Vivek Venkatswamy: కారెక్కబోతున్న వివేక్‌ వెంకటస్వామి.. బీజేపీకి ఝలక్ తప్పదా..? వివేక్ మీడియా ఏం చేస్తుంది..?

ఇప్పుడు కమలానికి ఝలక్ ఇచ్చేందుకు వివేక్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి జంపింగ్ జపాంగ్‌ అనబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో! వివేక్.. బాల్కసుమన్‌తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - September 25, 2023 / 03:48 PM IST

Vivek Venkatswamy: జంపింగ్‌లు రాజకీయాల్లో కామన్. ఐతే కొందరు పార్టీ మారితే మాత్రం ఎక్కడాలేని చర్చ జరుగుతుంది. అలాంటి జాబితాలో టాప్‌లో ఉంటారు వివేక్‌ వెంకటస్వామి అలియాస్ వీ6 వివేక్‌. తండ్రి వెంకటస్వామి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్న వివేక్‌.. ఎంపీగా గెలిచారు. 2014లో పెద్దపల్లి నుంచి పోటీ చేసి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి కారెక్కారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. కమలతీర్థం పుచ్చుకున్నారు.

ఇప్పుడు కమలానికి ఝలక్ ఇచ్చేందుకు వివేక్ రెడీ అవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ నుంచి బీఆర్ఎస్‌లోకి జంపింగ్ జపాంగ్‌ అనబోతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో! వివేక్.. బాల్కసుమన్‌తో కలిసి ఉన్న ఫొటో ఒకటి ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. దీంతో వివేక్ అడుగులు ఎటువైపు అన్న ఆసక్తి.. రాజకీయం తెలిసిన ప్రతీ ఒక్కరిని వేధిస్తోంది. వివేక్ నిజంగా కారెక్కబోతున్నారా.. అదే జరిగితే ఆయన చానెల్‌ వీ6 పరిస్థితి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. పూర్తిగా కమలం వైపు తిరిగిపోయిన వీ6.. బీఆర్ఎస్‌ సర్కార్‌ను ఏకిపారేస్తోంది. ఆ తీన్మార్ వార్తలతో గులాబీ నేతలను మాములుగా ఆడుకోవడం లేదు! చానెల్ మాత్రమే కాదు.. వెలుగు పత్రికలోనూ సేమ్‌ సీన్‌. పేరు తెలియని బీజేపీ నేత గురించి పెద్దపెద్ద అక్షరాల్లో రాయడమే కాదు.. బీఆర్ఎస్‌ గురించి చిన్న నెగిటివ్‌ వార్త వచ్చినా చాలు.. అక్షరాలతో ఆడేసుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు వివేక్‌ బీఆర్ఎస్‌ గూటికి చేరితే.. ఆ చానెల్‌, పత్రిక పూర్తిగా స్వరం మారుస్తాయా అనే చర్చ జరుగుతోంది.

నిన్నటివరకు కారు పార్టీని.. కారు పార్టీ నేతలను పొట్టు పొట్టు తిట్టిన వీ6.. ఇప్పుడు కేసీఆర్ భజన చేస్తుందా అనే చర్చ జరుగుతోంది. నిజానికి వివేక్‌ కమలం పార్టీలో ఉన్నా.. వీ6 చానెల్‌, వెలుగు పత్రిక మాత్రం.. బీజేపీతో పాటు కాంగ్రెస్‌ను వెనకేసుకువచ్చింది. అలాంటిది ఆయన బీఆర్ఎస్‌లో చేరితే.. ఆ రెండు పార్టీలను తిట్టాల్సి ఉంటుంది. మరి ఆ చానెల్, పత్రిక అదే చేస్తాయా అంటే.. నో అనడానికి మాత్రం లేదు అనే చర్చ జరుగుతోంది. వివేక్ ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీకి భజన చేయడం ఈ చానెల్‌, పేపర్‌కు కొత్తేం కాదు అన్నది సోషల్‌ మీడియాలో జరుగుతున్న మరో చర్చ. ఏమైనా వివేక్ వెంకటస్వామి నిజంగా పార్టీ మారుతారా.. అదే జరిగితే ఆయన మీడియా సంస్థల నుంచి వ్యతిరేక వార్తలు కచ్చితంగా చూస్తామా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.. ఇందుకు వేచి చూడాలి మరి!