Top story: జమిలి జరిగితే ఎవరికి అడ్వాంటేజ్? ఎవరికి డిసడ్వాంటేజ్?

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హడావుడి చూస్తుంటే ఎక్కడో ఏదో డౌట్ వస్తుంది. ఏపీలో ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడవలేదు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదు. అయినా సరే పొలిటికల్ పార్టీలన్నీ రోడెక్కేసేయ్. ఈ హడావుడి చూస్తే రేపే ఎల్లుండో ఎన్నికలు వచ్చేస్తాయా అన్నట్లు టిడిపి నేతలు వైసీపీ మీద విరుచుకు పడిపోతున్నారు.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 09:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హడావుడి చూస్తుంటే ఎక్కడో ఏదో డౌట్ వస్తుంది. ఏపీలో ఎన్నికలు జరిగి ఐదు నెలలు గడవలేదు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలేదు. అయినా సరే పొలిటికల్ పార్టీలన్నీ రోడెక్కేసేయ్. ఈ హడావుడి చూస్తే రేపే ఎల్లుండో ఎన్నికలు వచ్చేస్తాయా అన్నట్లు టిడిపి నేతలు వైసీపీ మీద విరుచుకు పడిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు అధికార పార్టీలో ఉన్నారా ? లేక ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కావటం లేదు. ఇక తెలంగాణలోనూ అదే పరిస్థితి. కేటీఆర్ తాను పాదయాత్ర చేసేస్తానంటూ షూ కి లేసులు బిగిస్తున్నారు. అసలు ఈ హడావుడి అంత ఎందుకు జరుగుతుంది.? చాలామందికి ఎక్కడో డౌట్ కొడుతుంది. అదే జమిలి.2027లో దేశంలో జెమిని ఎన్నికలు తప్పేట్లు లేదు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ నినాదంతో దేశమంతా అసెంబ్లీలకు పార్లమెంట్ కి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అన్న లక్ష్యంతో మోడీ సర్కార్ గడచిన కొన్నేళ్లుగా కసరత్తు చేస్తూనే ఉంది. అది త్వరలోనే అమలు కాబోతుందని, 2027 డిసెంబర్ లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్రం నుంచి లీక్ లో వస్తున్నాయి. అందుకే ఇప్పుడు దేశమంతా జమిలి టాక్ నడుస్తోంది. పార్టీలు, ప్రభుత్వాలు, జనంలోను జమలి ఉంటుందా ఉండదా ? ఉంటే ఎప్పుడుంటుంది ? అది ఏ రూపంలో ఉంటుంది? కాలపరిమితి ముగియని అసెంబ్లీలను ఏం చేస్తారు?

కాలపరిమితి ముందే ముగిసిపోయిన అసెంబ్లీలను ఏం చేస్తారు ? ఎలా జమిలిని అమల్లోకి తేగలుగుతారు ? అన్న చర్చ ప్రతిచోట జరుగుతోంది. 2027లో యూపీ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలతోనే జమిలి జరగవచ్చని ఓ అంచనా. 2027లో జమిలి జరిగితే .. తెలంగాణకు ఏడాది ముందు ఏపీకి రెండేళ్ల ముందు అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి. ఓవరాల్‌గా లోక్‌సభకు రెండేళ్ల ముందే ఎన్నికలు వస్తాయి. మోడీ సర్కార్ వీటన్నింటిన ఎలా స్ట్రీమ్ లైన్ చేయగలుగుతుంది.? ఏ విధంగా అమల్లోకి తీసుకురాగలుగుతుంది అన్నది అందరిలో ఆసక్తిరేపుతోంది. మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్నాయి. కొత్తగా ఏర్పడి ఆ అసెంబ్లీలను ఏం చేస్తారు ? మూడేళ్లకే ఆ అసెంబ్లీల కాలపరిమితిని ముగిస్తారా ? వాటినెలా పరిష్కరిస్తారు అన్నది కూడా కేంద్రం ముందు ఉన్న పెద్ద ఛాలెంజ్. అయితే మొదట జమిలి బిల్లును సభచేత ఆమోదింపజేసి.. ఆ తర్వాత మిగిలిన కసరత్తు ప్రారంభించొచ్చు. దేశంలో దాదాపు సగం రాష్ట్రాలకు కాలపరిమితి సమస్య వస్తుంది. కొన్నింటికి ముందు.. మరికొన్నింటికి తర్వాత. వీటన్నింటిని సరిచేసుకుంటూరావడం కేంద్రం ముందున్న పెద్ద ఛాలెంజ్. జమిలి ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా మోడీ బొమ్మ పెట్టుకుని జనాన్ని ఓటు అడగాలి. దానివల్ల పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసిరావొచ్చనేది ఆ పార్టీ ఆశ. మోడీ ప్రభావం, ఆయన చరిష్మాతో ..జమిలి ఎన్నికల్లో రాష్ట్రాల్లోనూ బీజేపీకి కలిసొస్తుందని రాజకీయ వ్యూహంతో ఉంది బీజేపీ. జనం ఒకేసారి రెండు ఓట్లు వేయాల్సిఉంటుంది.

రాష్ట్రాల్లో ఎమ్మెల్యేకి, కేంద్రంలో ఎంపీకి .. రెండు ఓట్లు వేసే క్రమంలో ఓటరు వ్యూహాత్మకంగా అటొక ఓటు, ఇటొక ఓటు వేయలేడు. మోడీ చరిష్మాతో రెండు ఓట్లు బీజేపీకే జనం వేస్తారనేది ఒక అంచనా. రాజకీయంగా జమిలి వల్ల బీజేపీకి జరిగే మేలు ఇదే. అయితే ఈ అంచనాలు బీజేపీ అనుకున్నట్టే జరగాలని ఏం లేదు. జమిలిలో మరో రిస్క్ కూడా ఉంది. బీజేపీ అధినాయకత్వంమీద.., మోడీపైనా జనంలో వ్యతిరేకత ఉంటే.., రెండు చోట్ల దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదు. జమిలి వల్ల రాజకీయంగా ఎంత లాభం ఉంటుందని అంచనా వేస్తున్నారో.. అంతే స్థాయిలో నష్టం ఉంటుందని కూడా ఆలోచించాల్సిందే. కాకపోతే… దేశంలో ఇవాళ మోడీకి ఉన్న ఛరిష్మా, ఫేస్ వాల్యూబట్టి చూస్తే.. బీజేపీకి కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదిఏమైనా .. జమిలి కేంద్రానికి పెద్ద సవాలే. రాజకీయ ఆమోదం సాధించడం ఒక ఎత్తైతే.. సాంకేతికంగా సగానికి పైగా రాష్ట్రాల అసెంబ్లీల కాలపరిమితుల్ని సరిచేయాల్సిఉంటుంది. జమిలి వల్ల రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా.., ఎన్నికల వ్యవస్థను చక్కదిద్దాలని ధృడ సంకల్పంతో కేంద్రంలోని మోడీ సర్కార్‌ గనుక ముందుకెళ్తే.., మరో మూడేళ్లలోనే జమిలి ఎన్నికలు తప్పకపోవచ్చు.

ఏపీ తెలంగాణ విషయానికొస్తే. ఏపీకి జమిలి ఎన్నికలు 2027 లో జరిగితే రెండేళ్ల ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగినట్లు. ప్రధాని మోడీతో ఇప్పటికే జనసేన ,టిడిపి అధినేతలు ఈ విషయంపై చర్చించినట్లు సమాచారం.2027లో జమలీ ఎన్నికలు జరిగితే తాము సిద్ధంగా ఉంటామని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఢిల్లీలో మాట ఇచ్చి వచ్చారట. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నీ కూడా జమిలి ఎన్నికలే ఊరిస్తున్నాయి. ఈ మూడు సంవత్సరాల్లో చంద్రబాబు సర్కారు పై జనంలో వ్యతిరేకత వస్తుందని… అదే జరిగితే 2027లో తాను మళ్లీ ముఖ్యమంత్రి అవుతానని జగన్మోహన్ రెడ్డి జాతకాలు చూసుకుంటున్నారు. ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత విజయ్ సాయి రెడ్డి కూడా 2027 లో ఎన్నికలు తప్పవని చెప్తున్నారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే…..2028 డిసెంబర్ నాటికి తెలంగాణ అసెంబ్లీకి కాలపరిమితి ముగుస్తుంది. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలు జరిగితే తెలంగాణకు ఏడాది ముందే ఎన్నికలు వచ్చినట్లు. అందుకే ఇక్కడ బి ఆర్ఎస్ లోనూ ఆశలు మొలకలు ఎత్తాయి. ఇప్పటినుంచి జనంలో ఉంటే ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవచ్చని, ఏడాది ముందే అధికారంలోకి రావచ్చని బి ఆర్ ఎస్ కలలు కంటుంది. తప్పదనుకుంటే బిజెపిని కూడా కలుపుకోవడానికి బి ఆర్ఎస్ సిద్ధంగా ఉంది.

ఓవరాల్ గా చూస్తే జమలీ కసరత్తు అంత తేలిక కాదు… అలాగని చేయాల్సిందే అనుకుంటే ఆగేది కాదు. జెమిలి బిల్లును ఆమోదింప చేయడానికి లోక్సభలో బలం ఉన్నప్పటికీ, రాజ్యసభలో బలం సరిపోదు గనుక బిజెపి కచ్చితంగా ప్రతిపక్షాలను బతిమిలాడుకోవాల్సి వస్తుంది. జెమిని ఎన్నికలు జరిగితే 60 లక్షల కోట్ల రూపాయలు ఎన్నికల ఖర్చు మిగులుతుంది, అంతేకాక ఎన్నికల వ్యవస్థ మొత్తం గాడిన పడుతుందన్నది బిజెపి వాదన. కానీ ప్రాంతీయ పార్టీల్ని చంపేయడానికి, కేంద్రంలో మోడీ ఫేస్ చూపించి రాష్ట్రాల్లోనూ అధికారం కొల్లగొట్టడానికి ఇది బిజెపి వేస్తున్న ఎత్తుగడ అనేది ప్రతిపక్షాల వాదన. జెమిలి పై ఇప్పటికే అన్ని రకాల కసరత్తులు, నివేదికలు పూర్తి చేసుకున్న మోడీ సర్కార్… రేపో మాపో ఒక ప్రకటన చేస్తే 2027లో జమిలి ఎన్నికలు తప్పకపోవచ్చు.