TS CORPORATION: రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్ల రాజీనామా.. సీఎస్‌కు లేఖల సమర్పణ..

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న ముఖ్య సలహాదారులు, ఓఎస్డీలు, ఇతర విభాగాధిపతులుగా పని చేసిన వాళ్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇదివరకే జెన్‌కో ఎండీ డీ ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి తన సలహాదారు పదవికి రాజీనామాలు చేశారు.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 05:05 PM IST

TS CORPORATION: తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో పాలకవర్గంలో, రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో వివిధ శాఖల్లో కొనసాగుతున్న ముఖ్య సలహాదారులు, ఓఎస్డీలు, ఇతర విభాగాధిపతులుగా పని చేసిన వాళ్లు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ఇదివరకే జెన్‌కో ఎండీ డీ ప్రభాకర్ రావు, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమణాచారి తన సలహాదారు పదవికి రాజీనామాలు చేశారు. వీరితోపాటు మరికొందరు కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపారు. ఈ సందర్భంగా తెలంగాణ పునర్నిర్మాణంలో తమకు అవకాశం కల్పించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాజీనామాలు చేసింది వీళ్లే.
సోమ భరత్ కుమార్ (చైర్మన్, రాష్ట్ర డెయిరీ డేవలప్మెంట్ కార్పొరేషన్)
జూలూరి గౌరీ శంకర్ (చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ)
పల్లె రవి కుమార్ గౌడ్ (చైర్మన్, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్)
డాక్టర్ ఆంజనేయ గౌడ్ (చైర్మన్, స్పోర్ట్స్ అథారిటీ)
మేడె రాజీవ్ సాగర్ (చైర్మన్, టీఎస్ ఫుడ్స్ కార్పొరేషన్)
డా.దూదిమెట్ల బాలరాజు యాదవ్ (చైర్మన్, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ)
గూడూరు ప్రవీణ్ (చైర్మన్, టైక్స్టైల్స్ కార్పొరేషన్)
గజ్జెల నగేష్ (చైర్మన్, బేవరేజెస్ కార్పొరేషన్)
అనిల్ కూర్మాచలం (చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్)
రామచంద్ర నాయక్ (చైర్మన్, ట్రైకార్)
వలియా నాయక్ (చైర్మన్, గిరిజన ఆర్థిక సహకార సంస్థ)
డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ (చైర్మన్, రాష్ట్ర వైద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ)
రవీందర్ సింగ్ (చైర్మన్, పౌర సరఫరాల సంస్థ)
జగన్మోహన్ రావు (చైర్మన్, రాష్ట్ర టెక్నాలజికల్ సర్వీసెస్)