Vijayashanti: ఏం చేస్తున్నరో.. మీకైనా క్లారిటీ ఉందా రాములమ్మ..!

సినిమాలకు ఫుల్‌స్టాప్ చెప్పి మరీ బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. దాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్‌లో కలిపారు. గులాబీ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. అక్కడ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టారు. ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

  • Written By:
  • Publish Date - November 16, 2023 / 02:20 PM IST

Vijayashanti: నువ్ అటు తిరిగి ఇటు తిరిగి.. ఇక్కడికే వస్తావ్ అని తెలుసు. ఓ సినిమాలో డైలాగ్ ఇది. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతికి ఈ మాట పక్కాగా సరిపోయేలా కనిపిస్తోంది. ఇదంతా వదిలేస్తే.. రాములమ్మ రాజకీయం ఏంటో జుట్టు పీక్కున్నా అర్థం కాని పరిస్థితి చాలామందిది! సినిమాలకు ఫుల్‌స్టాప్ చెప్పి మరీ బీజేపీలో చేరారు. ఆ తర్వాత పార్టీ పెట్టారు. దాన్ని తీసుకెళ్లి బీఆర్ఎస్‌లో కలిపారు. గులాబీ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఏం జరిగిందో ఏమో తెలియదు. మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు.

Cyclone Midhili: ముంచుకొస్తున్న మిధిలీ తుఫాన్‌.. తెలుగు రాష్ట్రాలకు ముప్పు తప్పదా..?

అక్కడ నుంచి బీజేపీలోకి జంప్ కొట్టారు. ఇప్పుడు బీజేపీ నుంచి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 2009లో బీఆర్ఎస్‌ నుంచి మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత.. కేసీఆర్‌కు, ఆమెకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపించాయ్. దీంతో గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పిన విజయశాంతి.. కేసీఆర్‌ను గద్దెదించడమే లక్ష్యం అంటూ కాంగ్రెస్‌లో చేరారు. 2018లో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఐతే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరభావంతో.. రాములమ్మ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకోలేదనే అంచనాతో.. ఆ తర్వాత స్వింగ్‌లో కనిపించిన బీజేపీలో చేరిపోయారు. తెలంగాణలో కమలం పార్టీ బలోపేతం అవుతున్నట్లుగా పరిస్థితులు కనిపించడంతో.. ఆ పార్టీలో చేరిపోయారు. దీంతో విజయశాంతికి జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు అప్పగించింది కమలం పార్టీ. ఐతే కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో సీన్ మారింది. మళ్లీ కాంగ్రెస్‌ బలం పుంజుకోవడం స్టార్ట్ అయింది. ఆ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కనిపించాయ్.

దీంతో రాములమ్మ మళ్లీ మనసు మార్చుకున్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నిజానికి బీజేపీ మీద ఆమె చాలా రోజులుగా అసంతృప్తితో కనిపిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు చాలావరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు రాజీనామా చేశారు. గాంధీభవన్‌ వైపు అడుగులు వేస్తున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా.. రాములమ్మ తీరే ఇప్పుడు అందరినీ కన్ఫ్యూజన్‌కు గురి చేస్తుంది. ఏ పార్టీలో చేసినా.. కొద్దిరోజులేనా అనే చర్చ జరుగుతోంది సోషల్‌ మీడియాలో. చేరిన కొద్దిరోజులకే అసంతృప్తితో కనిపించడం ఏంటో.. ఆ తర్వాత మళ్లీ పార్టీ మారడం ఏంటో.. అసలు రాములమ్మ కన్ఫ్యూజన్‌లో ఉందా.. జనాలను కన్ఫ్యూజ్‌ చేస్తుందా అనే జోకులు పేలుతున్నాయ్‌.