రాజకీయాలకు ఎమోషన్స్ కోసం లింక్ ఉండదు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఒక ఎమోషన్. తెలంగాణ ప్రజలకు కూడా కేసీఆర్ ఎమోషన్. ఇప్పుడంటే ఓడిపోయి ఆయన పెద్దగా కనబడటం లేదు కానీ ఒకప్పుడు కేసీఆర్ పేరు చెప్తే ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ కనపడేది. తెలంగాణ రాజకీయాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కూడా కేసీఆర్ ఒకరకంగా ప్రభావితం చేశారని చెప్పాలి. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజలకు మొహం చూపించడం ఇష్టం లేదో లేకపోతే మరేదైనా కారణమో తెలియదు గాని అసలు బయటికి రావటానికి మాత్రం ఇష్టపడటం లేదు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తమ బిడ్డగా రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఆశీర్వదించారు. పాలన ఎలా ఉన్నా, అవినీతి ఆరోపణలు ఎన్ని వచ్చినా 2014లో 2018లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అలాంటి కెసిఆర్ ఇప్పుడు అసలు బయటికి రాకపోవడం చాలామందిని బాధ పెడుతోంది. కెసిఆర్ ను అభిమానించేవాళ్లు అసలు ఆయన ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? ఎప్పుడు బయటకు వస్తారు..? లేకపోతే ఆయన ఆరోగ్య పరిస్థితి ఏంటి? అనే అంశాలకు సంబంధించి చాలా వరకు ఆందోళన చెందుతూనే ఉన్నారు.
ఎప్పుడో కేసీఆర్ కు సంబంధించిన ఒక వీడియోనో ఫోటోనో బయటకు రావడం లేదంటే ఎవరైనా ఆయన ఇంటికి వెళితే అక్కడ ఫోటోలు బయటకు రావడం… మినహా కేసీఆర్ బయటకు వచ్చి ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మాట్లాడితే ఒక పద్ధతిగా ఉండేది. కానీ ఆయన మాత్రం మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. కనీసం మీడియాలో కనబడటానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎవరో బిఆర్ఎస్ నాయకులు పెట్టిన ఫోటోలు మినహా కేసీఆర్ నుంచి ఒక్క సరైన అప్డేట్ కూడా ఇప్పటివరకు లేదు.
అసెంబ్లీకి రావాలని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్న సరే కెసిఆర్ మాత్రం బయటకు రావడం లేదు. హైడ్రా రెచ్చిపోయినా… ఆయన బయటికి రాలేదు. మూసీ నది విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు ప్రదర్శించిన… ఆయన బయటికి రాలేదు. రైతుబంధు ఇవ్వకపోయినా బయటకు రాలేదు, రుణమాఫీ జరగకపోయినా ఆయన బయటకు రాలేదు. ఆరు గ్యారెంటీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోయినా కేసిఆర్ నుంచి ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా బహిరంగంగా లేదు. అసలు శాసనసభ సమావేశాలు కేసీఆర్ హాజరయ్యే ఉద్దేశంలో కూడా ఎక్కడా కనపడలేదు. రేవంత్ రెడ్డి ఎంత రెచ్చగొడుతున్న కేసీఆర్ మాత్రం మౌనాన్ని ఎంచుకున్నారు.
సరే ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు కేసీఆర్ బయటకు రావాల్సింది పరిస్థితి. ఎందుకంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను… దానికంటే ముందు తన కొడుకు కేటీ రామారావును ఏసీబీ అధికారులు అరెస్టు చేయడానికి సిద్ధమయ్యారు. దీనిపై రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ మూకుమ్మడిగా కేటీఆర్ పై మాటల యుద్ధం చేస్తున్నారు. అవినీతికి పాల్పడ్డాడని 55 కోట్లు దోచుకున్నాడని, ఆ తర్వాత 600 కోట్ల అవినీతి జరిగిందని పదే పదే ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో అసలు 55 కోట్ల అవినీతి కాదని 600 కోట్ల రూపాయల అవినీతిని ప్రకటించారు.
ఇదే కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా ఎంటర్ అయింది కేటీఆర్ పై కేసు కూడా నమోదు చేసింది. ఈడీ ఎంటర్ అయిందంటే మోడీ ఎంటర్ అయినట్టే. ఇక కేటీఆర్ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి హైకోర్టుకు వెళ్లి మద్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. అయినా సరే కేసీఆర్ మాత్రం బయటకు రాలేదు. కేసీఆర్ బయటకు రావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేసినా అవి సఫలం కాలేదు. చివరకు కేటీఆర్ విషయంలో అరెస్టు వరకు వ్యవహారం వెళుతుంది… కాబట్టి కేటీఆర్ కచ్చితంగా బయటికి రావచ్చు అని చాలామంది అంచనాలు వేశారు. అయినా సరే కేసీఆర్ నుంచి స్పందన లేదు.
అసలు ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. పోనీ ఆయన ఆరోగ్యం సహకరించడం లేదా అంటే దానిపైన క్లారిటీ లేదు. కేటీఆర్ ను అరెస్టు చేస్తే కచ్చితంగా కేసీఆర్ మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. గులాబీ పార్టీ భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడిపోయే అవకాశాలు ఉన్నాయి హరీష్ రావు. పార్టీని ఎంతవరకు నడిపిస్తారో గ్యారెంటీ లేదు. అసలు కేసీఆర్ బయటికి రాకపోతే హరీష్ రావు పార్టీని లాక్కున్న ఆశ్చర్యం లేదనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి.
తాను దర్శకత్వం వహించి… తాను నిర్మాతగా వ్యవహరించి… తన కథ తాను రాసుకొని తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై భారత రాష్ట్ర సమితిని ఒకప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని నిలిపిన కేసీఆర్.. ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్తు అంధకారం అయ్యే పరిస్థితి ఉన్నా సరే బయటకు వచ్చేందుకు ఇష్టపడడం లేదు. దీని వెనక కారణమేంటో అర్థం కాక బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మల్లగుల్లాలు పడుతున్నారు. తాము ఎంత పోరాటం చేసినా కేసీఆర్ బయటికి రాకపోతే విలువ ఉండదు అనే అభిప్రాయంలో చాలా మంది ఉన్నారు. గతంలో కవితను లిక్కర్ కేసులో అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా కేటీఆర్ పోరాటం చేయడమే గాని కేసీఆర్ ఎక్కడ బయటకు రాలేదు. తెలంగాణ ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేస్తుందని కేసీఆర్ ఎన్నో అంచనాలు వేసుకున్న పెద్దగా అది కూడా వర్కౌట్ కాలేదు.
కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే ఆ రేంజ్ వేరు. పత్రికలు మీడియా అన్నీ విచ్చలవిడిగా కవర్ చేస్తాయి. సోషల్ మీడియా ఒక రకంగా ఊగిపోతుంది .కేసీఆర్ మాట్లాడే మాటలు కు అవి నిజాలైనా అబద్ధాలు అయినా సరే వెయిట్ ఎక్కువ. కాబట్టి ఆయన మాట్లాడితే బాగుంటుందని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. కరోనా టైం లో కేసీఆర్ స్పీచ్ లు నేషనల్ మీడియాను కూడా షేక్ చేసాయి. అప్పుడు కవిత అరెస్టు వ్యవహారంలో అసలు కేసీఆర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమెను అరెస్టు చేసే వరకు పరిస్థితి వచ్చిన కేసీఆర్ నుంచి స్పందన లేదు.
ఇప్పుడు కేటీఆర్ ను అరెస్టు చేసే వరకు పరిస్థితులు వెళుతున్న మరో పది రోజుల్లో కేసీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నా సరే కేసీఆర్ మాత్రం మౌనాన్ని ఎంచుకున్నారు. ఇది క్రమంగా కాంగ్రెస్ పార్టీకి బలంగా కూడా మారుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా బలమవుతోంది. తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బలపడాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీకి ఇది కచ్చితంగా ప్రధాన అస్త్రం అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసిఆర్. ఆయన అసెంబ్లీకి రాకపోతే ప్రతిపక్షానికి విలువ ఉండదు.
కేటీఆర్, హరీష్ రావు లేకపోతే పాడి కౌశిక్ రెడ్డి ఇలా ఎంతమంది ఎన్ని విమర్శలు చేసినా ఎంతమంది ఎన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేసినా సరే అది పెద్దగా వర్కౌట్ అయ్యేది కాదు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్నారనే విషయం అందరికీ క్లారిటీ ఉంది. మరి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదా లేకపోతే మరి ఏదైనా వ్యక్తిగత కారణాలా లేకపోతే రాజకీయాలు అంటే ఆసక్తి లేదా…? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఇష్టం లేక ఆయన లోపల ఉన్నారా అనేది కూడా అర్థం కావడం లేదు.
కేటీఆర్ అరెస్ట్ అయితే మాత్రం కచ్చితంగా పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నట్టే ఉంటుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ బలపడాలని ప్రయత్నం చేస్తుంది. గులాబీ పార్టీ బలహీన పడితే బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో గులాబీ పార్టీని పూర్తిగా రేవంత్ రెడ్డి తొక్కేసిన ఆశ్చర్యం లేదు. కేటిఆర్ లోపల ఉంటే పోరాటం చేసే నాయకులు ఉండరు. కాబట్టి కెసిఆర్ కచ్చితంగా బయటకు రావాలి లేదంటే మాత్రం గులాబీ పార్టీ భవిష్యత్తులో మానసికంగా మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవచ్చు.
ఎవరో ఎమ్మెల్యేలు మాట్లాడటం లేదంటే హరీష్ రావు మాట్లాడటం కాదు. స్వయంగా కేసీఆర్ మాట్లాడాలి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఒకప్పటి తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన అనుభవం ఉన్న నాయకుడిగా ఇప్పుడు విపక్షాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఆ సామర్థ్యం కేసీఆర్ కు ఉంది. ఆ సత్తువ కేసీఆర్ ఉంది అయినా సరే కేసీఆర్ మాత్రం మౌనమే ఎంచుకున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఒకలా ఉండవు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి కెసిఆర్ ఈ విషయాన్ని అర్థం చేసుకుని మెసులుకుంటే బాగుంటుంది అనేది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల అభిమతం.