PAWAN KALYAN: ఏపీలో ఎన్నికల ప్రచార జోరు కొనసాగుతోంది. ఓ వైపు వైసీపీ మరో వైపు కూటమి నేతలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తరచుగా అనారోగ్యానికి గురవుతున్నారు. రీసెంట్‌గానే ఓ సారి జ్వరం కారణంగా ప్రచారం ఆపేసిన పవన్ ఇప్పుడు మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అసలు పవన్ ఆరోగ్యానికి ఏమయ్యింది అనే అనుమానాలు అందరిలో కలుగుతున్నాయి.
Pothina Mahesh: జనసేనకు పోతిన మహేశ్ రాజీనామా..
ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో ఈ గ్యాప్‌లోనే అన్ని ప్రాంతాలు కవర్ చేసేలా షెడ్యూల్ రెడీ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్. తాను పోటీ చేస్తున్న పిఠాపురంలోనే మూడు రోజులు ఉండి ప్రచారం నిర్వహించారు. తరువాత జనసేన అభ్యర్థుల పోటీ చేస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్‌లను కూడా కవర్ చేస్తున్నారు. దీంతో టైట్ షెడ్యూల్‌లో ఉదయం సాయంత్రం రెస్ట్ లేకుండా ప్రచారానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. నిజానికి జనసేన అభ్యర్థుల ప్రకటనే చాలా ఆలస్యంగా జరిగింది. ఎన్నికలకు ఉన్నదే చాలా తక్కువ టైం. దీనికి తోడు ఈ ఎన్నిక అటు టీడీపీకి ఇటు జనసేనకు చావు బతుకు లాంటి పోరు. దీంతో ఉన్న ఈ కాస్త టైంలోనే అన్ని ప్రాంతాలు కవర్ చేయాలి. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంతో పాటు జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్న అన్ని ప్రాంతాలు కవర్ చేయాలి పవన్. ఈ కారణంగానే రెస్ట్ లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. మరోపక్క తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో 43 డిగ్రీల వరకూ టెంపరేచర్ ఉంటోంది. రాత్రి సమయంలో కూడా వాతావరణం వేడిగానే ఉంటోంది.
ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రచారం కొనసాగిస్తున్నారు పవన్ కళ్యాణ్. రీసెంట్‌గా అనకాపల్లిలో ప్రచారం ముగించుకుని వైజాగ్ వెళ్తుండగా కూడా ఎండ కారణంగా అనారోగ్యానికి గురయ్యారట. ఇప్పుడు మరోసారి పవన్‌కు ఫీవర్ రావడంతో మరోసారి ప్రచారానికి బ్రేక్ పడింది. పవన్‌కు వస్తున్న ఈ ఆరోగ్య సమస్యలు వైసీపీకి ఆయుధంగా మారాయి. దీన్ని బేస్ చేసుకుని పవన్ కళ్యాణ్ జనసేనను టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. రెండు రోజులు ప్రచారం చేస్తే నాలుగు రోజులు రెస్ట్ తీసుకుంటున్నారంటూ అంబటి రీసెంట్‌గా పవన్‌పై రెచ్చిపోయారు. ఇలా అనారోగ్యాన్ని ఫేస్ చేస్తూ మరోపక్క ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలను పవన్ ఎలా కౌంటర్ చేస్తారో చూడాలి.