వైసీపీ నామినేషన్ ఉపసంహరణ జరగకపోతే రేపు అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. బ్యాలెట్ పద్దతిలో రేపు సభ జరిగే సమయంలోనే పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. టీడీపీ తరఫున శ్రీరాం రాజగోపాల్, బీవీ జయనాగేశ్వరరెడ్డి, అరిమిల్లి రాధా కృష్ణ, అశోక్ రెడ్డి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు, కోళ్ల లలితకుమారి నామినేషన్ లు దాఖలు చేసారు. జనసేన తరఫున పీఏసీ సభ్యత్వానికి పులవర్తి రామాంజనేయులు నామినేషన్ వేసారు.
ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యాక పీఏసీ చైర్మన్ గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులుకు అవకాశం ఉంది. 3 సార్లు ఎమ్మెల్యే గా పులవర్తి గెలిచారు. బీజేపీ తరఫున పీఏసీ సభ్యత్వానికి విష్ణు కుమార్ రాజు నామినేషన్ వేసారు. పీయూసీ చైర్మన్ గా కూన రవికుమార్ కు కూడా అవకాశామం ఉంది. ఎస్టిమేట్స్ కమిటీ ఛైర్మన్ గా వేగుళ్ల జోగేశ్వరరావుకు అవకాశం ఉంది. వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నామినేషన్ దాఖలు చేసారు.