ఉత్తర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నారు. తొలి సారిగా ఆంధ్రప్రదేశ్ కి వచ్చాను, దుర్గా మాత అంటే శక్తి మాతను దర్శనం చేసుకున్నానన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల స్థాయిలో బిజెపి జాతీయ స్థాయిలో బలంగా ఉందన్న ఆయన…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సబ్ కా సాద్ నినాదం తో అభివృద్ధి పధం వైపు తీసుకుని వెళుతున్నారనన్నారు. 2047 వికసిత్ భారత్ లక్ష్యం గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పని చేస్తున్నారని తెలిపారు. మహారాష్ట్ర లో మూడవ సారి అద్భుతమైన విజయాన్ని సాధించామని హర్షం వ్యక్తం చేసారు. ఏక్ హై తో సేఫ్ నినాదం మహా రాష్ట్ర ప్రజల్లో కి తీసుకొని వెళ్ళామన్నారు.
కాంగ్రెస్ విమర్శలు ను ప్రజలు పట్టించుకోలేదన్నారు. ప్రయాగ రాజ్ లో మూడు నదులు గంగ యమున సరస్వతి నదుల సంగమం అని 2025 జనవరి లో మహా కుంభమేళ నిర్వహిస్తున్నామని తెలిపారు. 40 కోట్ల మంది భక్తులు వస్తారు వారి కి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను మహా కుంభమేళ కు ఆహ్వానం పలుకుతున్నామని పేర్కొన్నారు.