Encounter Yogi: ఎన్‌కౌంటర్ యోగి… సగటున రోజుకు 5 ఎన్‌కౌంటర్లు..!

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలు కూడా ఆడవారు బయటకు రావాలంటే భయపడేవారు. ఎప్పుడు ఎవడు ఎత్తుకెళతాడో తెలిసేది కాదు. పోలీసోళ్ల పెళ్లాలకే దిక్కులేదు.. విక్రమార్కుడు సినిమాలో సీన్‌కు కాస్త అటూ ఇటుగానే సిట్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.

  • Written By:
  • Publish Date - March 17, 2023 / 05:00 PM IST

రోజుకు సగటున 5 ఎన్‌కౌంటర్లు…. ఆరేళ్లలో 10,720 ఎన్‌కౌంటర్లు… 70మంది కరడుగట్టిన క్రిమినల్స్ హతం… 6వేలమంది అరెస్ట్… ఇది నా రికార్డ్ కాదు ఆల్‌టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ అంటున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్…

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు తీసుకుని సరిగ్గా ఆరేళ్లవుతోంది. సాధువు కదా సాఫ్ట్ గా ఉంటాడేమో అనుకున్నారు కానీ లోపల ఒరిజినల్ క్యారెక్టర్ వేరేగా ఉందని నిరూపించారు యోగి. యూపీలో యోగి సర్కార్ అభివృద్ధి పరంగా ఏం సాధించిందో ఏం సాధించలేదో అన్నది పక్కన పెడితే శాంతి భద్రతల విషయంలో మాత్రం సక్సెస్ అయ్యింది. యూపీ లా అండ్ ఆర్డర్‌ను తీసుకుంటే యోగికి ముందు, యోగి తర్వాత అని ఖచ్చితంగా చెప్పుకోవాలి.

2019 మార్చి19న యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ శాంతి భద్రతల విషయంలో అట్టడుగున ఉండేది. మాఫియా చెప్పిందే వేదం… హత్యలు, మానభంగాలు, దారిదోపిడీలు అబ్బో అరాచకాలకు అడ్డా అప్పటి యూపీ. పోలీసులే రాత్రిపూట ఒంటరిగా కాదు గుంపుగా కూడా బయట తిరగడానికి కూడా భయపడిన రోజులు… కానీ యోగి రాకతో సీన్ మారిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తొలిరోజు నుంచే యోగీ మార్క్ ఏరివేత మొదలైపోయింది…మధ్యలో ఆగలేదు. ఆరంభ శూరత్వం అనిపించుకోలేదు… యూపీలో పోలీసులు క్రిమినల్స్ తాట తీస్తూనే ఉన్నారు.

ఆరేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో 10,720 ఎన్‌కౌంటర్లు జరిగాయి. అంటే సగటున రోజుకు ఐదుచోట్ల క్రిమినల్స్, పోలీసుల మధ్య యాక్షన్ ఎపిసోడ్ నడిచిందన్నమాట. అందులో 63మంది కరడు గట్టిన క్రిమినల్స్ పోలీసు తూటాలకు బలైపోయారు. ఒక పోలీస్ అధికారి కూడా ప్రాణాలు కోల్పోయారు. 401మంది పోలీసులు గాయపడ్డారు. ఇక 6వేల మంది నేరస్తుల్ని పోలీసులు ఈ ఘటనల్లో అదుపులోకి తీసుకున్నారు. ఒక్క మీరట్ జిల్లాలోనే 3,152 ఎన్‌కౌంటర్లు జరిగాయి.

నిజానికి యోగికి ఈ టాస్క్ పెద్ద పరీక్షే పెట్టింది. యూపీలో క్రిమినల్స్‌ను, పొలిటీషియన్లను విడదీయలేం. పాలు, నీళ్లలా కలసిపోయారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు క్రిమినల్సే రాజకీయ నాయకుల అవతారం ఎత్తారు. ఒక్కొక్కడు ప్రైవేట్ సైన్యాన్ని మెయింటైన్ చేసేవారు. అలాంటి వారిని ఏరివేయడం మాటల్లో చెప్పినంత సులభం కాదు. పైగా అప్పటికే పోలీసులు జవసత్వాలు కోల్పోయి చచ్చిన పాములా పడి ఉన్నారు. కానీ తన మార్క్ ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు యోగి. పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఏమైనా చేయండి అవసరమైతే లేపేయండి అన్న సంకేతాలు ఇచ్చారు. అప్పటిదాకా దాచుకున్న ఆవేశాన్ని బయటకు తీసిన పోలీసులు…. ఖాకీల దమ్ము చూపించారు. తుప్పుపట్టిన తుపాకుల్లో తూటాలు నింపి రోడ్డెక్కారు. కరడు గట్టిన క్రిమినల్స్ కోసం వేట మొదలుపెట్టారు. దొరికిన వాడిని పట్టుకున్నారు… దొరకని వాడ్ని లేపేశారు. మాఫియా గుండెల్లో తుపాకులు పేల్చారు. మాఫియాలో భయాన్ని ఇంజక్ట్ చేశారు. ఒకప్పుడు మీసం మెలేసి రొమ్ము విరుచుకుని తిరిగిన వాళ్లు ఇప్పుడు క్రైమ్ చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. చాలామంది నేరస్తులు మారిపోయారు లేదా రాష్ట్రం వదిలి పారిపోయారు.

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో పట్టపగలు కూడా ఆడవారు బయటకు రావాలంటే భయపడేవారు. ఎప్పుడు ఎవడు ఎత్తుకెళతాడో తెలిసేది కాదు. పోలీసోళ్ల పెళ్లాలకే దిక్కులేదు.. విక్రమార్కుడు సినిమాలో సీన్‌కు కాస్త అటూ ఇటుగానే సిట్యుయేషన్ ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అర్థరాత్రి ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరిగేంత స్వాతంత్ర్యం అయితే రాలేదు కానీ పట్టపగలు కాస్త ధైర్యంగా రోడ్డెక్కే పరిస్థితులైతే వచ్చాయి. పలుకుబడి ఉన్న పొలిటికల్ గూండాలకు మాత్రం యోగీ ట్రీట్‌మెంట్ వేరేగా ఉంది. వాళ్లు దొరికితే జైలుకు… వారి ఇళ్లపైకి బుల్ డోజర్లు… అక్రమాల చిట్టా తీయడం కూల్చేయడం… యోగి తీరుపై, యూపీ పోలీసుల ఎన్ కౌంటర్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మానవ హక్కుల సంఘాలు గొంతు చించుకున్నాయి. అయితే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాత్రం అదే లైన్ పై నిలబడ్డారు. ఫలితంగా ఉత్తరప్రదేశ్‌లో క్రైమ్ తగ్గింది. ఆ రాష్ట్రం చెప్పుకోవడం కాదు జాతీయ స్థాయి గణాంకాలే దీన్ని నిర్ధారిస్తున్నాయి. కానీ ఇది చాలదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది…మొత్తంగా ఈ యోగి నేరస్తుల పాలిట సింహస్వప్నంలా మారిపోయారు. ఈ విషయంలో మాత్రం హ్యాట్సాఫ్ యోగి.