REVANTH REDDY: కొడంగల్‌లో ఆ ఓట్లే కీలకం.. రేవంత్‌‌ను విజయం వరించేనా..?

గజ్వేల్‌లో కేసీఆర్ మీద ఈటల పోటీ చేస్తుంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీ అంటున్నారు రేవంత్‌. కామారెడ్డిలో కేసీఆర్‌ను రేవంత్‌ ఓడిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం అని.. కేసీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు.

  • Written By:
  • Updated On - November 23, 2023 / 02:30 PM IST

REVANTH REDDY: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయ్. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తోంది తెలంగాణలో! దీంతో ఓడేది ఎవరు.. గెలిచి నిలిచేది ఎవరు అనే చర్చ సాగుతోంది. మిగతా స్థానాలు, మిగతా అభ్యర్థుల సంగతి ఎలా ఉన్నా.. కేసీఆర్, రేవంత్‌, ఈటల వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ అంతా చర్చించుకుంటుంది. ఒకరు సీఎం అయితే.. మిగతా ఇద్దరు సీఎం అభ్యర్థులు.. ఆ మాత్రం చర్చ ఉంటుంది మరి! ఈ ముగ్గురు కూడా.. రెండు స్థానాల్లో పోటీ చేయడం.. రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది.

Eatala Rajender: గజ్వేల్‌లో ఈటల మాస్టర్‌ప్లాన్‌.. కేసీఆర్‌కు మాములు షాక్‌ ఇవ్వట్లేదుగా..

గజ్వేల్‌లో కేసీఆర్ మీద ఈటల పోటీ చేస్తుంటే.. కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీ అంటున్నారు రేవంత్‌. కామారెడ్డిలో కేసీఆర్‌ను రేవంత్‌ ఓడిస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఆయన పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం ఖాయం అని.. కేసీఆర్‌ విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో కొడంగల్‌లో రేవంత్‌ పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. కొడంగల్‌లో పట్నం నరేందర్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డిని 9వేల 3వందలకు పైగా ఓట్ల తేడాతో ఆయన ఓడించారు. ఐతే ఈసారి కొడంగల్‌లో గెలిచి.. ఆ సౌండ్‌ను స్టేట్‌ అంతా వినిపించాలని రేవంత్ ఫిక్స్ అయ్యారు. ఐతే గ్రౌండ్‌ లెవల్‌లో మాత్రం టగ్ ఆఫ్ వార్ అన్నట్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య యుద్ధం కనిపిస్తోంది. కొడంగల్‌ మీద కేసీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. రేవంత్‌ను ఓడించేందుకు ఎంత దూరం అయినా వెళ్లేందుకు సిద్ధం అన్నట్లుగా.. కొడంగల్‌ సభలో కేసీఆర్‌ మాటలు వినిపించాయ్. కొడంగల్‌లో 2లక్షల 36వేలకు పైగా ఓటర్లు ఉండగా.. మహిళా, యూత్‌ ఓటర్లే ఇక్కడ కీలకం కాబోతున్నారు.

దీంతో వారిని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడుతున్నాయ్. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌లాంటి పథకాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను ప్రమోట్ చేస్తోంది. ఐతే ఉద్యోగాల నియామకాల విషయంలో యూత్ ఓటు ఎటు వైపు అనే దాని మీదే.. ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బీజేపీ నుంచి బంటు రమేష్ పోటీ చేస్తున్నారు. యూత్‌ను అట్రాక్ట్ చేసే వ్యూహాలతో ఆయన ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఐతే యువత, నిరుద్యోగుల ఓటు చీలితే.. అది బీఆర్ఎస్‌కు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ఏం జరగబోతోంది.. ఎవరు ఎటు వైపు ఉంటారు అనే చర్చ సాగుతోంది.