TELANGANA CONGRESS: చార్మినార్‌ స్థానం ఎందుకు పెండింగ్‌.. కాంగ్రెస్‌ అసలు ప్లాన్ తెలిస్తే షాక్ అవుతారు..

మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట స్థానాలను పెండింగ్‌లో పెట్టారంటే.. ఏదో అనుకోవచ్చు. కానీ చార్మినార్‌ను ఎందుకు పెండింగ్‌లో పెట్టారు అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది. చార్మినార్ మినహా.. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం భారీ పోటీ కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - November 8, 2023 / 05:56 PM IST

TELANGANA CONGRESS: 119 నియోజకవర్గాల‌లో 115 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్‌ (CONGRESS). మరో 4 స్థానాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయ్. మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట, చార్మినార్‌ (CHARMINAR)కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. మిర్యాలగూడ, తుంగతుర్తి, సూర్యాపేట స్థానాలను పెండింగ్‌లో పెట్టారంటే.. ఏదో అనుకోవచ్చు. కానీ చార్మినార్‌ను ఎందుకు పెండింగ్‌లో పెట్టారు అనే ప్రశ్న ప్రతీ ఒక్కరిని వెంటాడుతోంది. చార్మినార్ మినహా.. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్‌ టికెట్‌ కోసం భారీ పోటీ కనిపిస్తోంది.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ ఎన్నికల్లో ఈసీ కీలక నిర్ణయం.. కీలక నిబంధనలు తెలుసుకోండి..

మరో స్థానం.. పొత్తులో భాగంగా పెండింగ్‌లో పెట్టారు. అలాంటిది చార్మినార్‌ను ఎందుకు హోల్డ్‌ చేయాల్సి వచ్చిందన్న విషయంపై.. జనాలు ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు. చార్మినార్‌ అసెంబ్లీ స్థానం అంటే.. ఎంఐఎం (MIM) కంచుకోట. 1989 నుంచి ఇప్పటివరకు ఎంఐఎం పార్టీనే గెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. ఇంకే పార్టీ అయినా సరే.. ఇక్కడ కనీసం పోటీ ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఆ పార్టీల నుంచి పోటీ చేయడం కంటే.. రాజకీయాలకు దూరంగా ఉండడం బెటర్ అనుకుంటారు చాలామంది. అలాంటి చార్మినార్‌ స్థానాన్ని కాంగ్రెస్‌ పెండింగ్‌లో పెట్టడం వెనక భారీ స్ట్రాటజీ ఉందనే ప్రచారం జరుగుతోంది. చార్మినార్‌ నుంచి ఎంఐఎం నుంచి ముంతాజ్ అహ్మద్‌ ఖాన్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో 32వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఆయన విజయం సాధించారు. ఐతే ఆయనకు ఈసారి ఎంఐఎం టికెట్ నిరాకరించింది. దీంతో ఆయనను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

Teenmar Mallanna: అంతన్నావ్‌.. ఇంతన్నావ్‌.. కాంగ్రెస్‌లో చేరావ్‌.. వాటీజ్ దిస్ మల్లన్న..

1994 నుంచి 2014 వరకు యాకుత్‌పురా నుంచి బరిలో దిగి 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ట్రాక్ రికార్డు అహ్మద్ ఖాన్ సొంతం. ఐతే ఈసారి ఆయన సేవలను ఉపయోగించుకుంటామని.. టికెట్ ఇవ్వబోమని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ చెప్పేశారు. దీంతో అహ్మద్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీ మారేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ నేతలు రెడీ అయ్యారట. చార్మినార్ ఎన్నికల బరిలో అహ్మద్ ఖాన్‌ను కాంగ్రెస్ తరఫున నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఆయనకు ఆఫర్ కూడా ఇచ్చారని తెలుస్తోంది. కాంగ్రెస్ మూడో జాబితాలో కూడా చార్మినార్ సీటు ఎవరికీ కేటాయించకపోవడం కూడా ఈ వార్తలకు మరింత బలం ఇస్తోంది. మరి ఇది నిజమా.. ప్రచారంగానే మిగిలిపోతుందా అంటే.. వెయిట్ అండ్ వాచ్‌.