ఫార్ములా-ఈ రేసింగ్‌లో ఏం జరిగింది ? కేటీఆర్ అరెస్ట్‌ అవుతారా!

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ చుట్టే తిరుగుతోంది. ఈ రేసింగ్‌ ఈవెంట్‌ను అడ్డుపెట్టుకుని కేటీఆర్ 55 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో HMDA కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌కు ఈడీకి బ్రీఫింగ్‌ కూడా ఇచ్చినట్టు చర్చ నడుస్తోంది.

  • Written By:
  • Publish Date - November 7, 2024 / 08:31 PM IST

తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ చుట్టే తిరుగుతోంది. ఈ రేసింగ్‌ ఈవెంట్‌ను అడ్డుపెట్టుకుని కేటీఆర్ 55 కోట్లు అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో HMDA కమిషనర్‌ అరవింద్‌ కుమార్‌కు ఈడీకి బ్రీఫింగ్‌ కూడా ఇచ్చినట్టు చర్చ నడుస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ నిర్వహించారు. కేటీఆర్ స్వయంగా కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి ఈ రేసింగ్‌ ఏర్పాటు చేశారు. సెక్రటేరియట్‌, ట్యాంక్‌ బండ్‌ కవర్‌ చేసేలా దీనికోసం ప్రత్యేక్ంగా ట్రాక్‌ను ఏర్పాటు చేశారు.

ఇండియాలో మొదటి సారి ఫార్ములా-ఈ రేసింగ్‌ ఏర్పాటు చేయడం.. అది కూడా హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడంతో ఆ సమయంలో దేశం మొత్తం తెలంగాణ వైపు చూసింది. పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఈ రేసింగ్‌ను చూసేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. కానీ FEO ఆశించిన ఆదాయం ఈ రేసింగ్‌లో రాలేదు. దీంతో హైదరాబాద్‌లో మరోసారి రేసింగ్‌ నిర్వహించేందుకు నిరాకరించింది. డీల్‌ క్యాన్సిల్‌ అవ్వడంతో FEOకు చెల్లించాల్సిన 55 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. ఆ డబ్బును HMDA నుంచి FEOకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

అయితే ఈ ట్రాన్స్‌ఫర్‌ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే జరిగిందని.. కేటీఆర్‌ ఆ కంపెనీతో కుమ్మక్కై ఈ డబ్బు కాజేశారు అనేది కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణ. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అమెరికాలో ఉన్న సమయంలో త్వరలో బాంబు పేలబోతోంది.. బీఆర్‌ఎస్‌ పెద్దలు అరెస్ట్‌ కాబోతున్నారు అంటూ కామంట్‌ చేశారు. ఆ కామెంట్స్‌ ఈ న్యూస్‌కు సంబంధించినవే అనే చర్చ కూడా జరుగుతోంది. కాంగ్రెస్‌ ఆరోపణలు ఎలా ఉన్నా.. బీఆర్ఎస్‌ నుంచి ఈ ఆరోపణలపై ఎలాంటి రియాక్షన్‌ రాలేదు. దీంతో ఈ కేసులో త్వరలోనే కేటీఆర్ అరెస్ట్‌ కాబోతున్నారు అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది.