YS SHARMILA: కనిపించట్లేదు.. బెంగళూరులో మకాం పెట్టిన షర్మిల.. పార్టీ అంత వీజీ కాదని అర్థమైందా..?

ఇన్నాళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేసి, అలసిపోయి, పాపం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు షర్మిలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. అసలు ఆంధ్రా వాళ్ళకి ఇక్కడేం పని.. ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటి అని. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన షర్మిలకు ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు.

  • Written By:
  • Publish Date - November 20, 2023 / 04:33 PM IST

YS SHARMILA: షర్మిల ఎక్కడ? తెలంగాణాని ఊపేస్తా.. కేసీఆర్‌ను గద్దె దింపేస్తా.. ఆయనకు ప్రత్యామ్నాయం నేనే అంటూ బీరాలు పలికింది. పాదయాత్రలు చేసింది.. అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టి బీఆర్ఎస్‌ను ఓడిస్తానంది. రేవంత్ రెడ్డి దొంగ.. ఎక్కడైనా దొంగలు సీఎం అవుతారా అని ప్రశ్నించింది. చివరికి అదే కాంగ్రెస్‌కి అడగకపోయినా.. మద్దతు ప్రకటించి తెలంగాణ ఎన్నికల బరి నుంచి మాయమైంది. ఇప్పుడు షర్మిల హైదరాబాద్‌లోనే లేరు. బెంగళూరులో మకాం పెట్టారు. ఇన్నాళ్ళు కేసీఆర్ మీద పోరాటం చేసి, అలసిపోయి, పాపం రెస్ట్ తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి పార్టీ పెట్టినప్పుడు షర్మిలపై ఎన్నో విమర్శలు వచ్చాయి.

KISHAN REDDY: ప్రజలను మభ్యపెట్టేందుకే కాంగ్రెస్ గ్యారెంటీలు.. ధరణితో నష్టమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అసలు ఆంధ్రా వాళ్ళకి ఇక్కడేం పని.. ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటి అని. ప్రత్యేక తెలంగాణను వ్యతిరేకించిన షర్మిలకు ఇక్కడ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. అయితే ‘నా పుట్టినిల్లు ఆంధ్ర అయితే మెట్టినిల్లు తెలంగాణయే.. నేను YSR బిడ్డను.. ఇక్కడ ఓట్లు అడిగే హక్కు నాకుంది’ అంటూ విమర్శకులకు సమాధానం చెబుతూ వచ్చారు. సరేలే.. ఇప్పుడు కొత్త పార్టీతో ఒరిగేది ఏముంది అని మిగతా రాజకీయ పార్టీలు కూడా YSRTPని పెద్దగా పట్టించుకోలేదు. రాష్ట్రంలో 3 వేలకుపైగా కిలో మీటర్లు పాదయాత్ర చేయడం.. ప్రతి మంగళవారం ప్రజా సమస్యలపై దీక్షలు.. కేసీఆర్, కేటీఆర్‌పై విమర్శలు, ఆరోపణలతో హడావిడి చేశారు. ఆమెను నమ్మి.. నియోజకవర్గాల్లో YSRTP టిక్కెట్లు ఆశించిన కొందరు.. టూర్ ఖర్చులు కూడా పెట్టుకున్నారు. స

రిగ్గా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యే ముందు.. వైఎస్సార్‌టీపీని చాపచుట్టేశారు షర్మిల. అంతకుముందు సోనియా, రాహుల్ గాంధీని కలుసుకొని.. బాబ్బాబు.. మా పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకోండి అంటూ బతిమాలారు. కానీ రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ లీడర్లు ఎవరూ YSRTP విలీనానికి ఒప్పుకోలేదు. అది సాధ్యం కాకపోవడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కే తన మద్దతు అన్నది. మద్దతు అంటే సభలు, సమావేశాలు పెట్టి.. కాంగ్రెస్ ప్రచారంలో పాల్గొంటుదేమో అనుకున్నారు. కానీ ఆ రోజు ప్రెస్‌మీట్ తర్వాత షర్మిల మళ్లీ కనిపించలేదు. ఇప్పుడు బెంగళూరులో మకాం పెట్టారు. షర్మిల తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టినట్టు? ఎందుకు విఫలమయ్యారు అంటే.. ఆమెకు ఆంధ్ర అనే స్టాంప్ అయితే ఉంది. దాన్ని చెరిపేసుకోడానికి ట్రై చేసినా వర్కవుల్ కాలేదు. అంతేకాదు.. ఉమ్మడి రాష్ట్రాన్ని రాజశేఖర్ రెడ్డి పరిపాలించారు కాబట్టి.. ఆయన పేరు చెప్పుకొని నాలుగు ఓట్లు రాబట్టుకోవచ్చు అనుకున్నారు షర్మిల.

 Indoor stadium :  మొయినాబాద్ లో కుప్పకూలిన ఇండోర్ స్టేడియం.. ముగ్గురు కూలీలు దుర్మరణం..

కానీ రాజశేఖర్ రెడ్డి బొమ్మ చూపిస్తే.. ఓట్లు పడతాయి అనుకుంటే పొరపాటే. ప్రాక్టికల్‌గా పాలిటిక్స్ మరోలా ఉంటాయన్నది ఆమెకు అర్థం కాలేదు. ప్లానింగ్, ప్రచారం, పాపులారిటీ, సమస్యలపై అవగాహన.. ఇవన్నీ ఉంటేనే ప్రజల్లో తిరిగి రాజకీయం చేయడం సాధ్యమవుతుంది. కానీ వీటిపై అవగాహన లేకుండా రాష్ట్రస్థాయిలో కేసీఆర్, కేటీఆర్, కవితను.. అలాగే నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులను తిడితే సరిపోతుంది అనుకున్నారు. పాదయాత్రలు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అంత మాత్రాన జనం వెంట వచ్చి ఓట్లేస్తారనుకోవడం పొరపాటు. ఆ నిజం షర్మిల ఇప్పటికైనా గుర్తిస్తే చాలు. YSRTPలో సీనియర్ నేతలు, కన్వీనర్లు, జిల్లాస్థాయి లీడర్లు అంతా మూకుమ్మడిగా కారు ఎక్కేశారు. సో.. షర్మిల తెలంగాణలో ఇక పార్టీ బంద్ చేస్తే బెటర్. అందుకేనేమో కీలకమైన తెలంగాణ ఎన్నికల టైమ్‌లో బెంగళూరులో మకాం పెట్టారు.