వైట్‌ హౌజ్‌కు దూరంగా ట్రంప్‌ కూతురు, తండ్రీ కూతుళ్లకు గ్యాప్‌ వచ్చిందా

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలోనే అమెరికా ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అధ్యక్షుడి హోదాలో మరోసారి ఆయన వైట్‌ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. 2025 జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 11, 2024 / 05:42 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్‌ ట్రంప్‌ త్వరలోనే అమెరికా ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేయబోతున్నాడు. అధ్యక్షుడి హోదాలో మరోసారి ఆయన వైట్‌ హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. 2025 జనవరి 20న ట్రంప్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత ఆయన కుటుంబంతో కలిసి వైట్‌హౌజ్‌కు షిఫ్ట్‌ అవుతారు. అయితే ఈసారి ట్రంప్‌తో పాటు ఆయన కూతురు ఇవాంక ట్రంప్‌, అల్లుడు జారెడ్‌ కుష్నర్‌ మాత్రం వైట్‌కు వెళ్లే అవకాశం కనిపించడంలేదు. గతంలో ట్రంప్‌ అధ్యక్షుడిగా పని చేసిన సమయంలో పరిపాలన బాధ్యతలో ఇవాంక, కుష్నర్‌ పాలు పంచుకున్నారు. ఆ హోదాలోనే ఇవాంక ఇండియాకు కూడా వచ్చారు. కానీ ఈసారి మాత్రం ఆ సీన్ వాళ్ల ఫ్యామిలీలో కనిపించడంలేదు.

అంతే కాదు.. ఎన్నికల ప్రచారంలో కూడా ట్రంప్‌తో ఇవాంక పెద్దగా ఎక్కడా కనిపించలేదు. గత ఎన్నికల్లో మాత్రం అన్నీ తానై ముందుండి నడిపించిన ఇవాంక.. ఈసారి మాత్రం తండ్రితో గ్యాప్‌ మెయిన్‌టేచ్‌ చేసింది. దీంతో ఇవాంక తన భర్త ఇద్దరూ వైట్‌ హౌజ్‌కు దూరంగా ఉంటారని వాదనలు వినిపిస్తున్నాయి. అంతే కాదు పరిపాలన విషయంలో కూడా ట్రంప్‌కు దూరంగానే ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో వీళ్లిద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందనే చర్చ మొదలైంది. రీసెంట్‌గా ఎలాన్‌ మస్క్‌ కూతురు కూడా ట్రంప్‌ గెలుపును జీర్ణించుకోలేకపోతున్నట్టు వీడియో పోస్ట్‌ చేసింది. ట్రంప్‌ గెలుపుతో తనకు అమెరికాలో తన భవిష్యత్తు కనిపించడంలేదని.. తాను అమెరికా నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది. ఇప్పుడు ఇవాంక కూడా ట్రంప్‌కు దూరంగా ఉంటూ వస్తుండటంతో ఈ వ్యవహారం కూడా ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.