CHANDRABABU NAIDU: కుప్పంలో వాలంటీర్ల రాజీనామా.. చంద్రబాబుకు ఓటమి తప్పదా..?

వాలంటీర్లుగా ఉంటూ ప్రభుత్వం కోసం పని చేయడం సాధ్యం కాదు కాబట్టి.. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా వాలంటీర్లు రాజీనామా చేశారు.

  • Written By:
  • Publish Date - April 7, 2024 / 11:40 AM IST

CHANDRABABU NAIDU: ఏపీలో వాలంటీర్ల విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ అంతాఇంతా కాదు. వాలంటీర్లు పెన్షన్లు పంచకూడదంటూ ఈసీ ఆదేశాలివ్వడంతో.. దీనికి కారణం టీడీపీయే అంటూ వైసీపీ విమర్శలు మొదలెట్టింది. ఇదే సమయంలో పెన్షన్ల అందక కొందరు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడ్డారు. కొందరు వృద్ధులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైసీపీ, టీడీపీ మధ్య వాలంటీర్ల అంశంపై మాటలయుద్ధం కొనసాగుతోంది. మరోవైపు.. వాలంటీర్లు టీడీపీకి వ్యతిరేకంగా పని చేసేందుకు సిద్ధమయ్యారు.

Kalki 2898 AD: అస్సలు ఊహించలేదుగా.. ఓటిటిలోకి కల్కి

వాలంటీర్లుగా ఉంటూ ప్రభుత్వం కోసం పని చేయడం సాధ్యం కాదు కాబట్టి.. కొందరు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారు. వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. తాజాగా చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో కూడా వాలంటీర్లు రాజీనామా చేశారు. కుప్పం నియోజకవర్గంలోని 384 మంది వాలంటీర్లు ఒకేసారి రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలను ఎంపీడీఓకు వాలంటీర్లు అందజేశారు. అంతేకాదు.. రాబోయే ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డిని, కుప్పం ఎమ్మెల్యేగా భరత్‌ను గెలిపిస్తామని రాజీనామా చేసిన వాలంటీర్లు వెల్లడించారు. దీంతో వీళ్లంతా వైసీపీకి అనుకూలంగా, చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెడితే.. రాజకీయంగా చంద్రబాబుకు ఇబ్బందే. ఇప్పటికే అక్కడ మునుపటి పరిస్థితులు లేవు. చంద్రబాబుకు వ్యతిరేకంగా కుప్పంలో వైసీపీ అనేక ప్రణాళికలతో ముందుకెళ్తోంది. చంద్రబాబును ఓడించడమే లక్ష్యంగా పని చేస్తోంది. చంద్రబాబు విజయం సాధించినా.. మునుపటి మెజారిటీ కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా చేసిన వాళ్లంతా చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రచారానికి దిగితే ఆ ఎఫెక్ట్ గట్టిగానే ఉంటుంది.

బాబు సీఎం అయితే.. పెన్షన్లు, పథకాలు రావని వీళ్లంతా ప్రచారం చేసే అవకాశం ఉంది. దీంతో బాబు గెలుపు అవకాశాలు సన్నగిల్లుతాయి. అయితే, ఈ పరిస్థితి కుప్పంలోనే కాదు.. రాష్ట్రంలో అనేక చోట్ల ఉంది. ఇప్పటి వరకు ఏపీలో 1500 మందికి పైగా వాలంటీర్లు రాజీనామా చేశారు. వీళ్లంతా వైఎస్ఆర్ సీపీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పటికే పెన్షన్లు ఆలస్యమయ్యేందుకు టీడీపీయే కారణమని వైసీపీ, వాలంటీర్లు ఊళ్లలో ప్రచారం చేస్తున్నారు. దీంతో టీడీపీపై కొంత వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వాలంటీర్లు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగుతుండటంతో పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి. రాబోయే ఎన్నికల్లో వాలంటీర్ల ప్రభావం ఎంతవరకు ఉంటుందో చూడాలి.