ASSEMBLY ELECTIONS: ఎంత చేసినా చాలదా..! అప్పుడు చేసింది లెక్కలేదు ! ఇప్పుడు ఇచ్చిందే లెక్క !!

అభివృద్ది, తన కుటుంబ సంక్షేమానికి నిధులు ఇచ్చిన ఆ అధికార పార్టీని జనం కరుణిస్తారా అంటే అదేం లేదు. మళ్ళా ఎన్నికలకు పైసలు పంచాల్సిందే. పక్కింటోడికి.. మనకీ ఇచ్చే పంపకంలో కొంచెం తేడా వచ్చినా ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు జనం.

  • Written By:
  • Updated On - November 29, 2023 / 08:14 PM IST

ASSEMBLY ELECTIONS: సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా గవర్నమెంట్ ఉన్న ఐదేళ్ళల్లో సంక్షేమం, అభివృద్ధి కోసం.. లక్షల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాల్సిందే. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకం అందాలి. ఊరు బాగుండాలి.. మండలం, సిటీ, జిల్లా.. ఇలా ప్రతిదీ అభివృద్ధి చేయాలి. ఎక్కడ వర్క్ ఆగినా.. నువ్వేం చేశావయ్యా అని ఐదేళ్ళ తర్వాత ప్రచారానికి వచ్చే నేతను నిలదీస్తారు జనం. సరే అభివృద్ది, తన కుటుంబ సంక్షేమానికి నిధులు ఇచ్చిన ఆ అధికార పార్టీని జనం కరుణిస్తారా అంటే అదేం లేదు.

KTR BLOOD DONATION: కేటీఆర్ డయాబెటిస్ పేషెంట్ ! మరి రక్తదానం చేయొచ్చా?

మళ్ళా ఎన్నికలకు పైసలు పంచాల్సిందే. పక్కింటోడికి.. మనకీ ఇచ్చే పంపకంలో కొంచెం తేడా వచ్చినా ఓట్లు వేయడానికి నిరాకరిస్తారు జనం. బోల్డన్ని సంక్షేమ పథకాలు.. ఎన్నో అభివృద్ధి పథకాలు.. రైతులు, మహిళలు, పేదలు, ధనికులు.. ఇలా ఏ వర్గాన్నీ వదలకుండా మేలు చేస్తుంది ప్రభుత్వం. సరే ఏదైనా వర్గానికి కొంత అన్యాయం జరిగితే.. ఆ వర్గం నెక్ట్స్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓట్లు వేయకపోవచ్చు. కానీ రైతులను ఆదుకునే స్కీమ్స్, పంటలు అమ్ముకోడానికి వసతులు, గిట్టుబాటు ధరలు ఉండేలా చూస్తారు. తెలంగాణలో అయితే రైతు రుణమాఫీ లాంటి పథకాలు కూడా ఉన్నాయి. వృద్ధులు, మహిళలకు ఫించన్లు.. డ్వాక్రా స్కీమ్‌లు, ఇళ్ళు లాంటి వ్యక్తిగత పథకాలను ప్రభుత్వాలు అందిస్తాయి. ఇవి కాకుండా ఊళ్ళో రోడ్లు వేయాలి.. హాస్పిటల్స్, దవాఖానాలు లాంటివే కాకుండా పట్టణాలకు కనెక్టివిటీ పెంచే ఎన్నో పనులు చేస్తారు. సిటీకి వచ్చే సరికి వ్యక్తిగత స్కీములతో పాటు.. బస్తీలను బాగు చేయడం, డ్రైనేజీలు, అండర్ పాస్‌లు, ఫ్లై ఓవర్లు, పార్కులు లాంటి ఎన్నో అభివృద్ధి పథకాలను అమలు చేస్తాయి ప్రభుత్వాలు.

ఇలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పేరుతో లక్షల కోట్లు ఖర్చుపెడుతుంది ప్రభుత్వం. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు, ఎంపీల దగ్గర నుంచి స్థానిక, పట్టణ ప్రజా ప్రతినిధులు దాకా అందరూ ప్రభుత్వంలో ఉంటారు. వీళ్ళంతా పని చేయకపోతే ఇంత అభివృద్ధి సాధ్యం కాదు కూడా. సరే.. ఇదంతా వాళ్ళేమీ.. సొంత జేబుల్లో నుంచి ఇవ్వడం లేదు. ఇదంతా ప్రజా ధనమే. ప్రజలు కట్టిన ట్యాక్సుల నుంచే పథకాలు, అభివృద్ధి పనులకు మళ్ళిస్తారు. ఎన్ని డ్యాములు కట్టినా.. ఎన్ని వెల్ఫేర్ స్కీములు పెట్టినా.. చివరకు ఓటర్ డబ్బు ఇవ్వకుండా ఎందుకు ఓట్లేయలేకపోతున్నాడు. డబ్బులు తప్ప ఎన్ని మంచి మాటలు చెప్పినా.. వినే పరిస్థితి ఎందుకు లేకుండా పోతోంది. మన ఓటుకు రూ.3 నుంచి రూ.5 వేల వరకూ ఖర్చుపెడుతున్నాడు అభ్యర్థి. కానీ ఇప్పుడు పెట్టిన డబ్బంతా మళ్ళీ ఐదేళ్లలో రాబట్టుకుంటాడని మనకు తెలియదా..? అదే మనం ఓటుకు నోటు తీసుకోకుండా ఉంటే.. ఖచ్చితంగా అభ్యర్థి కూడా నిజాయతీగానే ఐదేళ్ళూ పనిచేయాలి.

ASSEMBLY ELECTIONS: చిరంజీవి, మహేశ్ బాబు.. ఓట్లు వేయబోయే పోలింగ్ బూత్‌లివే..!

ఎక్కడ డబ్బులకు ఆశపడ్డా.. ఏ స్కీములో దోచుకున్నా.. వాళ్ళు మళ్ళీ నిలబడే నైతికత కోల్పోతారు. ఇదే టైమ్‌లో మంచి వాళ్ళకు కూడా పోటీచేసే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. యువకులు, సమాజ సేవకులు.. ఇలా ఎన్నికల్లో పెట్టే ఖర్చుకు భయపడే రాజకీయాల్లోకి రావడం లేదు. వాళ్ళు పాలిటిక్స్‌లోకి వస్తే సమాజంలో ఎంత మార్పు వస్తుందో ఆలోచించండి. నోటు తీసుకోకుండా ఓట్లేద్దాం.. మన పాలకులను మనమే మార్చుకుందాం.. ఇవన్నీ మీకు తెలియని కాదు. కాకపోతే కొద్దిమందిలో అయినా మార్పు వస్తుందేమోనన్న ఆశ. అందుకే.. ఇదంతా..!