వినడానికి… ఊహించడానికి మీకు కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు ఇది సాధ్యమేనా అనిపించొచ్చు. కానీ ఇది నిజం.2027లో భారత రాష్ట్రపతి గా వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట ప్రధాని మోడీ.2027 జూలై 24 తో భారత ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పదవి కాలం ముగుస్తుంది. ఆ పదవిని మోడీ అలంకరిస్తే గౌరవంగా ఉంటుందని కొందరు సలహా ఇస్తున్నారట. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా చేసిన నరేంద్ర మోడీ రాష్ట్రపతిగా కూడా చేస్తే ప్రపంచంలోనే ఒక సరికొత్త రికార్డు అవుతుందనేది కొందరు సూచన. అసలు ఇది ప్రాక్టికల్ గా సాధ్యమేనా అన్నది మరికొందరి వాదన.
ప్రధాని నరేంద్ర మోడీ 2001 నుంచి 2014 వరకు దాదా 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేశారు. తర్వాత 2014 నుంచి భారత ప్రధానిగా ఉన్నారు. ఆయన పదవీకాలం 2029 వరకు ఉంది.15 ఏళ్లపాటు నిరాటంకంగా దేశ ప్రధానిగా పనిచేసిన రికార్డ్ మోడీ సొంతం కానుంది. జవహర్లాల్ నెహ్రూ 1947 నుంచి 1964 వరకు పదహారేళ్ల పాటు ఇండియాకు ప్రధానిగా ఉన్నారు. గణతంత్ర భారతదేశానికి మాత్రం 1950 నుంచి 1964 లో చనిపోయే వరకు సుమారు 14 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్ గా చేశారు నెహ్రు. గణతంత్ర భారతదేశంలో ప్రధానిగా 14 ఏళ్ల నెహ్రు రికార్డ్ ని మోడీ 2029 లో బ్రేక్ చేసే అవకాశం ఉంది.2029 వరకు మోడీ ప్రధానిగా ఉంటే గణతంత్ర భారతదేశంలో ప్రధానిగా 14 ఏళ్ల నెహ్రూ రికార్డుని ఆయన అధిగమిస్తారు. ఇదంతా ఇలా ఉంటే 2027 జులై 24 కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పదవీకాలం ముగుస్తుంది. అప్పటికి ప్రధానిగా మోడీకి ఇంకా మరో రెండు సంవత్సరాలు పదవి కాలం ఉంటుంది. ఒకవేళ మోడీ రాష్ట్రపతి అవ్వాలి అనుకుంటే ప్రధాని పదవికి రాజీనామా చేసి అమిత్ షా లేదా మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించి రాష్ట్రపతిగా పోటీ పడితే 2027 నుంచి 2032 వరకు ఆయన భారత రాష్ట్రపతిగా కూడా బాధ్యతలు నిర్వహించవచ్చు.
అప్పటికి మోడీకి 82 సంవత్సరాలు వయసు వస్తుంది. భారతదేశంలో ముఖ్యమంత్రిగా, ప్రధానిగా, రాష్ట్రపతిగా విభిన్న పాత్రలు పోషించిన రికార్డ్ మోడీ సొంతమవుతుంది.2014తో పోలిస్తే 2024 నాటికి లోక్సభలో బిజెపి బలం బాగా తగ్గింది.2029లో పరిస్థితి ఇలాగే ఉంటుందా లేదా అధికారం చేజారుతుందా అనే చర్చ కూడా బాగా జరుగుతుంది.2029 ఎన్నికలకు తన నాయకత్వంలో వెళ్లడం కంటే వేరొకరికి బాధ్యతలు అప్పగించి తాను రాష్ట్రపతిగా వెళ్లాలని మోడీ అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. నిజానికి బిజెపి పార్టీ సిద్ధాంతం ప్రకారం 75 ఏళ్ల తర్వాత ఏ నాయకుడు పదవుల్లో ఉండకూడదు. కానీ మోడీ కి ఇప్పటికే 74 సంవత్సరాలు దాటాయి.2029 నాటికి ఆయనకు 79 ఏళ్ళు వస్తాయి. ఇది బిజెపి మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం. ఇప్పటికే ఈ విషయంలో పార్టీలో కొన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి కూడా. అందువల్ల 2027 నాటికి రాష్ట్రపతిగా మోడీ ఎన్నికై వెళ్లిపోతే మరొకరికి ప్రధాని బాధ్యతలు, అలాగే 2029 ఎన్నికలు కు వెళ్లే బాధ్యతలు అప్పచెప్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన బిజెపి , ఆర్ఎస్ఎస్ లోను జరుగుతోంది. అయితే వీటన్నిటికీ నరేంద్ర మోడీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సమాధానం రాలేదు. మోడీ రాష్ట్రపతి అయితే బీసీని రాష్ట్రపతి చేసిన ఘనత కూడా బిజెపికి దక్కుతుంది.
పార్టీకి కొత్త నాయకత్వం కూడా వస్తుంది. ప్రధాని అభ్యర్థి రేసులో అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఇద్దరూ ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు మాత్రం యోగి ఆదిత్యనాథ్ కే ఉంటాయి.2027 నాటికి 13 ఏళ్లు ప్రధానిగా బాధ్యతలు పూర్తి చేసుకుంటారు మోడీ. తనకి ఇక ఈ బాధ్యత చాలు, 77 సంవత్సరాలు వయసు కూడా వచ్చింది… కొత్త వాళ్లకి బాధ్యతలు ఇద్దాము అని మోడీ అనుకుంటే… ఆయన కచ్చితంగా రాష్ట్రపతిగా పోటీ పడతారు. ఆ తర్వాత ఎలాగూ మరో అయిదేళ్లపాటు ఆయనకు 82 ఏళ్ళ వయసు వచ్చేవరకు అత్యున్నతమైన గౌరవ పదవిలో కొనసాగుతారు మోడీ. ఇప్పుడు బిజెపి , ఆర్ఎస్ఎస్ లోను ఇదే చర్చ జరుగుతుంది. నిజానికి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని, కేంద్రం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ 2027లో జమిలి ఎన్నికలకు అందరూ ఆమోదిస్తే… అంతా సక్రమంగా జరిగితే మరోసారి మోడీ నాయకత్వంలోనే బిజెపి, ఎన్డీఏ కూటమి 2027లో జమిలి ఎన్నికలకు వెళ్తాయి. జమిలి ఎన్నికలు సాధ్యం కాకపోతే, 2029లో తన నాయకత్వంలో ఓటమి ఎదుర్కోవడం కంటే 2027 లో రాష్ట్రపతిగా వెళ్లిపోవడమే మంచిదని మోడీ భావిస్తే కనుక ఆయనను దేశం మరోసారి రాష్ట్రపతి లాంటి అత్యున్నత పదవిలో చూసే అవకాశం ఉంటుంది.