Vellampalli Srinivas: వైసీపీకి వెల్లంపల్లి గుడ్‌బై.. అసలు విషయం చెప్పిన మాజీ మంత్రి

ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు.

  • Written By:
  • Publish Date - December 20, 2023 / 06:59 PM IST

Vellampalli Srinvias: విజయవాడ పశ్చిమ సీటు దక్కడం లేదనే సమాచారంతో స్థానిక ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన పార్టీ మారబోతున్నరనే ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. తాను పార్టీ మారబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

YSRCP: అలీకి వైసీపీ టిక్కెట్.. ఎక్కడినుంచంటే..

“నాకు సీటు లేదని, సీటు మారుస్తున్నారని రకరకాల వార్తలు వేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు సంబంధించి క్యాంప్ ఆఫీస్‌కి నేను, మేయర్ రెండు రోజులు క్రిందట వెళ్ళాం. సీటు మార్పు గురించి నా దగ్గర ఇప్పటివరకు అధిష్టానం ప్రస్తావించలేదు. నేను వెస్ట్ నియోజకవర్గ నుంచి మళ్ళీ పోటీ చేస్తా. విజయవాడ సెంట్రల్ స్థానానికి వెళ్ళమన్నారు అనేది ప్రచారం మాత్రమే. నేను పార్టీకి రాజీనామా చేశానని ఫేక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను జగన్‌ను నమ్ముకున్న వ్యక్తిని. జగన్ ఏం చెప్పినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. విజయవాడ మూడు నియోజకవర్గాలతో పాటు, ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తాం” అని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు.

దీంతో ఆయన పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారం ఉట్టిదేనని తేలింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం చేపట్టిన నియోజకవర్గాలకు ఇంచార్జిలను మారుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది సొంత నియోజకవర్గాల్ని కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా నేతల్లో అసంతృప్తి కనిపిస్తోంది. వీరిలో కొందరు ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరమవుతున్నారు. మరికొందరు ఏకంగా పార్టీకే గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.