నెహ్రూ ,ఎడ్వినా లేఖల్లో ఉన్న రహస్యమేంటి ? ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందా ?

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్, తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్,భార్య ఎడ్విన్ మౌంట్ బాటన్ మధ్య ప్రేమాయణం సాగిందా ? లేదంటే అంతకు మించి...వివాహేతర సంబంధం వరకు వెళ్లారా ?

  • Written By:
  • Publish Date - December 21, 2024 / 12:21 PM IST

దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్, తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్,భార్య ఎడ్విన్ మౌంట్ బాటన్ మధ్య ప్రేమాయణం సాగిందా ? లేదంటే అంతకు మించి…వివాహేతర సంబంధం వరకు వెళ్లారా ? ఇద్దరి మధ్య ఏమీ జరగకపోతే.. నెహ్రూ ఏడ్వినా కి రాసిన ఉత్తరాలను సోనియా గాంధీ ఎందుకు తీసుకున్నారు ? ఎక్కడ దాచారు?నెహ్రూ, ఎడ్విన ఎఫైర్ బయటపడుతుందన్న భయంతోనే…మ్యూజియం నుంచి తీసుకెళ్లారా ? రహస్యం లేకపోతే…లెఖలను ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీకి ఎందుకు అప్పగించడం లేదు ?

దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకెక్కాయి. ప్రస్తుత రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. స్వాతంత్య్ర పోరాట సమయంలో , ఆతరవాత ఆయన రాసిన లేఖలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. జవహర్ లాల్ నెహ్రూ, లార్డ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా బాటన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. అంతే కాదు వాళ్లిద్దరూ తరచు కలిసే వారని, ఏడ్వినా పెట్టే పాన్ కేక్స్ అంటే నెహ్రూ పడి చచ్చేవారని అప్పట్లో గాసిప్స్ నడిచేవి. 1947 -50 మధ్య స్వతంత్రం వచ్చిన తరవాత కూడా ఏడ్వినా నెహ్రూ మధ్య స్నేహం కొనసాగింది.వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అన్న విషయం పై సస్పెన్స్ అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది.
బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ కి బంధువు కూడా అయినా ఎడ్వినా ఆ రోజుల్లో బ్రిటన్ అందగత్తెల్లో ఒకరు. భర్త , ఇండియా వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ తో కలసి ఇండియా వచ్చింది. ఆ సందర్భం గా నెహ్రూ తో స్నేహం బలపడింది. వాళ్లిద్దరూ తరచు కలిసేవారు.

ఎడ్వినా మౌంట్ బాటన్ కి అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ కొన్ని లేఖలు రాశారు. ప్రధాన మంత్రులకు సంబంధించిన లేఖలు, డాక్యుమెంట్లను…ప్రధాన మంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరుస్తున్నారు. ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది. నెహ్రూ, ఎడ్వినా మధ్య సాగిన ఉత్తరప్రత్యుత్తరాలను కూడా మ్యూజియంలో దాచారు.

2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత…నెహ్రూ, ఎడ్వినా మధ్య ఉత్తరాలను సోనియా గాంధీ…మ్యూజియం నుంచి తీసుకెళ్లారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండటంతో ఎలాంటి వివాదం కాలేదు. పీఎంఎంఎల్ నుంచి ఆ ఉత్తరాలను సోనియా తీసుకుని ఏం చేశారు. ? ఎక్కడ దాచారు ? ఇన్నాళ్లు వాటిని ఎందుకు వెనక్కి ఇవ్వలేదు ? ఆ ఉత్తరాల్లో అంత రహస్యం ఏముంది ? అభ్యంత్రకరమైన విషయాలు ఉన్నాయా ? అసలు ఆ ఉత్తరాలతో సోనియా గాంధీకి ఏంటి సంబంధం అనే చర్చ మొదలైంది. జవహర్ లాల్ నెహ్రూ, ఎడ్వినా మౌంట్ బాటన్ మధ్య ప్రేమాయణం సాగిందన్నది బహిరంగమే. అప్పట్లో వీరిద్దరు ఎక్కడ కలిసినా….కెమెరాలతో పాటు ప్రతి ఒక్కరి కళ్లు వాళ్లిద్దరిపైనే ఉండేవి. లార్డ్ మౌంట్ బాటన్ పక్కన ఉన్నప్పటికీ…నెహ్రూతోనే ఎక్కువ సంభాషించేది ఎడ్వినా. అప్పట్లో వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా మెలిగారని నెహ్రూ సన్నిహితులు చెప్పుకునేవారు. లార్డ్ మౌంట్ బాటన్ కంటే నెహ్రూకే….ఎడ్వినా ప్రాధాన్యత ఇచ్చేదన్నగాలి వార్తలు ఉన్నాయి.

నెహ్రూ భార్యను కోల్పోవడంతో…ఆయనకు మహిళల తో సంబంధాలు ఉండేవని అప్పట్లో టాక్ నడిచేది. ఎడ్వినాతో నెహ్రూ నడిపిన ప్రేమ వ్యవహారం పబ్లిక్ గా తెలిసిందే. ఎడ్వినా కోసం నెహ్రూతోపాటు ముస్లిం లీగ్‌ అధినేత జిన్నా కూడా ప్రయత్నించాడని…ముగ్గురి మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడించినట్లు ప్రచారం సాగింది. నెహ్రూ, ఎడ్వినా మధ్య ప్రేమాయణం సాగిందని…అది శారీరక సంబంధం దాకా వెళ్లినట్లు పుకార్లు ఉన్నాయి. వారిద్దరి స్నేహబంధం నిత్యం లేఖలు రాసుకునే వరకు వెళ్లింది.ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం లేకపోవడంతో…కొన్ని సంవత్సరాల పాటు శారీరకంగా కలుసుకున్నట్లు సన్నిహితులు చెప్పుకునేవారు. ప్రేమ కబుర్లతో పాటు ఇద్దరి మధ్య సాగిన రసికత్వాన్ని నెహ్రూ, ఎడ్వినా ఉత్తరాల్లో రాసుకున్నారని…అవి బయట పడితే చెడ్డ పేరు వస్తుందన్న కారణంతోనే సోనియా గాంధీ లేఖలను తరలించారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో స్విమ్మింగ్ పూల్ లో ఎడ్వినా బికినితో…నెహ్రూ ఇన్నర్ తో దర్శనమివ్వడంతో ఇలాంటి అనుమానాలు మాత్రం వీడటం లేదు. దీనికి తోడు ఎడ్వినా ఎక్కడకు వెళ్లినా ఓ చక్కని సాంత్వన ఇస్తుందని… గొప్ప ప్రోత్సాహాన్ని వెంట తీసుకొస్తారంటూ నెహ్రూ స్వయంగా కితాబిచ్చారు. ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నా…ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమేనని చెప్పుకున్నా…ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నది అనేక మందికి ఉన్న అనుమానం. అంతే కాదు భారత్ తొలి హోమ్ శాఖ సహాయ మంత్రి బల్దేవ్ సింగ్ నెహ్రూ, ఏడ్వినా మధ్య రాయబారిగా వ్యవహరించారట.

జవహర్‌ లాల్‌ నెహ్రూ ఎడ్వినా మౌంట్‌బాటెన్‌కు శారీరక సంబంధం లేదని…ఆమె కుమార్తె పమేలా హిక్స్‌ చాన్నాళ్ల క్రితమే చెప్పారు. వారిద్దరి మధ్య పరస్పరం అనురాగం ఉన్న సంగతి వాస్తవమేనని అంగీకరించారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ చుట్టూ ఎప్పూడూ పోలీసులు, సిబ్బంది, ఇతరులు ఉండేవారు. అలాంటి వారి మధ్య…వారిద్దరు ఏకాంతంగా గడిపే సమయంతో పాటు శారీరక సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఎలా వస్తుందని ప్రశ్నలు వస్తున్నాయి. వారి మధ్య ఏం జరిగిందో మూడో వ్యక్తికి కూడా తెలియదు. అయితే నెహ్రూ, ఎడ్వినా మధ్య ఏం జరిగిందో చెప్పడానికి…ఇద్దరు లేరు. ఏడ్వినా 58 ఏళ్ల వయస్సు లో 1960 లో కన్నుమూశారు. నెహ్రూ 1964 లో మరణించారు.

ఈ లేఖల వ్యవహారం తో నెహ్రూ, ఎడ్వినా బంధం మరోసారి వెలుగులోకి వచ్చింది. సోనియా ఆ లేఖలను బయట పెడితే కానీ ఏది నిజమో తేలదు