ఎన్నికల వేళ తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అసంతృప్త నేతలంతా ఎవరి దారి వారు చూసుకంటున్నారు. ఇతర పార్టీల్లోకి జంప్ కొడుతున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్‌తో కంపేర్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీయే ఈ అసంతృప్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక అటు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేక్ బీజేపీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీకి జై కొట్టారు. దీంతో తెలంగాణలో బీజేపీకి మరో గట్టి దెబ్బ తగిలినట్లు అయింది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి.. బీజేపీని వీడి కాంగ్రెస్‌లే చేరారు. ఇప్పుడు కమలం పార్టీకి మరో షాక్ వివేక్ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. ఆ తర్వాత రాహుల్‌గాంధీని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బీజేపీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌గా వ్యహరించిన వివేక్.. ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది.
నిజానికి కోమటిరెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన సమయంలోనే వివేక్ పేరు బలంగా వినిపించింది. ఐతే ఆ సమయంలో ఆ ప్రచారాన్ని ఖండించారు ఆయన. తాను బీజేపీ నుంచి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారు. కట్ చేస్తే వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఐతే సునీల్ కనుగోలు, రేవంత్ మధ్యవర్తిత్వంతో.. రాహుల్ హామీతో వివేక్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక అటు వివేక్‌కు కాంగ్రెస్ రెండు సీట్లు ఆఫర్ చేసిందనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది. చెన్నూరు ఎమ్మెల్యే సీటు తో పాటు పెద్దపల్లి ఎంపీ టికెట్ కూడా వివేక్ కుటుంబానికి దక్కిందని చెప్తున్నారు. దీంతో చెన్నూరు నుంచి వివేక్ కుమారుడు ఎమ్మెల్యేగా..పెద్దపల్లి పార్లమెంట్ని యోజకవర్గం నుంచి వివేక్ ఎంపీగా పోటీ చేసే ఛాన్స్ ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇక అటు చెన్నూరులో సీటు పొత్తులో భాగంగా సిపిఐ కేటాయించాలని ముందుగా చర్చలు నడిచాయ్. మరి వివేక్ రీ ఎంట్రీతో చెన్నూరులో ఏ జరుగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.