర్ అనీల్ కామెంట్స్ కూడా అలానే ఉంటాయి. విజయమ్మకు జరిగిన కారు ప్రమాదం ఫోటోలను ఇప్పుడు టీడీపీ వైరల్ చేస్తూ సంచలనానికి తెరలేపింది. అందుకే ఇప్పుడు షర్మిల చేసే పోరాటానికి భద్రత కల్పించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అవసరమైతే ఆమెకు కేంద్ర బలగాలతో భద్రత కల్పించినా ఆశ్చర్యం లేదు. ఆమెకు భద్రత కల్పిస్తే… నిజమైన వైఎస్ అభిమానుల్లో కూడా ప్రభుత్వంపై సానుభూతి పెరగడం ఖాయం.