Janasena : సెకండ్ లిస్ట్ ఎప్పుడో ? జనసైనికులు వెయిటింగ్ !

జనసేన (Janasena) సెకండ్ లిస్ట్ కోసం ఆ పార్టీ నేతలు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ ఐదు అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 అసెంబ్లీ సీట్ల సంగతి ఏంటి... మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేది ఎవరు అని జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు.

 

 

 

జనసేన (Janasena) సెకండ్ లిస్ట్ కోసం ఆ పార్టీ నేతలు టెన్షన్ తో వెయిట్ చేస్తున్నారు. 24 అసెంబ్లీ 3 లోక్ సభ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. కానీ ఐదు అసెంబ్లీ సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన 19 అసెంబ్లీ సీట్ల సంగతి ఏంటి… మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేది ఎవరు అని జనసేన లీడర్లు ఎదురు చూస్తున్నారు.

గత వారంలో టీడీపీ-జనసేన (TDP-Janasena) మీటింగ్ పెట్టి… అందులో 99 మంది అభ్యర్థులను ప్రకటించారు చంద్రబాబు(Chandrababu), పవన్ కల్యాణ్(Pawan Kalyan). తాము 24 సీట్లల్లో పోటీ చేస్తున్నట్టు జనసేనాని చెప్పినా… ఆ రోజు మాత్రం ఐదుగురి పేర్లే అనౌన్స్ చేశాడు. మిగిలిన 19 సీట్లను పవన్ ఎందుకు ప్రకటించలేకపోతున్నాడు. అభ్యర్థుల లేకనా… పోటీ ఎక్కువగా ఉందా అన్నది అర్థం కావడం లేదు.

గత రెండు, మూడు రోజులుగా జనసేన అభ్యర్థులను ఫైనల్ చేయడంపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టినట్టు చెబుతున్నారు ఆ పార్టీ లీడర్లు. తాడేపల్లిగూడెం సభకు ముందు… తర్వాత కూడా పవన్ హైదరాబాద్ లోనే ఉన్నాడు. 10 నుంచి 12 నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా ఎవర్ని పెట్టాలో క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది. ఇవన్నీ ఉభయ గోదావరి జిల్లాలకు చెందినవే. కోస్తా, రాయలసీమ ప్రాంతాలపై ఇంకా కసరత్తు జరుగుతోందని సమాచారం. కూటమిలో భాగంగా పవన్ తక్కువ సీట్లు తీసుకోవడం కొందరికి నచ్చట్లేదు. తమకు సీట్లు రావనుకొని డిసైడ్ అయిన వాళ్ళు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. హరిరామ జోగయ్య కొడుకు సూర్యప్రకాష్ అందుకే పార్టీ మారడని అంటున్నారు.

టీడీపీ –జనసేన కూటమితో బీజేపీ పొత్తు వ్యవహారంపై ఇంకా క్లారిటీ రాలేదు. అది వచ్చాక… కమలం పార్టీ పోటీ చేసే సీట్ల సంగతి తేలాక… వారం రోజుల్లో జనసేన సెకండ్ లిస్ట్ రిలీజ్ అవుతుందని సమాచారం. రెండు పార్టీలకు పోను మిగిలిన సీట్లల్లో టీడీపీ రెండో జాబితా కింద తమ అభ్యర్థులను ప్రకటించనుంది. ఈసారి మూడు పార్టీలు కలసి అభ్యర్థుల జాబితాలను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి. కూటమిలో బీజేపీ చేరాకే మూడు పార్టీలు కలసి ఉమ్మడిగా మేనిఫెస్టోను కూడా విడుదల చేస్తాయని చెబుతున్నారు.