మహా సిఎం ఎవరు…? క్లారిటీ వచ్చేనా…?

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), శివసేన మరియు ఎన్‌సిపి కూటమి భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సందిగ్దత నెలకొంది.

  • Written By:
  • Publish Date - November 23, 2024 / 03:39 PM IST

మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ (బిజెపి), శివసేన మరియు ఎన్‌సిపి కూటమి భారీ విజయాన్ని సాధించిన నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎవరు అనే దానిపై సందిగ్దత నెలకొంది. మహారాష్ట్రలో మహాయుతి కూటమిగా ఏర్పడిన ఎన్డియే… భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. ఎన్డీయే అఖండ విజయం, రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నపై మహారాష్ట్ర సీఎం, శివసేన నేత ఏక్‌నాథ్ షిండే స్పందిస్తూ .. ‘అంతిమ ఫలితాలు రావాలి..

ఆ తర్వాత అదే విధంగా మేం కలిసి ఎన్నికల్లో పోరాడాం, మూడు పార్టీలు కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాయి అని స్పష్టం చేసారు. ఇదే ప్రశ్నకు మూడు పార్టీలు కలిసి కూర్చుని నిర్ణయం తీసుకుంటాయని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా క్లారిటీ ఇచ్చారు. పాలక మహాయుతి కూటమిలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, భారతీయ జనతా పార్టీ (బిజెపి), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అజిత్ పవార్ శిబిరం ఉన్నాయి.