Yogi Adithyanath: కబ్జాదారుల ఇళ్లు కూల్చితే తప్పేంటి ? నేరస్థులకు దండేసి దండం పెట్టాలా..

ఉత్తర్‌ప్రదేశ్‌ పేరు చెప్తే ఫస్ట్‌ గుర్తొచ్చేది గ్యాంగ్స్‌, మాఫియా, డాన్స్‌. కానీ ఇది ఒకప్పుడు. ఇప్పుడు మాత్రం సీన్‌ వేరేగా ఉంది. మాఫియా పేరెత్తాలంటేనే అక్కడి డాన్స్‌ భయపడుతున్నారు. క్రైమ్‌ చేయాలంటే వెనకా ముందూ ఆలోచిస్తున్నారు. దీనికి కారణం ఒకే ఒక వ్యక్తి. ఆయనే యూపీ సీఎం యోగి ఆధిత్యనాథ్‌.

  • Written By:
  • Publish Date - August 1, 2023 / 03:10 PM IST

గ్యాంగ్‌స్టర్లను ఏరివేస్తాం అని పార్లమెంట్‌లో ఇచ్చిన హామీని తూచా తప్పకుండా పాటిస్తున్నారు యోగి. రీసెంట్‌గా ప్రభుత్వ భూములను ఆక్రమించిన కొందరు గ్యాంగ్‌స్టర్లకు దిమ్మ తిరిగే షాకిచ్చారు. తన స్టైల్‌లో బుల్డోజర్లు పంపి వాళ్ల ఇళ్లను కూల్చివేశారు. ఇది యోగి స్టైల్‌. కశ్మీర్‌లో గొడవలు జరిగినప్పుడు కూడా ఇలాగే బుల్డోజర్లతో ఇళ్లు కూల్చివేశారు. అప్పట్లో ఈ విషయంలో పెద్ద రచ్చ జరిగింది. రీసెంట్‌గా యూపీలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ చేశారు యోగి. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు కూడా చేశాయి. రీసెంట్‌గా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఇళ్ల కూల్చివేత గురించి స్పందించారు యోగి. ఏ సీఎం ఇవ్వనంత స్ట్రాంగ్‌గా కౌంటర్‌ ఇచ్చారు.

ఇలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం ఏంటని జర్నలిస్టులు ప్రశ్నిస్తే అలాంటి గ్యాంగ్‌స్టర్లకు హారతివ్వాలా అంటూ ప్రశ్నించారు. యూపీలో ప్రభుత్వం ఆధీనంలో ఉన్న చాలా భూములను కొందరు గ్యాంగ్‌స్టర్లు కబ్జా చేస్తున్నారంటూ చెప్పారు. కేసులు పెట్టిన వినడంలేదు కాబట్టే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. పక్కవాడి ఆస్తి పోతే ఎంత బాధగా ఉంటుందో మన ఆస్తి పోయినప్పుడే తెలుస్తుంది అనేది యోగి వాదన. ఇక తాను మైనార్టీ వర్గాలకు చెందిన నేరస్థులనే టార్గెట్‌ చేస్తున్నాననే వాదననున యోగి తప్పుబట్టారు. భారతదేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని.. తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకేలా ఉంటుందంటూ చెప్పారు. క్రైమ్‌ చేయాలని చేస్తూ ఉక్కుపాదం మోపక తప్పదంటూ వార్నింగ్‌ ఇచ్చారు.