Kavitha Questions: కవితను ఈడీ అడగబోయే ప్రశ్నలు ఇవేనా..?

ఢిల్లీలో రేపటి ధర్నా తర్వాత ఎల్లుండి శనివారం కవిత ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణలో ఆమెను ఏం ప్రశ్నించనున్నారు.. అనేది ఆసక్తి కలిగిస్తోంది.

  • Written By:
  • Updated On - March 9, 2023 / 03:16 PM IST

ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఊరటనిచ్చింది. ఇవాల్టి విచారణ నుంచి వెసులుబాటు కల్పించింది. ఆమె కోరినట్లే ఎల్లుండి విచారణకు హాజరయ్యేందుకు అంగీకరించింది. దీంతో రేపటి ధర్నా తర్వాత ఎల్లుండి శనివారం ఆమె ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అయితే ఈ విచారణలో ఆమెను ఏం ప్రశ్నించనున్నారు.. అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఇప్పటికే అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీలో ఉన్నారు. ఆయన కస్టడీ 13తో ముగియనుంది. తాను కవిత బినామీయే అని రామచంద్ర పిళ్లై చెప్పడంతో ఆమెతో కలిపి విచారించేందుకు ఈడీ రంగం సిద్ధం చేసిందనే వార్తలు వస్తున్నాయి.

కవిత నుంచి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ఈడీ సిద్ధమైంది. ఆమెను అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలను ఓసారి పరిశీలిద్దాం..

    • ఢిల్లీ లిక్కర్ స్కాంలో మీ పాత్ర ఏంటి..?
    • సౌత్ గ్రూపులో మీ రోల్ ఏంటి?
    • రామచంద్ర పిళ్లై మీకు ఎలా తెలుసు..?
      రామచంద్ర పిళ్లైతో మీకు ఎలాంటి సంబంధాలున్నాయి?
    • రామచంద్ర పిళ్లై మీ బినామీనా .. కాదా?
    • తాను కవిత ప్రతినిధినని రామచంద్ర పిళ్లై చెప్తున్నారు.. దీనిపై మీ సమాధానమేంటి?
    • రామచంద్ర పిళ్లైకి, మీకు మధ్య ఆర్థిక లావాదేవీలేమైనా జరిగాయా?
    • రామచంద్ర పిళ్లైతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లేనని మీరు చెప్పలేదా?
    • చార్టెడ్ ఫ్లైట్ లో వెళ్లిన మాట వాస్తవమా కాదా..?
    • చార్టెడ్ ఫ్లైట్ లో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..?
      లంచం ఇచ్చేందుకే చార్టెడ్ ఫ్లైట్ ను ఎంచుకున్నారా..?
    • లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడు కలిశారు?
    • సమీర్ మహేంద్రుతో ఫేస్ టైమ్ లో మీరు ఏం మాట్లాడారు?
    • ఆధారాలు మాయం చేసేందుకే సెల్ ఫోన్లను ధ్వంసం చేశారా?
  1. ……. ఇలా అనేక ప్రశ్నలను ఈడీ కవిత ముందుంచే అవకాశం ఉంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాక కవితను అరెస్టు చేయవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
  2. test