Punganur : పుంగనూరు గొడవకు పులివెందులే కారణమా…?

చంద్రబాబు పర్యటనలో పుంగనూరులో చోటు చేసుకున్న గొడవల వెనక పక్కా వ్యూహముందా...? మంత్రి పెద్దిరెడ్డి బ్యాచ్‌ వ్యూహాత్మకంగా బాబును బుక్ చేయడానికి ప్రయత్నించిందా...? అసలు పుంగనూరు గొడవకు పులివెందులకు లింకేంటి...?

  • Written By:
  • Updated On - August 5, 2023 / 12:06 PM IST

చంద్రబాబు పర్యటనలో పుంగనూరులో చోటు చేసుకున్న గొడవల వెనక పక్కా వ్యూహముందా…? మంత్రి పెద్దిరెడ్డి బ్యాచ్‌ వ్యూహాత్మకంగా బాబును బుక్ చేయడానికి ప్రయత్నించిందా…? అసలు పుంగనూరు గొడవకు పులివెందులకు లింకేంటి…?

పులివెందుల ఎఫెక్టేనా…?
చంద్రబాబు పుంగనూరు పర్యటన రణరంగమైంది. కొన్ని గంటల పాటు దాడులు, ప్రతిదాడులు, పోలీసుల లాఠీఛార్జ్‌తో హైటెన్షన్‌ నెలకొంది. అయితే చంద్రబాబు పర్యటనను అడ్డుకోవడానికి వైసీపీ వేసిన ఎత్తుగడల ఫలితమే ఈ హింస అంటున్నారు. చంద్రబాబు ప్రాజెక్టుల పర్యటనను అడుగడుగునా అడ్డుకోవాలన్నది వైసీపీ వ్యూహం. అయితే జగన్ అడ్డా పులివెందులలో బాబు పర్యటన సాఫీగా సాగిపోయింది. పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదు. భారీగా టీడీపీ కార్యకర్తలు కూడా తరలివచ్చారు. జై చంద్రబాబు నినాదాలతో పులివెందుల హోరెత్తిపోయింది. జగన్ అడ్డాలో టీడీపీకి మైలేజ్‌ రావడాన్ని వైసీపీ జీర్ణించుకోలేకపోయిందనే ఆరోపణలున్నాయి.. చిన్న చిన్న ఘటనలు కూడా లేకుండా బాబు పర్యటన సాగడాన్ని వైసీపీ నేతలు అవమానంగా భావించారు. ఇలాగైతే బాబు పర్యటన సక్సెస్ అవుతుందని భయపడ్డారు. పుంగనూరులో అడ్డుకుంటే మిగిలిన చోట్లకు బాబును వెళ్లకుండా అడ్డుకోవచ్చన్నది వైసీపీ నేతల ప్లాన్‌గా కనిపిస్తోంది.

పెద్దిరెడ్డి ఏమన్నారంటే…!
చంద్రబాబు 150వాహనాల్లో రౌడీలతో దాడికి ప్లాన్డ్‌గా వచ్చారని మంత్రి పెద్దిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఈ కేసులో చంద్రబాబును ఏ-1గా పెట్టాలని డిమాండ్ చేశారు. గతంలో పుంగనూరులో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదని బాబు వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. నిజానికి అక్కడ ఇరుపార్టీల కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. కానీ మంత్రి మాత్రం అసలు వైసీపీ కార్యకర్తలదేం తప్పులేదని అంతా టీడీపీదే తప్పంటున్నారు. బాబు పుంగనూరులోకి అడుగుపెట్టకుండా వైసీపీ కార్యకర్తలు వాహనాలు పెట్టి రెచ్చగొట్టిన విషయాన్ని మాత్రం ఆయన ప్రస్తావించడం లేదు. పుంగనూరులో ఎలా అడుగుపెడతారో చూస్తామంటూ బాబుకు సవాల్ విసిరింది ఎవరో అందరికి తెలుసు..!

సహకరించిన పోలీసులు
బాబును పుంగనూరులో అడుగుపెట్టనివ్వొద్దని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు పెద్దిరెడ్డి. ఆరునూరైనా సరే బాబును రానివ్వకూడదని ప్లాన్. అందుకే బాబు మార్గానికి లారీలు అడ్డుపెట్టారు. పోలీసులు కూడా యథాశక్తి వైసీపీకి సహకరించారనే ఆరోపణలున్నాయి. జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి కూడా కూడా వైసీపీ వర్షన్‌నే వినిపిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలే పోలీసులపై రాళ్ల దాడి చేశారని చెప్పుకొచ్చారు. పక్కా పథకం ప్రకారమే పోలీసులపై దాడులు జరిగాయంటూ పొలిటికల్ లీడర్‌లా మాట్లాడారు. అయితే చంద్రబాబును పుంగనూరులో అడుగుపెట్టకుండా వైసీపీ వాళ్లు ఎందుకు లారీలు అడ్డుపెట్టారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.. అక్కడ వైసీపీ కార్యకర్తలు భారీగా మోహరించి నినాదాలు చేసినప్పుడు ఎస్పీ ఏమయ్యారని నిలదీస్తున్నారు. బైపాస్‌ నుంచి వెళ్లాల్సిన చంద్రబాబు పుంగనూరుకు రావడంతోనే హింసాత్మక ఘటనలు జరిగాయన్నది పోలీసుల వర్షన్. అయితే తాను పుంగనూరుకు వస్తానని ముందుగానే చెప్పానంటున్నారు చంద్రబాబు. ఒకవేళ తాను రూట్ మార్చాననుకుంటే  అప్పటికప్పుడు అంతమంది వైసీపీ కార్యకర్తలు ఎలా గుమిగూడారనేది చంద్రబాబు ప్రశ్న.

చంద్రబాబు సహనం కోల్పోయారా…?
చంద్రబాబు సహనం కోల్పోయారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు కర్రతో వస్తే నేను కర్రతో వస్తా అన్నారు. వైసీపీకి సహకరిస్తున్న డీఎస్పీని ఆ బట్టలు తీసేయమంటూ హెచ్చరించారు. దాన్నే సాకుగా చూపించి బాబును ఇరికించాలన్నది వ్యూహంగా కనిపిస్తోంది. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం సాగుతోంది.