ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటనలో కుట్ర దాగి ఉందనే కోణంలో పోలీసుల దర్యాప్తు వేగవంతం అయింది. పడవల యజమాని శేషాద్రి, రామ్మోహన్ అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునన్నారు విజయవాడ వన్ టౌన్ పోలీసులు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కో ఆర్డినేటర్ తలశిల రఘురాంకి రామ్మోహన్ అనే వ్యక్తి బంధువుగా గుర్తించినట్టు తెలుస్తోంది. దర్యాప్తు అనంతరం కుట్ర కోణం బయటపడితే మరికొంత మందిపై కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.
గుంటూరు జిల్లా ఉద్దండరాయుని పాలెం నుండి ఘటనకు కొద్ది రోజుల ముందే పడవలను గొల్లపూడి రేవు వద్దకు తరలించించినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. మరో రెండు పడవలు సుధీర్ , స్వామి పేరుపైన రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం అయిదు పడవలు గేట్లను ఢీకొట్టగా.. అందులో మూడు ఉషాద్రివే అని తేల్చారు. పడవలపై వైసీపీ రంగులు ఉండటాన్ని గుర్తించిన పోలీసులు… ఆ దిశగా విచారణ ముమ్మరం చేసారు.