బ్రేకింగ్: కాళేశ్వరంపై సంచలన విషయాలు, అన్నారంలో ఏం జరుగుతోంది…?

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందుకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఆరు మంది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులను విచారించిన కమిషన్...

  • Written By:
  • Publish Date - September 21, 2024 / 03:33 PM IST

కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ కొనసాగుతోంది. కమిషన్ ముందుకు హాజరైన క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్లు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇప్పటి వరకు ఆరు మంది క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ అధికారులను విచారించిన కమిషన్… పలు కీలక అంశాలను రాబట్టారు. క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్ లో ఈఈ, సీఈ, ఎస్ఈ లతో పాటు ఒకరు రిటైర్డ్ ఈఈ, ఇద్దరు రిటైర్డ్ సీఈలను విచారించారు. మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ పాత్రపై ప్రశ్నల వర్షం కురిపించింది.

బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమీషన్ అడగగా… రెండు మూడు నెలలకొకసారి అంటూ ఒకరు అసలు సైట్ విజిట్ చేయాలేదని మరొకరు సమాధానం ఇచ్చారు. అన్నారం డిజైన్ సరిగ్గా లేదని కమిషన్ ముందు అన్నారం బ్యారేజ్ ఈఈ వెల్లడించారు. వరధకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదు అని 5 మీటర్ ఫర్ సెకండ్ ఫ్లడ్ ను తట్టుకునేంత వరకే డిజైన్ చేశారు కానీ 18 మీటర్ ఫర్ సెకండ్ అన్నారం లోకి ఫ్లడ్ వస్తోంది అని తెలిపారు. ఎత్తిపోతలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వివరించారు. టైల్ వాటర్ ను నిలుపలేకపోతున్నామన్నారు.