‘చదువుకున్న వాళ్లకే ఓటు వేయండి..’ ఇది సాధారణంగా చాలా చోట్ల వినపడే మాటే. ఇదే డైలాగును ప్రముఖ ఎడ్యుకేషనల్ ఫ్లాట్‌ఫామ్ ‘అన్‌అకాడమీ’లో టీచర్ అయిన కరన్ చెప్పడం ఇప్పుడు అగ్గి రాజేసింది. ఏకంగా అతని జాబ్ పోయేలా చేసింది. అన్‌అకాడమీ వ్యవస్థాపకుడు రోమన్ సైనీ కరన్‌ని ఉద్యోగం నుంచి తొలగించాడు. తరగతి గది వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదని, ఉపాధ్యాయుడు(కరన్) ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించాడని రోమన్ సైనీ ఒక ప్రకటన విడుదల చేశాడు. అయితే బయటకు ఈ కారణం చెబుతున్నా అసలు రీజన్ మాత్రం ఇది కాదు. కరన్‌ని ఇంత సడన్‌గా జాబ్ నుంచి రిమూవ్ చేయడానికి కారణం బీజేపీ కార్యకర్తలు సోషల్‌మీడియాలో చెస్తున్న రచ్చ. ‘అన్‌ఇన్‌స్టాల్ అన్‌అకాడమీ’ అంటూ ట్విట్టర్‌లో ఓ హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేసి దాన్ని ట్రెండ్ చేస్తున్నారు. బీజేపీ మద్దతుదారులు ఒకవైపు యాంటీ మోదీ వింగ్ మరోవైపు వర్గాలుగా చీలిపోయి మరి తన్నుకుంటున్నారు.
నిజానికి కరన్ తాను మాట్లాడిన దాంట్లో ఎక్కడా కూడా మోదీ పేరు కానీ ఇతర రాజకీయ నాయకులు పేరు కానీ లిఫ్ట్ చేయలేదు. కానీ గుమ్మాడికాయల దొంగ ఎవరూ అంటే భుజం తడుముకున్నట్టు కనిపిస్తుంది బీజేపీ నేతల వైఖరి. దేశాన్ని పాలించడానికి చదువు అవసరమా కాదానన్న డిబెట్ పక్కన పెడితే అంత పెద్ద ఎడ్యుకేషనల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఒక టీచర్ చెప్పిన మాటను పట్టుకోని ఇంత రాద్దాంతం చేయడం బీజేపీ నేతలకే చెల్లింది. అన్‌అకాడమీకి రోజు లక్షల్లో వ్యూస్ ఉంటాయి. ఈ ఫ్లాట్‌ఫామ్ బెస్ చేసుకోనే చదువుకునే వారు లక్షల్లో ఉంటారు. ఆ మాత్రం విషయం తెలియకుండా మొత్తం అన్‌అకాడమీని అన్‌ఇన్‌స్టాల్ చేసుకోవాలని బీజేపీ లీడర్లు, కార్యకర్తలు సూచిస్తుండడం నిజంగా విడ్డూరం.
రోమన్ సైనీ చెప్పినట్టు నిజంగానే తరగతి గది వ్యక్తిగత అభిప్రాయాలకు వేదిక కాదు.. కానీ ఇది కేవలం కరన్ వ్యాఖ్యలకే అంటకట్టడం సరికాదు. అసలు మనం చిన్నతనం నుంచి చదువుకుంటున్న బుక్స్‌లో ఏదో ఒకపార్టీకి చెందిన ప్రాపగాండా తప్ప మరేమీ కనపడదు. కాంగ్రెస్ తమ పార్టీ వ్యక్తిగత అభిప్రాయాలను బుక్స్‌లో ఇరికించింది.. ఇప్పుడు ఆ సిలిబస్‌లు మారుస్తూ బీజేపీ కాలం గడుపుతోంది. అసలు మూలల్లోనే వ్యక్తిగత అంశాలు ఉన్నప్పుడు కేవలం కరన్ డైలాగ్ వల్లే ఏదో కొంపలు మునిగిపోతున్నట్టు ఈ నటన ఏంటో అర్థంకావడంలేదు. అయినా కరన్ అక్కడ ఎక్కడా కూడా మోదీ పేరు ఎత్తలేదు కదా.. పోని వేరే పార్టీల్లో చదువుకున్న వాళ్ల పేర్లు కూడా లిఫ్ట్ చేయలేదు కదా.. బీజేపీలో కూడా ఉన్నత చదువులు చదివి కేంద్ర మంత్రి పదవుల్లో కొనసాగుతున్నవాళ్లు ఉన్నారు కదా.. మరీ ఎందుకీ గోలా? ప్రతి విషయంలో దూరడం.. బాయ్‌కాట్ చేయమనడం.. అన్‌ఇన్‌స్టాల్ చేయమని ట్రెండులు చేయడానికి అంత ఓపీకా, తీరిక ఉన్నవాళ్లు నిజంగానే గొప్పవాళ్లు..!