VIVEK VENKATASWAMY: కేసీఆర్‌‌కు రూ.కోటి ఇచ్చిన వివేక్‌.. అసలు విషయం బట్టబయలు..

వివేక్‌ తన ఆస్తులతో పాటు అప్పుల వివరాలు కూడా అధికారులకు సమర్పించారు. ఇందులో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కోటీ యాభై లక్షలు అప్పు ఇచ్చినట్టు చెప్పారు.

  • Written By:
  • Publish Date - November 12, 2023 / 07:30 PM IST

VIVEK VENKATASWAMY: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కలిసి పని చేస్తున్నాయని బీజేపీ నేతలు.. కాదు.. కాదు.. బీజేపీ బీఆర్‌ఎస్‌ కలిసి పని చేస్తున్నాయని కాంగ్రెస్‌ నేతలు.. చాలా కాలం నుంచి తెలంగాణలో వినిపిస్తున్న విమర్శలు ఇవే. ప్రజలను మోసం చేసేందుకు బయటికి శతృవుల్లా కనిపిస్తూ లోలోపల ఒప్పందాలు పెట్టుకుంటున్నారనేది ఓవరాల్‌గా వీళ్ల పాయింట్‌. స్టేట్‌లో ఇలాంటి పరిస్థితి కొనసాగుతున్న టైంలో వివేక్‌ వెంకటస్వామి ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన కొన్ని విషయాలు ఇప్పుడు పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారాయి.

REVANTH REDDY: ఇది పీకే స్ట్రాటజీ!? పీకే డైరెక్షన్‌లో నడుస్తున్న కేసీఆర్: రేవంత్ రెడ్డి

ఎలక్షన్‌ నామినేషన్‌లో భాగంగా అభ్యర్తులు తమకున్న ఆస్తులు, అప్పులు వివరాలను ఎన్నికల అధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే వివేక్‌ తన ఆస్తులతో పాటు అప్పుల వివరాలు కూడా అధికారులకు సమర్పించారు. ఇందులో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి కోటీ యాభై లక్షలు అప్పు ఇచ్చినట్టు చెప్పారు. అఫిడవిట్‌లో ఈ విషయాన్ని క్లియర్‌గా రాశారు. ఈ అఫిడవిట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. రాజకీయ నేతలు ఏ పార్టీలో ఉన్నా.. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారని తెలిసిందే. వాళ్లను నమ్మే ప్రజలే అమాయకులు అంటున్నారు కామన్‌ పీపుల్‌. అయితే బీఆర్‌ఎస్‌ నేతలు మాత్రం ఈ వాదనను తిప్పి కొడుతున్నారు. వివేక్‌ బీఆర్‌ఎస్‌లో ఉన్న సమయంలో కేసీఆర్‌కు డబ్బు ఇచ్చి ఉంటారని చెప్పారు.

ఎన్నికల ఖర్చుల కోసం ఇలా అప్పులు తీసుకోవడం కామన్‌ అంటూ కవర్‌ చేస్తున్నారు. ఇక గతంలో వివేక్‌, రాజగోపాల్‌ రెడ్డి ఇద్దరూ బీజేపీలో ఉన్నారు. రీసెంట్‌గా ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చారు. అలా వాళ్లిద్దరి మధ్య మనీ ట్రాన్జాక్షన్స్‌ ఉండటం కామన్‌ అంటూ చెప్తున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. ఈ వ్యవహారాన్ని వాళ్లు కవర్‌ చేసే తీరు ఎలా ఉన్నా.. ఈ అఫిడవిట్‌ చాలా మందిలో చాలా అనుమానాల్ని రేకెత్తిస్తోంది.