KTR-KOMATIREDDY: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయ్. సాధారణంగా ప్రతిపక్ష నేతకు ఇచ్చే గదిని కాదని.. కేసీఆర్‌కు చిన్న రూమ్ ఇచ్చారని.. ఈ నిర్ణయాన్ని రేవంత్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు ఫైర్ అవుతున్నారు. ఓ ఎమ్మెల్యే ఆటోలో అసెంబ్లీకి వస్తే.. ఓ ఎమ్మెల్సీ బస్సులో కింద కూర్చొని మరీ అసెంబ్లీకి వచ్చారు. ఇలా తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఇంట్రస్టింగ్‌గా సాగుతున్నాయ్. ఇంతకుమించి ఆసక్తికర ఘటన ఒకటి అసెంబ్లీ ఆవరణలో కనిపించింది.
Varsha Bollamma: మళ్లీ కలవనేలేదు.. బెల్లంకొండ హీరోతో పెళ్లి..!
బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్య ఇంట్రస్టింగ్ డిస్కషన్ నడిచింది. అసెంబ్లీ ఆవరణలో ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. పలకరించుకున్నారు కూడా! ఈ సందర్భంగా ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. అన్నా నీకు మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. ఐతే మీ లాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని రాజగోపాల్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు.. మంచిగా పని చేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ కౌంటర్ వేశారు. ఇక లోక్‌సభ ఎన్నికల మీద కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఎంపీగా మీ కూతురు కీర్తి పోటీ చేస్తుందా, మీ అబ్బాయి సంకీర్త్ పోటీ చేస్తున్నారా అని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడిగారు. తన భార్య లక్ష్మీ పోటీ చేస్తుందని సరదాగా సమాధానం ఇచ్చారు.
కేటీఆర్ ఆ డిస్కషన్‌ను కంటిన్యూ చేసే ప్రయత్నం చేయగా.. దయచేసి తనను వివాదాల్లోకి లాగొద్దని రాజగోపాల్ రెడ్డి అన్నారు. దీంతో తర్వాత మాట్లాడదాం అంటూ కేటీఆర్ వెళ్లిపోయారు. ఇద్దరి మధ్య సంభాషణను అక్కడ ఉన్న నాయకులంతా ఆసక్తిగా గమనించారు. మొదటిరోజే ఇలా ఉందంటే.. బడ్జెట్ సమావేశాలు పూర్తయ్యే లోపు.. ఇంకెలాంటి ఆసక్తికర సంఘటనలు కనిపిస్తాయో అనే చర్చ జనాల్లో వినిపిస్తోంది.