Congress: కర్ణాటకకు కాబోయే సీఎం ఎవరు.. కాంగ్రెస్‌ అసలు ఐక్యత ఇప్పుడు బయటపడుతుంది..

కర్ణాటక ఎన్నికల్లో అన్ని సర్వేలు ఏం చెప్పాయో అదే జరిగింది. ఊహించినదానికంటే ఎక్కువ మెజార్టీతో కన్నడ పీఠాన్ని కాంగ్రెస్‌ దక్కించుకుంది. కర్ణాటకలో కాంగ్రెస్‌ గెలుపుకు ముఖ్య కారణం.. పార్టీ నేతల మధ్య ఐక్యత. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీలో ఉండే అంతర్గత పోరు గురించి సపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు.

  • Written By:
  • Publish Date - May 14, 2023 / 03:18 PM IST

అప్పట్లో జరిగిన పంజాబ్‌ ఎన్నికల్లో ఈ అంతర్గత పోరే పార్టీ కొంప ముంచింది. ఓట్‌బ్యాంక్‌ చీలిపోయి ఎవరూ ఊహించనివిధంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్‌ చేసింది. కానీ ఆ మిస్టేక్‌ కర్ణాటకలో జరకుండా జాగ్రత్త పడ్డారు కాంగ్రెస్‌ నేతలు. ఒక్క మాటపై ఉండి పార్టీని గెలిపించుకున్నారు. క్యాస్ట్‌ బేసిస్‌లో కూడా వ్యూహాత్మంకంగా అడుగులు వేసి కాంగ్రెస్‌ జెండా ఎగురవేశారు. ఇప్పటిదాకా అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు ఆట మొదలైంది. కర్ణాటకకు ఇప్పుడు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిద్ధరామయ్యా? లేక ఇచ్చిన మాట నిలబెట్టుకుని కాంగ్రెస్‌ పార్టీకి నమ్మిన బంటుగా ఉన్న పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమారా? ఇదే ప్రశ్న ఇప్పడు కన్నడనాట హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే కర్ణాటకలో ఎవర్నడిగినా సిద్ధరామయ్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది. 2006లో కాంగ్రెస్‌ పార్టీలో చేరిన సిద్ధరామయ్య సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత. ఎక్కువ ప్రజాధరణ పొందిన నేత. నేషనల్‌ మీడియా నిర్వహించిన సర్వేల్లో కూడా దాదాపు అన్నిట్లో సిద్ధరామయ్య పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఆయనే కాబోయే సీఎం అని అంతా ఫిక్స్‌ అయ్యారు. కానీ కాంగ్రెస్‌ పార్టీ సాంప్రదాయం ప్రకారం ముందు సీఎల్పీ మీటింగ్‌ నిర్వహిస్తారు.

ఎమ్మెల్యేల అభిప్రాయం విడివిడిగా తీసుకుంటారు. ఆ తరువాత ఎవరికి ఎక్కువ మెజార్టీ ఉంటే వాళ్ల పేరును సీఎంగా హై కమాండ్‌ ఎనౌన్స్‌ చేస్తుంది. అయితే ఇప్పుడు శివ కుమార్‌ సీఎం అయ్యే చాన్సెస్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి. శివకుమార్‌కు ఉన్న మేజర్‌ అడ్వాంటేజ్‌.. కాంగ్రెస్‌ పార్టీ పట్ల నిబద్ధత. ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీలో ఉంటూ నమ్మిన బంటుగా పనిచేసిన లీడర్‌ ఆయన. సిద్ధ రామయ్య మధ్యలో వచ్చయిన వ్యక్తి. అంతే కాదు హైకమాండ్‌కు ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటక పీఠాన్ని గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు శివకుమార్‌. కమ్యూనిటీ పరంగా కూడా కర్ణాటకలో బలమైన వక్కలిగా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి శివకుమార్.

నిజానికి ఈ వక్కలిగాలు జేడీఎస్‌కు ట్రెడిషనల్‌ సపోర్టర్స్‌. కానీ జేడీఎస్‌ బీజేపీతో పొత్తు పెట్టుకున్న తరువాత కుమారస్వామి మీద వక్కలిగాల నమ్మకం సన్నగిల్లింది. వాళ్లు కోరుకున్న 12 శాతం రిజర్వేషన్‌ను కుమారస్వామి సాధించి ఇవ్వలేకపోయారు. ఇదే అవకాశాన్ని వాడుకున్న శివకుమార్‌ వక్కలిగాలను తనవైపు తిప్పుకున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే వక్కలిగాల్లో దేవే గౌడ తరువాత మళ్లీ అంత గుర్తింపు పొందిన నేతగా ఎదిగాడు శివకుమార్‌. కర్ణాటకలో డామినేంటింగ్‌ కమ్యూనిటీ లింగాయత్‌లు, వక్కలిగాలు. లింగాయత్‌లు ఎలాగూ బీజేపీ వైపే ఉన్నారు. దీంతో వక్కలిగా కమ్యూనిటీకి చెందిన శివకుమార్‌ను సీఎం చేస్తే.. ఆ కమ్యూనిటీ ఓట్‌బ్యాంక్‌ పర్మనెంట్‌గా కాంగ్రెస్‌కు మారిపోయే చాన్స్‌ ఉంది.

ఇది ఫ్యూచర్‌లో కూడా కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌ అవుతుంది. దీంతో శివకుమార్‌ సీఎం అయ్యే అవకాశం కూడా ఉంది. సిద్ధరామయ్య కంటే సీనియర్‌ కాకపోయినా ఈ ఎన్నికల్లో శివకుమార్‌ పని చేసిన విధానానికి కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఫిదా ఐంది. దీంతో ఆయనను కూడా సీఎం అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ లెజిస్లేచర్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసే సన్నాహాల్లో ఉంది. ఎమ్మెల్యేల నిర్ణయం తీసుకున్న తరువాత ఎవర్ని సీఎం చేస్తారనేది ఆసక్తిగా మారింది.

ఇక్కడున్న ఇంకో కాన్‌ఫ్లిక్ట్‌ ఏంటీ అంటే.. ఇప్పటి దాకా పార్టీ నేతలు కలసికట్టుగా పోరాడారు సరే. కానీ ఇప్పుడు సీఎం సీటు ఎవరో ఒకరికి ఇస్తే మరో వర్గం తిరుగుబాటు చేసే చాన్స్‌ లేకపోలేదు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ బీజేపీకి ప్లస్‌ అవుతుంది. ఇప్పటిదాకా పడ్డ కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరౌతుంది. దీంతో సిద్ధరామయ్య, శివకుమార్‌కు చెరో రెండున్నరేళ్లు సీఎంగా అవకాశమిచ్చే యోచనలో కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఉన్నట్టు సమాచారం. ఇలా అయినా ముందు చాన్స్‌ సిద్ధరామయ్యకే వచ్చే అవకాశాలే ఎక్కువ. మరి లెజిస్లేచర్‌ మీటింగ్‌ తరువాత కాంగ్రెస్‌ పార్టీ ఎలాంటి ఎనౌన్స్‌మెంట్‌ ఇస్తుందో.. ఆ నిర్ణయానికి పార్టీ నేతలు ఎలా కట్టుబడి ఉంటారో చూడాలి.