YS JAGAN: విశాఖ రాజధాని తరలింపు వాయిదా వేసిన జగన్.. అసలు కారణం ఇదే..!

జగన్ విశాఖ నుంచి పాలన చేస్తానని, అధికార యంత్రాంగాన్ని తరలిస్తానని చెప్పారు. ఇందుకు అనుగుణంగా విశాఖలో జగన్ కోసం రుషికొండను తవ్వి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు. అలాగే మంత్రులు, అధికారుల కోసం నివాసాల్ని కూడా వెతికిపెట్టారు స్థానిక అధికారులు.

  • Written By:
  • Publish Date - December 12, 2023 / 03:57 PM IST

YS JAGAN: ఏపీకి మూడు రాజధానులు అంటూ ప్రకటించిన సీఎం జగన్.. విశాఖను పాలనా రాజధానిగా చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా విశాఖ నుంచి పాలన సాగిస్తానన్నారు. కానీ, ఈ ప్రకటన చేసి ఏడాది దాటిపోయినా.. ఇంకా జగన్ విశాఖపట్నం రాలేదు. ఇక.. ఇప్పట్లో వచ్చే అవకాశం కూడా లేదు. జగన్ విశాఖ నుంచి పాలన చేస్తానని, అధికార యంత్రాంగాన్ని తరలిస్తానని చెప్పారు. ఇందుకు అనుగుణంగా విశాఖలో జగన్ కోసం రుషికొండను తవ్వి మరీ నిర్మాణాలు చేపడుతున్నారు.

GROUP 2: గ్రూప్‌ 2 పరీక్షపై రేవంత్ కీలక నిర్ణయం

అలాగే మంత్రులు, అధికారుల కోసం నివాసాల్ని కూడా వెతికిపెట్టారు స్థానిక అధికారులు. ముందుగా గత ఉగాది నాటికే విశాఖ వస్తానన్నారు. ఆ తర్వాత జూన్, జూలై అని.. దసరా అని.. ఇలా చాలా గడువులే అయిపోయాయి. కానీ, రాజధాని విశాఖ తరలింపులో మాత్రం ఎలాంటి ముందడుగు పడలేదు. కొద్ది రోజులుగా ఈ అంశంపై ఎలాంటి స్పష్టతా లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇప్పట్లో జగన్ విశాఖకు వచ్చే అవకాశాలు లేవు. విశాఖకు రాకపోవడానికి కోర్టు కేసులు ఉండటం, ఎన్జీటీ అభ్యంతరాలు, భవన నిర్మాణాలు పూర్తి కాకపోవడం వంటివి కారణాలుగా చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు మరో మూడు నెలలు మాత్రమే గడువుంది. ఈ సమయంలో పూర్తిగా పార్టీ నిర్మాణం, ఎన్నికలపైనే దృష్టిపెట్టాల్సి ఉంది.

ఇలాంటి సమయంలో రాజధాని తరలింపు వంటి అంశాల్ని తెరపైకి తెస్తే.. లేనిపోని సమస్యలు. అందుకే విశాఖ రాజధాని తరలింపు నిర్ణయాన్ని సీఎం వాయిదా వేసినట్లు తెలుస్తోంది. అసలే వైసీపీకి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. అందువల్ల పూర్తిగా పార్టీ వ్యవహారాలు, ఎన్నికలపైనే దృష్టి పెట్టాలి. అందుకే ప్రస్తుతానికి విశాఖ రాజధాని అంశం కనుమరుగైనట్లే. ఎన్నికల తర్వాత ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం నిర్ణయాన్ని అనుసరించి తదుపరి చర్యలుంటాయి.