వైసీపీ నేత అనిల్ ఎక్కడ.. జగన్‌ను ఇలా వదిలేశావేంటి బ్రో..

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎదుటివాళ్లు ఎవరు అని ఆలోచించరు.. జగన్‌ను ఎవరు ఏ మాట అన్నా.. తన ప్రతాపం ఏంటో చూపించేవారు. పవన్ కల్యాణ్‌ నుంచి చంద్రబాబు, లోకేశ్‌ వరకు.. ఎన్నికల ముందు అనిల్ మాములుగా ఆడుకోలే.

  • Written By:
  • Publish Date - August 21, 2024 / 06:59 PM IST

మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ నేత అనిల్‌ కుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎదుటివాళ్లు ఎవరు అని ఆలోచించరు.. జగన్‌ను ఎవరు ఏ మాట అన్నా.. తన ప్రతాపం ఏంటో చూపించేవారు. పవన్ కల్యాణ్‌ నుంచి చంద్రబాబు, లోకేశ్‌ వరకు.. ఎన్నికల ముందు అనిల్ మాములుగా ఆడుకోలే. కట్ చేస్తే సీన్ మారిపోయింది. అనిల్ ఓడిపోయాడు.. వైసీపీ అంత కన్నా ఘోరంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అనిల్ అడ్రస్‌ గల్లంతు అయింది. అసలు కనిపించడం మానేశారు.

మీడియాకు మాత్రమే చిక్కడం లేదా అంటే.. నెల్లూరు పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అందుబాటులో లేరు అని తెలుస్తోంది. దీంతో అనిల్ ఎక్కడ అంటూ నెల్లూరులో జోరు చర్చ జరుగుతోంది. 2024 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసిన అనిల్.. లక్షన్నరకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. నరసరావుపేటలో గెలవకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎన్నికల ముందు అనిల్ ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు రాజకీయాలకు, జనాలకు దూరంగా ఉండడంతో కొత్త చర్చ జరుగుతోంది. పార్టీ యాక్టివిటీస్‌కి కూడా దూరంగా ఉన్నారు.

నెల్లూరు నుంచి చెన్నైకి ఫ్యామిలీని షిఫ్ట్ చేసినట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని బిజినెస్‌లు ఉన్నాయని.. వాటినే ఫుల్ టైం చూసుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అప్పుడప్పుడూ నెల్లూరుకు వస్తున్నా.. తన సన్నిహితులతో మాట్లాడి వెళ్లిపోతున్నారే తప్ప.. పెద్దగా బయటకు ప్రొజెక్ట్ కావడం లేదని టాక్. ఐతే జగన్‌తోనే, జగన్‌ వెంటే అన్నట్లు కనిపించే, వినిపించే అనిల్‌.. ఇప్పుడు అసలు జగన్ పక్కన కనిపించడం లేదు.

ఎమ్మెల్సీగా బొత్స గెలిచిన తర్వాత.. మాజీ మంత్రులు, వైసీపీ కీలక నేతలంతా జగన్ ఇంటికి వెళ్లి కలిసి వచ్చారు. అందులోనూ అనిల్ కనిపించలేదు. దీంతో అనిల్‌కు ఏమైంది.. జగన్ మీద అలిగారా.. కావాలనే దూరంగా ఉంటున్నారా.. లేదంటే ఇంకేదైనా వ్యూహం ఉందా అనే చర్చ జరుగుతోంది. ఇక అటు జగన్ కూడా రాష్ట్రంలో చాలా తక్కువగా ఉంటున్నారు. మెజారిటీ టైమ్‌.. బెంగళూరులోనే గడుపుతున్నారు. రెండు రోజులు తాడేపల్లిలో ఉంటే… మిగతా రోజులు బెంగళూరుకు వెళ్లిపోతున్నారు. అనిల్ కూడా అదే బాటలో ఉన్నారని వినిపిస్తోంది.