వేర్‌ ఈజ్‌ మేడం ?,సడెన్‌గా సెలవులపై వెళ్లిన ఆమ్రపాలి రుషికొండ ఎఫెక్టేనా ?

రీసెంట్‌గా ఏపీ కేడర్‌కు షిఫ్ట్‌ అయిన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆఫీసర్‌ ఆమ్రపాలి.. అక్కడ కూడా తన స్పీడ్‌ కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఆమె ఏం చేసినా అది వార్తల్లోకెక్కేది. న్యూస్‌ను ఆమె టార్గెట్‌ చేస్తారా.. లేద న్యూసే ఆమె చుట్టూ తిరుగుతుదా తెలియదు కానీ..

  • Written By:
  • Publish Date - November 16, 2024 / 12:56 PM IST

రీసెంట్‌గా ఏపీ కేడర్‌కు షిఫ్ట్‌ అయిన యంగ్‌ అండ్‌ డైనమిక్‌ ఆఫీసర్‌ ఆమ్రపాలి.. అక్కడ కూడా తన స్పీడ్‌ కంటిన్యూ చేస్తున్నారు. తెలంగాణలో ఉన్నన్ని రోజులు ఆమె ఏం చేసినా అది వార్తల్లోకెక్కేది. న్యూస్‌ను ఆమె టార్గెట్‌ చేస్తారా.. లేద న్యూసే ఆమె చుట్టూ తిరుగుతుదా తెలియదు కానీ.. ఎప్పటికప్పుడు ఏదో ఒక అంశంలో ఆమె వైరల్‌ అవుతూనే ఉంటారు. రీసెంట్‌గా ఏపీకి ట్రాన్స్‌ఫర్‌ అయ్యాక ఆమ్రపాలికి పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు ఇచ్చింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. అలా చార్జ్‌ తీసుకుందో లేదో ఇలా పని మొదలు పెట్టింది ఆమ్రపాలి. రుషికొండను టార్గెట్‌ చేసి పాత ఫైల్స్‌ అన్నీ బయటికి లాగుతోంది.

చాలా కాలంగా రుషికొండ ప్యాలెస్‌ చుట్టూ రాజకీయంగా ఎన్ని వివాధాలు అల్లుకుని ఉన్నాయో సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. అలాంటి రుషికొండను టార్గెట్‌ చేసి పాత నాయకుల్లో భయం మొదలయ్యేలా చేశారు. అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవ్వకుండా పాత ఫైల్స్‌ అన్నీ తవ్వి తీయడం మొదలు పెట్టారు. ఏదో బాంబ్‌ పేలబోతోంది అని అంతా వెయిట్‌ చేస్తున్న సమయంలో ఆమ్రపాలి ఉన్నట్టుంది లీవ్‌ పెట్టేశారు. కారణమేంటో తెలియదు కాదు ఏకంగా పది రోజులు తాను అందుబాటులో ఉండబోనంటూ చెప్పారు ఆమ్రపాలి. ఈ గ్యాప్‌లో పర్యాటకాభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ బాధ్యతలను రాష్ట్ర కళాశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తాకు అప్పగించింది ప్రభుత్వం. దీంతో ఇప్పుడు ఆమ్రపాలి ఎటు వెళ్లింది. నిజంగానే పర్సనల్‌ ట్రిప్‌కే వెళ్లిందా లేక ఆఫ్ డ్యూటీలో ఇంకా ఏమైనా తవ్వి తీసే పనిలో ఉందా అని అధికార రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 500 కోట్లు ప్రజాధనంతో జగన్‌ ఈ ప్యాలెస్‌ కట్టుకున్నాడు అనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్యాలెస్‌ గురించి రాష్ట్రంలో మాట్లాడని లీడర్‌ లేడు. ఇక చంద్రబాబు పవన్‌ అయితే దీన్నే టార్గెట్‌ చేసుకుని జగన్‌తో షటిల్‌ ఆడారు. అలాంటి రుషికొండను టచ్‌ చేసి ఇప్పుడు లీవ్‌లో వెళ్లిపోయారు ఆమ్రపాలి. వచ్చాక ఆమె ఎటాక్స్‌ మళ్లీ కంటిన్యూ అవుతాయా లేక రుషికొండను లైట్‌ తీసుకుంటారా చూడాలి.