Jayasudha: కమలదళంలో క్రైస్తవ గళం.. విజయశాంతి కోసమే జయసుధను చేర్చుకున్నారా..?

జయసుధ చేరికతో కాషాయదళం క్రైస్తవ గళం వినిపించబోతోంది. ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. అంత కష్టపడి జయసుధను బీజేపీలోకి ఎందుకు చేర్చుకున్నారు అనే చర్చ రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనాల్లో వినిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 01:00 PM IST

Jayasudha: సహజనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. నడ్డా ఆధ్వర్యంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీకి జయసుధ సిద్ధం అవుతున్నారు. జయసుధ చేరికతో కాషాయదళం క్రైస్తవ గళం వినిపించబోతోంది. ఇది సక్సెస్ అవుతుందా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. అంత కష్టపడి జయసుధను బీజేపీలోకి ఎందుకు చేర్చుకున్నారు అనే చర్చ రాజకీయవర్గాలతో పాటు సామాన్య జనాల్లో వినిపిస్తోంది.
బీజేపీ ఎలాంటి హామీలు ఇచ్చింది..? జయసుధ ఎలా ఒప్పుకున్నారు..? ఎవరికి చెక్ పెట్టడానికి ఆమెను పార్టీలో చేర్చుకున్నారు..? అనే చర్చ జోరుగా సాగుతోంది. వైఎస్ హయాంలో జయసుధ రాజకీయాల్లోకి వచ్చారు. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత వైసీపీలోకి జయసుధ జంప్ చేస్తుందని అంతా భావించారు. కట్ చేస్తే.. టీడీపీలో చేరి అందరినీ ఆశ్చర్యపరిచారు. అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయారు. చంద్రబాబుకు షాక్ ఇస్తూ టీడీపీకి కూడా గుడ్ బై చెప్పారు. గతేడాది నుంచి ఆమె బీజేపీలో చేరుతారని పెద్ద ఎత్తున ప్రచారం మొదలైంది. విజయశాంతికి గట్టి పోటీగా పార్టీలోకి జయసుధ ఎంట్రీ ఖాయమని అంతా అనుకున్నారు.

ఐతే చేరిక వ్యవహారాన్ని నానుస్తూ వచ్చిన జయసుధ ఇన్నాళ్లకు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయశాంతికి పోటీగానే జయసుధను పార్టీకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కమలం పార్టీ మీద రాములమ్మ కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు. కిరణ్‌ కుమార్ రెడ్డి వ్యవహారంపై బహిరంగంగానే కామెంట్లు చేశారు. రేపోమాపో పార్టీకి గుడ్‌బై చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీంతో ఆమెకు చెక్ పెట్టేందుకు జయసుధను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. విజయశాంతికి పోటీగా ఉండడమే కాదు.. ప్రచారంలోనూ సినీ గ్లామర్ వర్కౌట్ అవుతుందని బీజేపీ భావిస్తోంది. ఇక అటు తాను పార్టీలో చేరడానికి ముందు బీజేపీ ముందు జయసుధ కొన్ని డిమాండ్లు పెట్టారట. వాటికి కూడా కమలం పార్టీ పెద్దలు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. మరి బీజేపీలో అయినా జయసుధ పొలిటికల్ జర్నీ కంటిన్యూ అవుతుందా.. ఎప్పటిలానే బ్రేకులు వేస్తుందా.. చూడాలి మరి.