I.N.D.I.A: ముంబై వేదికగా ఇండియా కూటమి మూడో సమావేశం..! దేశ రాజకీయాలపై దీని ప్రభావం ఎంత..?

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు దేశంలోని అన్ని పార్టీలు ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. ఈమధ్య కాలంలోనే ఇండియా అనే పేరుతో కూటమికి నామకరణం చేశారు. ఇండియా అంటే ఇండియన్ నేషణల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ అని అర్థం. రానున్న రోజుల్లో మహారాష్ట్రలో సమావేశం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - August 21, 2023 / 12:54 PM IST

ఇండియా కటమి గతంలో బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ సారధ్యంలో మొదటి మీటింగ్ ఏర్పాటు చేశారు. బీహార్ వేదికగా పాట్నాలో ఏర్పాటు చేసిన మొదటి సమావేశం తరువాత కర్ణాటకలో రెండో సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులోనే ఈ కూటమికి ఇండియా అని పేరు పెట్టడం జరిగింది. మరోసారి మహారాష్ట్ర వేదికగా ఈ మీటింగ్ ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1వ తేదీన జరుగనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్యక్రమాన్ని శివసేన అధినేత ఉద్దవ్ థాక్రే ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

క్రమక్రమంగా పెరుగుతున్న మద్దతు

ఈ పార్టీ మీటింగ్ కు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సహా పలు ప్రాంతీయ పార్టీలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ మీటింగులను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే.. పాట్నాలో 17 పార్టీలకు చెందిన 32 మంది సభ్యులు హాజరయ్యారు. అదే కర్ణాటకకు వచ్చే సరికి దీని సంఖ్య 32 పార్టీలకు పెరిగింది. ఇక త్వరలో జరగబోయే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగే సమావేశానికి దాదాపు 26 పార్టీలతోపాటూ 80 మంది రాజకీయ నేతలు పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే గనుక జరిగితే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమికి రోజు రోజుకు బలం పెరుగుతోంది అని చెప్పక తప్పదు. ఇలా అన్ని ప్రాంతీయ పార్టీల మద్దతును కలుపుకుంటూ పోతే బీజేపీ సర్కార్ కి కొంత గడ్డుపరిస్థితులు తప్పవని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇండియా లోగో ఆవిష్కరణ

ముంబై వేదకగా జరిగే సమావేశంలో మరికొన్ని ప్రాంతీయపార్టీలు ఇండియా కూటమిలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఈ సమావేశ బాధ్యతలు మొత్తం ఉద్దవ్ థాక్రే దగ్గరుండి చూసుకోవడం గమనించదగ్గ అంశం. ఈ కార్యక్రమం ముంబై సమర్బన్ లోని గ్రాండ్ హయాత్ వేదికగా జరుగనుంది. ఈ హోటల్ లో శివసేన అధ్యక్షులు ఉద్ధవ్ థాక్రే విందు కూడా ఏర్పాటు చేశారు. ఇందులో ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటూ సోనియా గాంధీ, వివిధ పార్టీల ముఖ్య నేతలు ఆగస్ట్ 31న సాయంత్రం అక్కడికి చేరుకొని కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. ఇండియా లోగోను కూడా ఈ వేదికపై నుంచి ఆవిష్కరించనున్నారు. తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీన సమావేశం తరువాత కాంగ్రెస్ యువనాయకుడు రాహూల్ గాంధీ సెంట్రల్ ముంబైలోని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్నారు.

ర్పాట్లలో శరాద్ పవార్ జోక్యం..

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ మూడో సమావేశంలో ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఉండేందుకు మహారాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నసీమ్ ఖాన్ దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అలాగే అవసరమైన పనుల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరాద్ పవార్ కూడా జోక్యం చేసుకుంటున్నారని సమాచారం. ఏది ఏమైనా ఈసమావేశంలో రాజకీయ ఉద్దండులు, చాణుక్యులు పాల్గొంటున్న వేళ దేశరాజకీయాల్లో వేడి మరింత పెరిగింది.

T.V.SRIKAR